అన్వేషించండి

Guppedanta Manasu Serial Today May 17th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌ : బెడిసికొట్టిన శైలేంద్ర ప్లాన్ - వసును కిడ్నాప్ చేసిన రాజీవ్

Guppedanta Manasu Today Episode : శైలేంద్ర ప్లాన్ బెడిసి కొట్టి.. రాజీవ్ వసును కిడ్నాప్ చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది.

Guppedanta Manasu  Serial Today Episode : వసుధారను తీసుకెళ్తానని శైలేంద్ర, మహేంద్రకు చెప్పి వసుధారను వెళ్దామని అడగడంతో వసుధార వెళ్తూ మామయ్యా మీ కొడుకును కాపాడే భాద్యత నాది అనడంతో శైలేంద్ర షాక్‌ అవుతాడు. కొడుకు అంటుందేంటి అని మనసులో అనుకుంటాడు. ఇంతలో వసుధార అదే మామయ్యా మీరు దత్తత తీసుకోవాలనుకున్న కొడుకుని కాపాడతానని చెప్తుంది. దీంతో శైలేంద్ర ఊపిరి పీల్చుకుంటాడు. తర్వాత వసుధార, అనామికకు మహేంద్రకు చెప్పి శైలేంద్రతో వెళ్తుంది. శైలేంద్ర, వసుధార కారులో వెళ్తుంటే రాజీవ్‌ వాళ్ల కారుకు అడ్డంగా నిలబడతాడు. శైలేంద్ర కారు దిగి వెళ్తాడు.

వసుధార: బావ నాకు తెలుసు నువ్వు బతికే ఉన్నావని

రాజీవ్‌: నిన్ను దక్కించుకోకుండా నేను ఎక్కడికి పోతాను.

వసు: అసలు  ఏంటీ ఈ డ్రామా?

రాజీవ్‌: నీకోసమే... ఆ మను గాడు ప్రతి విషయంలో అడ్డొస్తున్నాడు. అందుకే వాణ్ని బాగా ఇరికించాను. ఇక ఇప్పుడు ఈ శైలేంద్ర నిన్ను కాపాడతాడు అనుకున్నావా? ఈ శైలేంద్ర నా మనిషి. ఇదంతా మా ప్లాన్‌.

అంటూ వసుధారను రాజీవ్‌ తీసుకెళ్తుంటే వసుధార వెళ్లదు. శైలేంద్ర వద్దు అంటాడు. దీంతో రాజీవ్‌ వసుధారకు మత్తు ఇచ్చి కారులో పడుకోబెడతాడు. శైలేంద్ర నేను చెప్పిన లోకేషన్ ఇది కాదు కదా అక్కడ కాకుండా ఇక్కడ ఎందుకున్నావు అని అడుగుతే అదంతా సేఫ్టీ కోసమేలే అని రాజీవ్‌ చెప్పి వెళ్దాం పద అని శైలేంద్రకు చెప్తే తన కారులో వస్తానని శైలేంద్ర చెప్పగానే గన్‌ తీసి నా కారు ఎక్కకపోతే దీన్ని గన్‌ అంటారు అని బెదిరిస్తాడు. శైలేంద్రను వసుధారను తీసుకుని సీక్రెట్‌ ప్లేస్‌కు వెళ్తాడు. మరోవైపు అనామిక, మహేంద్ర టెన్షన్‌ పడుతుంటారు.

మహేంద్ర: ఏంటి అనుపమ టెన్షన్‌గా ఉందా?

అనుపమ: చాలా టెన్షన్‌గా ఉంది మహేంద్ర. ఇప్పటిదాకా మను బయటకు వస్తాడా? రాడా అని టెన్షన్‌గా ఉండేది. కానీ ఇప్పుడు వసుధారకు ఏం జరుగుతుందేమోనని టెన్షన్‌గా ఉంది.

మహేంద్ర: ఏం కాదు అనుపమ వసుధారకు ఏం కాదు. అలాగే మను కూడా నిర్ధోషిగా బయటకు వస్తాడు.

అంటూ మహేంద్ర, అనుపమకు ధైర్యం చెప్తుంటాడు. మరోవైపు శైలేంద్ర, వసులను ఓ ఇంటికి తీసుకెళ్లిన రాజీవ్‌ పెళ్లికొడుకులా తయారై వస్తాడు. వసు కుర్చిలో కట్టేసి ఉంటుంది.

రాజీవ్‌: మరదలు పిల్లా ఈరోజు నీకు తాళి కట్టకుండా ఉండేదే లేదు. భయ్యా అన్ని కరెక్టుగానే ఉన్నాయి కదా? ఏంటి మరదలు పిల్లా తప్పించుకోవాలని చూస్తున్నావా? చెప్తున్నాను కదా పిల్లా ఈరోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదు.

శైలేంద్ర: బ్రదర్‌ మరీ ఇంత హింస చేస్తూ పెళ్లి చేసుకోవడం అవసరమా?

రాజీవ్‌: తప్పదు కదా భయ్యా.. మనం ఒకటి బలంగా కోరుకున్నప్పుడు హింసా మార్గంలోనో అహింసా మార్గంలోనో దాన్ని నెరవేర్చుకోవాలి.

వసు: ఏయ్‌ శైలేంద్ర మమ్మల్నే చీట్‌ చేస్తావా? రాజీవ్‌ను పట్టిస్తానని చెప్పేసి నన్ను ఇరికిస్తావా?

శైలేంద్ర: ఏయ్‌ వసుధార ఏంటి అలా మాట్లాడుతున్నావు.

రాజీవ్‌: ఏంటి మరదలు పిల్లా నేను సినిమాలు చూస్తాను. మా ఇద్దరి మధ్య గొడవ పెట్టి మేము కొట్టుకుంటుంటే నువ్వు ఎస్కేప్‌ అవుదామనుకుంటున్నావా? భయ్యా తాను నీ మీద  ఎన్ని చాడీలు చెప్పినా నేను విననులే భయ్యా.

అనగానే శైలేంద్ర ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలని కనీసం ఫోన్‌ ఆన్‌ చేసినా పోలీసులు లోకేషన్‌ ట్రేస్‌ చేసి వచ్చేవారు అని మనసులో అనుకుని కాస్త బయటకు వెళ్లి వస్తానని శైలేంద్ర అనడంతో రాజీవ్‌ గన్‌ ఎయిమ్‌ చేసి ఇక్కడే ఉండమని చెప్పాను కదా అంటూ బెదిరిస్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ఈ నిర్ణయమే చార్మి కెరీర్‌ని దెబ్బతిసిందా? - స్టార్‌ హీరోయిన్‌ నుంచి నిర్మాతగా చార్మి సినీ ప్రస్థానం

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
Gundeninda Gudigantalu August 15th:మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
గుండెనిండా గుడిగంటలు: మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
Podarillu Serial Today August 15th:చక్రితో ఒడిబియ్యం పోయించుకున్న మహా...పున్నమి పూజ కోసం సిద్ధమైన మహాలక్ష్మీ.
పొదరిల్లు: చక్రితో ఒడిబియ్యం పోయించుకున్న మహా...పున్నమి పూజ కోసం సిద్ధమైన మహాలక్ష్మీ

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
Embed widget