అన్వేషించండి

Gruhalakshmi November 7th : ‘గృహలక్ష్మీ’ సీరియల్‌ : కంపెనీ సీఈవోగా తులసి? విక్రమ్​ను ఫాలో చేస్తున్న జాను!

కంపెనీ కొత్త సీఈవోగా బోర్డు డైరెక్టర్స్ తులసిని ఎన్నుకోవడంతో లాస్య మీటింగ్ హాల్ లోంచి వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ మరింత ఆసక్తిగా మారింది.

ధనంజయ్‌ గారిని ఈ కంపెనీ సీఈవోగా బోర్డు ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక రిజల్యూషన్‌ మాత్రమే పాస్‌ చేయాల్సి ఉంది. ఇక బయలుదేరుతారా తమరు అంటూ లాస్య వెటకారంగా తులసికి చెప్పగా..

తులసి: లాస్య బయటుదేరాల్సింది నేను కాదు మీరు.

లాస్య: ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు తులసి. పర్మిషన్‌ లేకుండా కంపెనీ మీటింగ్‌ లోకి ఎంటర్‌ అవ్వడమే కాకుండా  కంపెనీ సీఈవోని దూషిస్తావా? హౌ డేర్‌ యూ

తులసి: ఆ డైలాగులు నీవి కాదు నావి

లాస్య: మేనేజర్‌ బయటి వాళ్లు బోర్డు మీటింగ్‌లో ఏదేదో వాగుతుంటే గుమ్మనకుండా చూస్తావేంటి? డబ్బుకు అమ్ముడుపోయావా? లేదా నీ పాత బాస్‌ కదా అని మర్యాద చూపిస్తున్నావా? ముందు వీళ్లిద్దరిని మెడపట్టి బయటికి తోయండి.

తులసి: అసలు ఏమనుకుంటున్నారు. మీ గురించి మీరు. ఎవరు పడితే వాళ్లు కూర్చోవడానికి ఇది గార్డెన్‌ చైర్‌ కాదు. కంపెనీ సీఈవో చైర్‌. దీనికో విలువ ఉంది. దీనిలో కూర్చునే వారికి ఒక అర్హత ఉండాలి. వ్యక్తిత్వం ఉండాలి. సామ్రాట్‌ గారి లాంటి గొప్ప వ్యక్తి కూర్చున్న ఈ చైర్‌లో మీ లాంటి బఫూన్‌ గాడు కూర్చుంటే చూస్తూ ఎలా ఊరుకుంటా అనుకున్నారు.

అంటూ ఒక ఫైల్‌ తీసి లాస్య వాళ్లకు చూపిస్తుంది. అందులో  ఆ కంపెనీ బాధ్యతలను, హని బాధ్యతను తులసికి ఇస్తున్నట్లు సామ్రాట్‌ గారు రాసిన వీలునామా ఉంటుంది. అది చూడగానే లాస్య, రత్న, ధనంజయ్‌ అందరూ షాక్‌ అవుతారు. బోర్డ్‌ డైరెక్టర్స్‌ కూడా తులసిని సీఈవోగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. దీంతో లాస్య, రత్న, ధనంజయ్‌ అక్కడి నుంచి వెళ్లిపోతారు.

లాస్య: మీరేం పట్టించుకోరా? బాధ్యత లేదా? మొత్తం నామీద వేసి కాళ్లు జాపుకుని కూర్చుంటారా? పవర్‌ ఆఫ్‌ పట్టాని రెండేళ్ల క్రితమే తులసి పేరు మీద రాస్తున్న విషయం తెలుసుకోకుండా ఎలా ఉన్నారు.

రత్న: అది సీక్రెట్ అగ్రిమెంట్‌ ఆ పేపర్​ను తులసి తన దగ్గరే దాచుకుంది. మూడో కంటికి తెలియదు. అలాంటప్పుడు మాకెలా తెలుస్తుంది.

తులసి: పట్టించుకోకు రత్న తను అలాగే అరుస్తుంది. కష్టపడి హని కోసం అడ్డమైన ప్లాన్లు వేసింది. శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యే సరికి ఉక్రోషం అపుకోలేకపోతుంది. మీ మీద అరిచి ప్రస్టేషన్‌ తగ్గించుకోవాలనుకుంటుంది.

అంటూ లాస్యకు, రత్నకు, ధనంజయ్‌కి గట్టిగా వార్నింగ్‌ ఇస్తుంది తులసి. మీరు మారకపోతే మిమ్మల్ని వదిలిపెట్టనని బెదిరిస్తుంది. మీరు చేసిన తప్పులన్నీ భయటపెట్టి కోర్టులో మీకు శిక్ష పడేలా చేస్తానని హెచ్చరిస్తుంది. మీరు లాస్యను నమ్ముకుంటే చెడిపోతారని చెప్పి వెళ్లిపోతుంది తులసి.  

