అన్వేషించండి

Guppedanta Manasu Serial Today March 30th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: కాలేజీకి వచ్చిన మను – శైలేంద్రకు గట్టి వార్నింగ్‌

Guppedanta Manasu Today Episode:

Guppedanta Manasu  Serial Today Episode:  దేవయాని, శైలేంద్ర ఇద్దరూ కలిసి అనుపమ, మనుల గురించి అలోచిస్తుంటారు. వాళ్లిద్దరి మధ్య గొడవ మను తండ్రి గురించి ఉండొచ్చని దేవయాని అంటుంది. ఎంటి మమ్మీ మొత్తం తెలిసినట్లే, స్టడీ చేసినట్లే  చెబుతున్నావు అంటూ శైలేంద్ర అనగానే కొన్ని విషయాల్లో స్టడీ చేయాల్సిన అవసరం లేదు నాన్నా అంటుంది దేవయాని. ఆ మనుగాడు చిన్నప్పటి నుంచి తండ్రి విషయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉంటాడు. అదే వాళ్లిద్దరి మధ్య గొడవలకు దారి తీసి ఉండొచ్చు అని దేవయాని చెప్తుంది. దీంతో ఆ మనుగాడిని ఎలా ఆడుకుంటానో చూడు. వీలు చేసుకుని మరీ వాడి దగ్గర వాళ్ల నాన్న విషయం తీసుకొస్తాను. వాన్ని వదిలిపెట్టను అంటాడు. మరోవైపు ఎంజేల్‌ అనుపమను రూంలోకి తీసుకొస్తుంది.

ఎంజేల్‌: ఎమైనా కావాలా అత్తయ్యా? ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావు కదా?

అనుపమ: ఎందుకు?

ఎంజేల్‌: అదే మీ కొడుకుతో కలిసి భోజనం చేశారు కదా? మీరు పైకి కోపంగా చూసినా మనసులో మాత్రం సంతోషంగా ఉంటుందని మాకు తెలుసు. మీతో పాటు మా బావతో కలిసి భోజనం చేసినందుకు నాక్కూడా సంతోషంగా ఉంది అత్తయ్యా.

వసు: మేడం చిన్న రిక్వెస్ట్‌ మీరు ఒప్పుకుంటానంటే అడుగుతాను మేడం.

అను: ఈ మద్య ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు అనుకున్నవి అనుకున్నట్లు చేసేస్తున్నారు కదా? నా ఇష్టాఇష్టాలతో నా అంగీకారంతో పనిలేదు కదా

వసు: మను గారిని మళ్లీ కాలేజీకి పిలిపించడం కరెక్టు మేడం.

అను: ఏం ఇప్పుడు తను కాలేజీకి రాకపోతే ఏమౌతుంది. ఇంతకు ముందు తను లేకుండా మీరంతా కాలేజీ నడిపారు కదా?

వసు: అవును మేడం నడిపాం కానీ కాలేజీ కష్టాల్లో ఉన్నప్పుడు తనే కాలేజీ మన చేజారిపోకుండా కాపాడారు.

అను: తను కాలేజీలో మళ్లీ వర్క్‌ చేయడానికి అయిష్టంగానే ఉన్నట్టున్నాడు కదా? అయినా ఎం చేసుకుంటారో మీ ఇష్టం

వసు: మేం అడిగితే మను గారు రానన్నారు మేడం.

అను: రాను అన్నప్పుడు బతిమాలడం ఎందుకు?

వసు: బతిమాలడం కాదు మేడం మీరు కాలేజీకి రమ్మని చెబితే వస్తాడేమో?

అనగానే అనుపమ ఆలోచిస్తూ ఉటుంది. మరోవైపు శైలేంద్ర కాలేజీలో మను రాడని ఆలోచిస్తుంటాడు. ఇంతలో మను వస్తాడు. వీడేంటి రాడనుకుంటే వచ్చాడు వీడు కూడా మానం మర్యాద వదిలేశాడా ఏంటి అని మనసులో అనుకుంటుంటాడు.

మను: ఎంటి షాకై చూస్తున్నావు కాలేజీకి రాననుకున్నావా? నువ్వేదో మనసులో అనుకుని ఉంటావు కదా? నాకు చీము నెత్తురు అన్నీ ఉన్నాయి. తప్పులు చేసే గుణమే లేదు.

శైలేంద్ర: అవునా? అయినా మంచి క్వాలిటీయే కదా బ్రదర్‌. అయినా నేను మనసులో అనుకుంటుంది భలే కనిపెట్టేశావు?

మను: నువ్వు ఇంతకన్నా  బెటర్‌గా  ఆలోచిస్తావని నేనెలా అనుకుంటా? మొన్న జరిగిన ఇష్యూకి వీడు రాడు అనుకున్నావేమో.. కానీ ఏ చిన్న ఇష్యూ జరిగినా నేను ఊరుకోను పుచ్చ లేచిపోద్ది జాగ్రత్త.

అంటూ మను వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతాడు. శైలైంద్ర కోపంగా మనును చూస్తూ ఒరేయ్‌ మను నువ్వు నా మనసులో ఉన్నది కనిపెట్టావు కానీ నా అసలు ఉద్దేశ్యం కనిపెట్టలేవు అని మనసులో అనుకుంటాడు. మరోవైపు  కాలేజీలో ఉన్న వసుధార మను గురించి ఆలోచిస్తుంది. తాను వస్తాడో రాడోనని అనుకుంటుండగానే అటెండర్‌ వచ్చి ఫైల్‌ ఇచ్చి మీరు సైన్‌ చేశాక మను సార్‌ సైన్‌ చేస్తానన్నారు అని చెప్పగానే వసు హ్యాపీగా ఫీలవుతుంది. ఇదే విషయం అనుపమకు చెప్పి థాంక్స్‌ చెప్తుంది వసుధార. తర్వాత వసు, మను దగ్గరకు వెళ్లి థాంక్స్ చెప్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:టీడీపీలో చేరిన టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ - కండువా కప్పి ఆహ్వానించిన నారా లోకేశ్

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 7th: 'గోదావరి' సీరియల్: కల్యాణ్‌ని చెప్పుతో కొట్టిన గౌతమి! చెల్లి పరిస్థితికి తల్లడిల్లిపోయిన నందు, జాను!
'గోదావరి' సీరియల్: కల్యాణ్‌ని చెప్పుతో కొట్టిన గౌతమి! చెల్లి పరిస్థితికి తల్లడిల్లిపోయిన నందు, జాను!
Nindu Manasulu Serial Today August 7th: నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!
నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!
Karthika Deepam 2 Serial Today August 7th: కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి కోసం జ్యోత్స్నకి పారు బ్లాక్‌మెయిల్! జ్యోత్స్నని రిజెక్ట్ చేసిన సూరజ్! దిమ్మతిరిగే ట్విస్ట్‌లు!
కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి కోసం జ్యోత్స్నకి పారు బ్లాక్‌మెయిల్! జ్యోత్స్నని రిజెక్ట్ చేసిన సూరజ్! దిమ్మతిరిగే ట్విస్ట్‌లు!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 7th:మందుతాగి వచ్చి అందరి ముందు రచ్చచేసిన ప్రియా...సుందరి నకిలి చిట్టీ అంటూ గొడవ
నువ్వులేక నేను లేను: మందుతాగి వచ్చి అందరి ముందు రచ్చచేసిన ప్రియా...సుందరి నకిలి చిట్టీ అంటూ గొడవ

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
Embed widget