Guppedantha Manasu Promo: రిషిధార అభిమానులకు పండుగలాంటి ఎపిసోడ్.. రిషి వసు మధ్య సూపర్ సీన్!
Guppedantha Manasu Promo: పెద్ద సంఘటన నుంచి సేఫ్ గా బయటపడినందుకు ఎమోషనల్ అవుతూ భర్తని ముద్దు పెట్టుకుంటుంది వసుధార. నేను నీ భర్తని మాత్రమే కాదు నీకు అన్ని విషయాలలో కాపలా ఉంటాను అని అంటాడు రిషి.
Guppedantha Manasu Promo: స్టార్ మాలో మంచి టీఆర్పీ రేటింగ్ ని సంపాదించుకుంటూ ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానం సంపాదించుకున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి ప్రేక్షకాదరణతో దూసుకుపోతోంది. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సీరియల్ మంచి కాన్సెప్ట్ తో అందరిని ఆకట్టుకుంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో రిషివాళ్ళు చిత్రని పోలీసుల ముందుకు తీసుకువస్తారు. అప్పుడు పోలీసులు చిత్రని నిజం చెప్పమని అడుగుతాడు. అప్పుడు చిత్ర వసుధార మేడం తనని రక్షించడానికి అక్కడికి వచ్చారని అసలు వాసు నేను ప్రేమించుకోలేదని, వాసు నన్ను ప్రేమించమని ఇబ్బంది పెడుతున్నాడు.
అందుకు వాసుని మందలించి రిషి సార్, వసుధార మేడం నాకు ధైర్యం చెప్పారని చెప్తుంది. మరి ఈ లెటర్ ఏంటి అని సూసైడ్ లెటర్ చూపిస్తాడు పోలీసు. అసలు నేను సూసైడ్ చేసుకోలేదు వీళ్లు నా చేత బలవంతంగా లెటర్ మీద సైన్ చేయించారు అంటుంది చిత్ర.
అబద్ధం ఎందుకు చెప్తున్నావ్ అంటారు ఆమె తల్లిదండ్రులు. పోలీస్ కూడా నిజం చెప్పు నువ్వు ఎవరికి భయపడవలసిన పనిలేదు అంటాడు. నేను ఎందుకు అబద్ధం చెప్తాను సార్, అబద్ధం చెప్తున్నది వాళ్ళు అంటుంది చిత్ర. అసలు వాళ్లు తన తల్లిదండ్రులు కాదని తన పిన్ని బాబాయ్ అని చిన్నప్పటి నుంచి తనని ఎన్నో కష్టాలు పెట్టారని ఆఖరికి నన్ను చంపాలని చూశారని ఏడుస్తూ చెప్తుంది.
అయినప్పటికీ పోలీసు నమ్మకపోతే సాక్ష్యాధారాలు చూపిస్తే నమ్ముతారు కదా అంటూ వాసుని అక్కడికి తీసుకు వస్తాడు రిషి. ఇదంతా ఇంట్లో కూర్చొని ఫోన్లో చూస్తూ ఉంటుంది దేవయాని. చిత్ర బ్రతికి ఉండడం చూసి షాక్ అవుతుంది. ఇప్పుడు వాసు ఏం చెప్తాడు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. నిజం చెప్పు చిత్రని ఎందుకు చంపాలి అనుకున్నావు అని అడుగుతాడు రిషి. నేను చంపాలి అనుకోలేదు అంటూ అబద్ధం చెప్తాడు వాసు.
అప్పుడు రిషి సాక్షాధారాలు చూపించడంతో తన తప్పుని ఒప్పుకుంటాడు వాసు. ఇతను కావాలని చేసింది కాదు దీని వెనుక ఎవరో ఉన్నారు అంటాడు రిషి. అప్పుడు దేవయాని తమ పేరు ఎక్కడ చెప్పేస్తాడో అని మరింత కంగారుపడుతుంది. అయితే వాసు ముందు నా వెనక ఎవరూ లేరు అని చెప్తాడు కానీ తర్వాత రిషి బెదిరించడంతో ఎమ్మెస్సార్ పేరు చెప్తాడు.
అప్పుడు వాసుని అరెస్టు చేసిన పోలీస్ ఎమ్మెస్సార్ మీద కంప్లైంట్ ఇవ్వండి నేను చూసుకుంటాను అంటాడు. అప్పుడు రిషి వద్దు, ఇప్పటికైనా ఎవరు ఎలాంటివారు తెలుసుకోండి, అతని సంగతి నేను చూసుకుంటాను అని చెప్పడంతో వాసుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పోలీసు. ఆ తరువాత రిషి, వసుధార, దేవేంద్ర వాళ్ళు చిత్రకి ధైర్యం చెప్తారు.
ఇక రేపటి ప్రోమోలో..
రిషి చేతిని పట్టుకొని ఏడుస్తూ ముద్దు పెట్టుకుంటుంది వసుధార. ఇదేంటి స్పెషల్ థాంక్స్ ఆ అని అడుగుతాడు రిషి. అవును అంటుంది వసుధార. అప్పుడు రిషి నీకు నేను నాకు నువ్వు ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి. నేను నీకు భర్తని మాత్రమే కాదు,
నీ భవిష్యత్తుకి, నీ జీవితానికి నీ ప్రాణానికి ఒక కాపలా అంటాడు. యువర్ మై జెంటిల్మెన్ సార్ అంటుంది వసుధార. రిషి అన్నట్టుగానే శైలేంద్ర కుట్రల నుంచి వసుధారని కాపాడగలుగుతాడా, దేవయాని శైలేంద్రకి జరిగిందంతా చేరవేస్తుందా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇంతటితో ప్రోమో పూర్తవుతుంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