హనిమూన్‌కి వెళ్లిన దివ్య విక్రమ్​ల వెనకాలే జాను వాళ్ల డాడీ వస్తారు.

జాను: చూశావా డాడీ దివ్య బావ చేయి ఎలా పట్టుకుందో?

జానుడాడీ: పెళ్లాం కదమ్మా..

జాను: మరి నేను

డాడీ: కాబోయే పెళ్లానివి

జాను: బావ విషయంలో తప్పు చేస్తున్నానేమో అనుకున్నాను. మారిపోయాను కూడా కానీ తులసి ఆంటీ కిడ్నాప్‌ డ్రామా చూసి మళ్లీ మనసు మార్చుకున్నాను.

దివ్య విక్రమ్‌తో ఈ ప్లేస్‌ చాలా బాగుందని ఎప్పటికీ ఇక్కడే ఉండి పోదామని చెప్తుంది. దీంతో జాను వాళ్ల డాడీ మిమ్మల్ని విడదీయడానికే మేము ఇక్కడి కొచ్చాము అనుకుంటాడు. దివ్య జానుకు ఫోన్‌ చేస్తుంది. జాను ఫోన్‌ స్విచ్చాప్‌ చేస్తుంది. మనం ఇక్కడికొచ్చింది ఎంజాయ్‌ చేయడానికి వాళ్ల గురించి ఆలోచించడానికి కాదు కదా అంటూ ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తారు.

తాతయ్య, బామ్మ హనితో అడుకుంటూ ఉంటారు. ఇంతలో తులసి, నందగోపాల్‌ వస్తారు.

హని: ఆంటీ మీ ముఖంలో ఈరోజు ఏదో డిఫరెంట్‌ కనిపిస్తుంది 

బామ్మ: నిజమే అమ్మ నీ ముఖంలో ప్రపంచాన్ని జయించినంత ఆనందం కనిపిస్తుంది.

తులసి: ఒక విధంగా ప్రపంచాన్ని జయించాననిపిస్తుంది.

అనగానే కుటుంబ సభ్యులు అందరూ ఆనందంగా ఉంటారు. నందగోపాల్‌ కంపెనీ బాధ్యతల్లో నీకు సపోర్టుగా ఉంటానని భరోసా ఇస్తాడు. నాకు నువ్వు ఎన్నో సార్లు సపోర్టుగా నిలబడ్డావు. కానీ నేనెప్పుడూ నీకు హెల్ఫ్‌ చేయలేదు. ఇప్పటికైనా నీ రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వు అని అడుగుతాడు. దీంతో తులసి సంతోషంగా సరే అంటుంది.

 విక్రమ్‌, దివ్య రూంలో టీవీ చూస్తుంటారు. ఇంతలో దివ్య టీవీ ఆఫ్‌ చేస్తుంది. జాను బుర్ఖా వేసుకుని అద్దం ముందు తనను తాను చూసుకుంటుంది. ఇంతటితో ఇవాళ్టి ఏపిసోడ్‌ ముగుస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 30th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో కీలక మలుపు! లక్ష్మీ బతికే ఉందా.. ఆధారాలు అవేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో కీలక మలుపు! లక్ష్మీ బతికే ఉందా.. ఆధారాలు అవేనా!
Godavari Serial Today July 30th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చిన జాను! సింహాద్రి చెంప పగొలగొట్టిన శారద!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చిన జాను! సింహాద్రి చెంప పగొలగొట్టిన శారద!
Karthika Deepam 2 Serial Today July 30th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న పేరు 108 సార్లు రాసిన సూరజ్.. ఆ కామెంట్స్ వైరల్! కోడలికి పెద్దాయన స్ట్రాంగ్‌ వార్నింగ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న పేరు 108 సార్లు రాసిన సూరజ్.. ఆ కామెంట్స్ వైరల్! కోడలికి పెద్దాయన స్ట్రాంగ్‌ వార్నింగ్!
Nindu Manasulu Serial Today July 30th: నిండు మనసులు: నీ కొడుకు ఫొటోకి దండ వేసేస్తావ్.. సారీ చెప్పిన ఎమ్మెల్యేకే సిద్ధూ సెన్సేషనల్ వార్నింగ్! గణ ఫైర్!
నిండు మనసులు: నీ కొడుకు ఫొటోకి దండ వేసేస్తావ్.. సారీ చెప్పిన ఎమ్మెల్యేకే సిద్ధూ సెన్సేషనల్ వార్నింగ్! గణ ఫైర్!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Warangal Viral News: వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
Embed widget