Chaitanya Master: సూసైడ్ చేసుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ - అప్పుల బాధ తట్టుకోలేక!
ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ చైతన్య ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Chaitanya Master Suicide: ప్రముఖ డ్యాన్స్ షోలో కొరియోగ్రాఫర్‌గా మంచి పేరు తెచ్చుకున్న చైతన్య మాస్టర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నెల్లూరులోని క్లబ్ హోటల్‌లో చైతన్య సూసైడ్ చేసుకున్నట్లు సెల్ఫీ వీడియోలో తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు, పెరిగిపోయిన అప్పుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చైతన్య సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు.
ఆత్మహత్య చేసుకుంటున్నందుకు తన తల్లిదండ్రులకు, తన తోటి డ్యాన్స్ మాస్టర్లకు, డ్యాన్సర్లకు చైతన్య సారీ చెప్పారు. అప్పులు తీర్చగల సామర్థ్యం తనకు ఉన్నప్పటికీ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని తెలిపారు.
అప్పులను తీర్చుకునేందుకు మరో అప్పు, దాన్ని తీర్చేందుకు ఇంకో అప్పు ఇలా చాలా ఎక్కువ అయిపోయాయన్నారు. తనకు పేరు తెచ్చిన డ్యాన్స్ షోకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. ఆ డ్యాన్స్ ప్రోగ్రాం ద్వారా పేరు వచ్చింది కానీ డబ్బులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సంస్థ నిర్వహిస్తున్న మరో కామెడీ షోలో ఎక్కువ పారితోషికం లభిస్తుందని చెప్పారు.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
ట్రెండింగ్ వార్తలు






















