అన్వేషించండి

Gruhalakshmi January 2nd Episode - ‘గృహలక్ష్మీ’ సీరియల్‌: బాంబు పేల్చిన కొత్త డాక్టర్, దివ్యను నమ్మిన విక్రమ్

Gruhalakshmi Serial Today Episode: లాస్య తీసుకొచ్చిన డాక్టర్ ట్రీట్మెంట్ కరెక్టా కాదా చెక్ చేసుకోవాలని మరో డాక్టర్ ను తులసి ఇంటికి పిలిపించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఆసక్తిగా జరిగింది.

Gruhalakshmi Telugu Serial Today Episode: ఇంట్లో పని మనిషి రాములమ్మ లాస్య గురించి మాట్లాడుతుంటే.. లాస్య గురించి ఏం మాట్లాడొద్దు అంటుంది తులసి. దీంతో రాములమ్మ కోపంగా లాస్యను తిడుతుంది. ఇంతకుముందే మిమ్మల్ని ఎన్ని కష్టాలు పెట్టిందో మీకు తెలియంది కాదు. అయినా మళ్లీ ఆమెనే వెనకేసుకొస్తున్నారు మీరు అంటుంది రాములమ్మ.

రాములమ్మ: కొత్త డాక్టర్‌ ను అడ్డుపెట్టుకుని లాస్యమ్మ నాటకమాడుతుందని నా మనసుకు తెలుస్తుంది. ఆ కొత్త డాక్టర్‌ వైద్యం మొదలెట్టాకే పెద్దయ్యగారు లాస్యమ్మను కలవరించడం మొదలుపెట్టారు. మీరే బాగా ఆలోచించండి.

అంటూ రాములమ్మ చెప్తుండగానే అక్కడకు అనసూయ వస్తుంది.

అనసూయ: అవును తులసి. రాములమ్మ చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం. అంతకుముందు ఎప్పుడూ లాస్య గురించి పట్టించుకోని మీ మామయ్య కొత్త డాక్టర్‌ ట్రీట్‌మెంట్‌ మొదలు పెట్టాకే లాస్య గురించి మాట్లాడుతున్నారు.

తులసి: మీరు చెప్పదలచుకుంది ఏంటి అత్తయ్య.. తెలిసిని డాక్టర్‌ కాబట్టి లాస్య కొత్త డాక్టర్‌ను మేనేజ్‌ చేసి ఉంటుంది అంటే నమ్ముతాను. కానీ అల్జీమర్స్‌ తో బాధపడుతున్న మామయ్యని డాక్టర్‌ ఎలా మేనేజ్‌ చేస్తారు. అది కుదిరే పనేనా?

అనగానే అనసూయ, రాములమ్మ ఇద్దరూ కలిసి తులసిని తిడతారు. నువ్వు పాత తులసివేనా అంటూ ప్రశ్నిస్తారు. దీంతో తులసి కన్వీన్స్‌ అయ్యి అయితే కొత్త డాక్టర్‌ రిపోర్ట్‌ అన్నీ మరో డాక్టర్‌కు చూపిద్దామని చెప్తుంది. దీంతో అలాగే చేద్దామని అనుకుంటారు. ఈ విషయం లాస్యకు తెలియకుండా జాగ్రత్త పడాలనుకుంటారు.

మరోవైపు దివ్య బాధపడుతూ.. ఫోన్‌లో తులసి ఫోటో చూస్తూ.. ఏడుస్తుంది. విక్రమ్‌ వచ్చి దివ్యను ఓదారుస్తూ..

విక్రమ్‌: మనం సరదాగా మాట్లాడుకుని ఎన్ని రోజులైందో?

దివ్య: నీకింకా ఆ విషయం గుర్తుందా? నేనెప్పుడో మర్చిపోయాను మళ్లీ ఆ రోజులు తిరిగి వస్తాయన్న ఆశ కూడా లేదు.

విక్రమ్‌: ఎందుకంత నిరాశ

దివ్య: అది నిరాశ కాదేమో? దురాశ అనుకుంటున్నాను. పిచ్చి తగ్గట్లేదు అనుకోవడం నిరాశ? మళ్లీ ఎప్పటిలాగే ఉండాలనుకోవడం దురాశ.

విక్రమ్‌: జీవితం ఎప్పుడూ ఒకేళా ఉండదు.

దివ్య: ఆ నిజం నాకు ఈ మధ్యనే తెలిసింది. ముందు డైజెస్ట్‌ కాలేదు. ఆ తర్వాత అలవాటు అయిపోయింది.   

  అనగానే నువ్వు యాక్సిడెంట్‌ చేసిన అమ్మాయి ఎలా ఉంటుందో నువ్వు గుర్తు పట్టగలవా? అంటూ విక్రమ్‌ అడగ్గానే.. దివ్య షాక్‌ అవుతుంది. అదేంటి అసలు నేను యాక్సిడెంట్‌ చేశానంటేనే నమ్మలేదు. ఇప్పుడేంటి ఇలా అడుగుతున్నారు అనగానే నువ్వు యాక్సిడెంట్‌ చేశావని నేను నమ్ముతున్నాను. అనగానే దివ్య హ్యాపీగా ఫీలవుతుంది. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి అని అడుగుతుంది దివ్య. ఏం లేదు. నేనో మంచి ఆర్టిస్టును తీసుకొస్తాను ఆ చనిపోయిన అమ్మాయి ఫోటో వేయిద్దాం తర్వాత ఏం జరగాలో చూద్దాం అంటాడు. దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న సంజయ్‌ షాక్‌ అవుతూ వెంటనే ఈ విషయం అమ్మకు చెప్పాలని రాజ్యలక్ష్మీ దగ్గరకు వెళ్లి జరిగిన విషయం చెప్తాడు. ఇప్పుడేం చేద్దాం అనుకుంటూ రాజ్యలక్ష్మీ, బసవయ్య షాక్‌ అవుతారు. మరోవైపు లాస్య, బసవయ్య చెస్‌ అడుతుంటారు. దూరం నుంచి వాళ్లనే గమనిస్తున్న అనసూయ, తులసిలు డాక్టర్‌ కోసం ఎదురుచూస్తుంటారు. ఇంతలో డాక్టర్‌ వస్తాడు. డాక్టర్‌ కు తులసి  జరిగిందంతా చెప్తుంది.

తులసి: అత్తయ్య లాస్య ముఖం చూశారా? టెన్షన్‌ పడుతుంది.

అనసూయ:  దొరికిపోతుంది చూడు.

తులసి: ఇది మామయ్యగారి ఫైల్‌. ట్రీట్‌మెంట్‌కు సంబంధించి అన్ని వివరాలు ఉన్నాయి. మీ ఒపినియన్‌ కోసం మిమ్మల్ని పిలిపించాం.

అని తులసి డాక్టర్‌కు చెప్పగానే ఆయన ఫైల్‌ మొత్తం చూసి ఈ డాక్టర్‌ను మీకు సజెస్ట్‌ చేసింది ఎవరని అడగ్గానే తులసి, లాస్యను చూపిస్తుంది. డాక్టర్‌ అనుమానంగా లాస్య దగ్గరకు వెళ్తుంటే అందరూ షాకింగ్‌ గా చూస్తుంటారు. డాక్టర్‌.. లాస్య దగ్గరకు వెళ్లి ఎక్సలెంట్‌ మేడం మీరు పేసెంట్‌కు మళ్లీ పునర్జన్మను ఇచ్చారు. మంచి డాక్టర్‌ను సజెస్ట్‌ చేశారు. అంటూ తులసికి కూడా ఈ డాక్టర్‌ను కళ్లు మూసుకుని నమ్మేయొచ్చు అని చెప్పి వెళ్లిపోతాడు. దీంతో లాస్య ఏడుస్తున్నట్లు నటిస్తూ.. పరంధామయ్యతో ఇంట్లోంచి వెళ్లిపోతానంటుంది. దీంతో పరంధామయ్య   కూడా నేను నీతో పాటు వస్తాననడంతో అందరూ షాక్‌ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Also Readసర్కారు నౌకరి రివ్యూ: సింగర్ సునీత కొడుకు ఆకాష్ మొదటి సినిమా

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 20th : ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
Charishma Shreekhar : బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget