Chinni Serial Today November 8th: చిన్ని సీరియల్: చిల్లర, కొబ్బరి చిప్ప ప్రాప్తిరస్తు! వీళ్లేం తల్లిదండ్రులురా నాయనా!
Chinni Serial Today Episode November 8th వరుణ్, లోహితల నల్లపూసల తంతు జరగడం, దేవా మ్యాడీని ఒప్పించడానికి రావాలని అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode లోహిత తల్లిదండ్రులుగా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నటులు భాగ్యం, ఇడ్లీబాబాయ్‌లు నటించడానికి ఆర్టిస్టులుగా వస్తారు. చిల్లర కింద పడటంతో ఇద్దరూ కింద పడి తొందరపడి లాక్కుంటారు. లోహి చూసి బిత్తరపోతుంది. ఎక్కడ నుంచి తెచ్చావే వీళ్లని అని తన ఫ్రెండ్‌ని తిడుతుంది.
మధు గుమ్మం ముందు ముగ్గు పెడుతుంటే మ్యాడీ చూసుకోకుండా ముగ్గు మట్టేసి ఫోన్ మాట్లాడుతూ వెళ్తుంటే మధు చూసి వెనకాలే వెళ్తుంది. ఇక దేవా మ్యాడీని కలవడానికి మధు వాళ్ల ఇంటికి బయల్దేరుతాడు. నాగవల్లి దేవాతో బావ నువ్వు గొడవ పడొద్దు.. పెద్దగా మాట్లాడొద్దు కొంచెం ఆచితూచి మాట్లాడు బావ అంటుంది. దానికి దేవా నేనేం గొడవ పడటానికి వెళ్లడం లేదు వల్లీ.. నేను ప్లాన్ చేసుకొని వెళ్తున్నా వాడిని తీసుకొనే వస్తా అంటాడు.
లోహిత తన తల్లిదండ్రులు వచ్చారు అని వరుణ్, మ్యాడీ, మధుని బయటకు తీసుకెళ్తుంది. ఇక మధు వాళ్ల దగ్గర గన్‌మెన్‌ల్ని చూసి వీళ్లు నిజంగా నీ తల్లిదండ్రులేనా.. మ్యాడీ నాన్న మినిస్టర్ కాబట్టి వాళ్ల దగ్గర గన్ మెన్‌లు ఉంటారు. మీ పేరెంట్స్ దగ్గర ఉంటే డౌట్ వచ్చిందని అంటుంది. మేం కూడా బాగా రిచ్ కదా అందుకే గన్‌మెన్‌ల్ని పెట్టుకున్నాం అని లోహి అంటుంది.
లోహిత అందర్ని పరిచయం చేస్తుంది. ఇద్దరూ వచ్చి రాని ఇంగ్లీష్‌లో మాట్లాడి అందరికీ అనుమానం వచ్చేలా చేస్తారు. దానికి లోహిత కవర్ చేస్తుంది. తన తల్లిదండ్రులు కామెడీ చేస్తున్నారు అని అంటుంది. ఇక వరుణ్‌ని చూపించి తనే మీ అల్లుడు అని అంటుంది. మేం అతన్ని అల్లుడిగా అంగీకరించం.. మనది 20వ ఫ్లోర్ అయితే వాళ్లది గ్రౌండ్ ఫ్లోర్ అని అంటారు. అర్థం చేసుకోండి అని లోహిత అంటే ఇద్దరూ లోహిత చెంపలు వాయించేస్తారు.
మధు, మ్యాడీ, వరుణ్ షాక్ అయిపోతారు. ఏంటి ఆడపిల్లని అలా కొడుతున్నారు. మా బావ గ్రౌండ్ ఫ్లోర్ కాదు తను మినిస్టర్ మేనల్లుడు.. నేను ఎవరో తెలుసా సాక్ష్యాత్తు మినిస్టర్ కొడుకుని.. కొన్ని కారణాల వల్ల మిమల్ని ఇక్కడకు పిలిపించి చెప్దాం అంటే ఆడపిల్లని కొడతారా అని కోప్పడతాడు. దాంతో మధు మ్యాడీని ఆపి వాళ్లకి స్టోరీ చెప్తుంది. లోహిత వాళ్ల దగ్గరకు వెళ్లి ఎక్కువ లాగకండి తెగిపోతుంది అని అంటుంది. మేం అల్లుడిని అంగీకరిస్తున్నాం అమ్మా అని వాళ్లు ఒకే చెప్పేస్తారు.
నల్లపూసల తంతుకి అందరూ రెడీ అవుతారు. వరుణ్, లోహిత పూజ చేస్తారు. ఇక లోహిత తండ్రిగా వచ్చిన ఆర్టిస్ట్ గన్‌మెన్ జేబులో డబ్బులు కొట్టేయడం మధు చూస్తుంది. ఇదేంటి అని నోరెళ్ల బెడుతుంది. ఇక అతను మరో గన్‌మెన్ దగ్గర ఫోన్ కొట్టేస్తాడు. అది మధుతో పాటు లోహితకూడా చూస్తుంది. మధు చూడటం లోహిత చూస్తుంది. అది అతను చూసి కవర్ చేయడానికి మీరు నాకు గన్‌మెన్‌లుగా వచ్చి మీ దగ్గర ఏం పోతున్నాయో చూడటం లేదు అని వాళ్లకి ఇస్తాడు. ఇక లోహిత చంపేస్తా అని అతనికి వార్నింగ్ ఇస్తుంది.
లోహిత కొబ్బరి కాయ కొడుతుంది. కొబ్బరి చిప్ప పడటంతో దాని కోసం లోహిత తల్లిదండ్రులుగా వచ్చిన వాళ్లు ఆ కొబ్బరి చిప్ప కోసం నాది అంటే నాదే అని కొట్టుకుంటారు.అందరూ బిత్తరపోయి చూస్తారు. తర్వాత కొబ్బరి చిప్ప నేల మీద పడకూడదు అని కవర్ చేస్తారు. ఇక వరుణ్ లోహిత నుదిటి మీద బొట్టు పెట్టి నల్లపూసలు వేయడం మధు చూసి మ్యాడీనే చూస్తూ ఉంటుంది. ఇక లోహిత వరుణ్ ఆశీర్వాదం తీసుకుంటుంది. తర్వాత ఇద్దరూ లోహిత తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటారు. చిల్లర, కొబ్బరి చిప్పల ప్రాప్తి రస్తు అని దీవిస్తారు. అందరూ నోరెళ్ల బెడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















