అన్వేషించండి

chinni serial today march 31st: చిన్ని సీరియల్: మ్యాడీ చిన్నికి దగ్గరవుతున్నాడా! మూడు జంటలకు మంగళస్నానాలు!

chinni serial today episode march 31st మ్యాడీ బల్లికి భయపడి చిన్నిని హగ్ చేసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode చిన్ని తల్లి ఫోటో దగ్గర ఏడుస్తూ ఉంటే ప్రమీల చూసి వెళ్లి ఏంటమ్మా ఆ కన్నీరు.. ఇంట్లో సంతోషంగా అందరి ముందు తిరుగుతున్నావ్..ఇప్పుడేంటి అమ్మా ఇలా.. ఎవరితో చెప్పుకోలేని బాధ మీ అమ్మకి చెప్పుకుంటున్నావ్ అని నాకు అర్థమైంది.. నిన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను నమ్ముతానమ్మా.. చిన్నప్పుడే మిమల్ని ముడి వేసిన ఆ దేవుడు. మిమల్ని విడదీయడు.. ఇలాంటి చిన్న చిన్న సమస్యల్ని నువ్వు ఎదుర్కొని మీ బంధం నిలబెట్టుకుంటావ్ నాకు నమ్మకం ఉందమ్మా అని చెప్తుంది. 

మధుగా నీ మీద వాడికి ప్రేమ లేకపోయినా.. ఆ రోజు తాళి కట్టినా తర్వాత ప్రేమించాడు.. రేపు కూడా అలాగే ఇష్టం లేకుండా రేపు నల్లపూసలు వేసినా మళ్లీ నిన్ను ప్రేమిస్తాడు అని ప్రమీల అంటుంది. ఈ ఇంట్లో నా మంచి కోరుకునే ఏకైక మనిషి మీరే ఆంటీ.. మీ మంచితనమే నాకు కొండంత అండ.. మీరు ఇలా చెప్తుంటే నాకు మా అమ్మే ధైర్యం చెప్తున్నట్లు ఉందని హగ్ చేసుకుంటుంది. మ్యాడీ బెడ్ మీద బల్లి చూసి పక్కనే ఉన్న కబోర్డ్ ఎక్కిపోయి బల్లీ బల్లీ అని అరుస్తాడు. చిన్ని చూసి ఏమైందని అడుగుతుంది. భయం అని మ్యాడీ అంటే పెళ్లాం అంటే భయమా అని అడుగుతుంది. నేనేం నీకు భయపడటం లేదు అని బల్లిని చూపిస్తాడు.

చిన్ని నవ్వితే తర్వాత తీరికగా నవ్వుకుందువు ముందు బల్లిని పంపు అని అంటుంది. ఇక మ్యాడీ కిందకి దిగుతూ బల్లీ బల్లీ అని చిన్నిని హగ్ చేసుకుంటాడు. తర్వాత చిన్ని బల్లి నీ మీదే ఉందని మ్యాడీ చిందులు వేసేలా చేస్తుంది. బల్లి ఎక్కడ పడిందో మ్యాడీ చెప్తే చిన్ని మెలికలు తిరిగి మీకు దాంపత్యసుఖం ఉందని చెప్తుంది. చిన్నిని కసిరేసి మ్యాడీ దుప్పటి కప్పుకొని పడుకుంటాడు. 

ప్రమీల ఉదయం అందర్ని పిలిచి మ్యాడీకి మంగళ స్నానం చేయాలి అని హడావుడి చేస్తుంది. శ్రేయ అత్తతో వరుణ్‌, లోహిత కూడా పీటల మీద కూర్చొంటే బాగుంటుందని అంటుంది. దానికి నాగవల్లి మ్యాడీ మంచి కోసం చేస్తున్నాం.. మ్యాడీ తల్లిదండ్రులుగా మేం కూడా కూర్చొంటే అర్థముంది మరి లోహిత, వరుణ్ కూర్చొవడం ఏంటి అని అంటుంది. తనేదో తెలీక అంది మీరే కూర్చొండి అత్తయ్యా అని వరుణ్ అంటే సరిపోదు.. మీ జంట కూర్చొవాలి.. మ్యాడీ ఇక్కడే ఈ ఇంటి వారసుడు కాదు.. చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లో పెరిగిన నా మేనల్లుడు కూడా ఈ ఇంటి వారసుడే వాడు కూడా కల్యాణంలో కూర్చొంటాడని అంటాడు. ఇక మూడు జంటలకు మంగళస్నానాలు ఏర్పాటు చేస్తారు. ఎవరి భార్యలు వాళ్లకి చేయాలని ప్రమీల అంటుంది. ఇదంతా నీ స్కీమా అని మ్యాడీ చిన్నిని అడిగితే ఇదంతా మీ పెద్దమ్మ చేస్తున్న స్కామ్ అని అంటుంది. 

మూడు జంటలకు మంగళస్నానాలకు ఏర్పాట్లు చేస్తారు. ఎవరి భార్యలు వాళ్ల భర్తలకు గంధం రాసి స్నానాలు చేయిస్తారు. మ్యాడీ చిన్ని కళ్లలోకి చూస్తాడు. మ్యాడీకి మధు కుంకుడు కాయ పెడుతూ ఉంటే కళ్లలోకి కుంకుడు రసం పోతుంది. ఆ మాత్రం చూసుకోవా అని లోహిత అంటుంది. చిన్ని మ్యాడీ కళ్లు ఊదుతుంది. మ్యాడీలో మార్పు వచ్చిందని అందరూ అనుకుంటారు. తర్వాత మ్యాడీ రెడీ అవుతుంటే వరుణ్ వెళ్లి చిన్ని మెడలో నల్లపూసలు వేస్తున్న సంతోషం నీ కళ్లలో కనిపిస్తుందని అంటాడు వరుణ్.

చిన్ని అంటే నీకు చిన్నప్పటి నుంచి ప్రాణం.. చిన్ని కోసం చిన్ని ప్రేమ కోసం అమెరికా నుంచి వచ్చేశావ్.. అలాంటి చిన్ని కోసం నువ్వు ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు బావ.. చిన్ని నీ దగ్గర నిజం దాయడం తప్పే కానీ ఎందుకు అలా చేసిందో తెలుసుకోవడం లేదు అని అంటాడు. చిన్ని మీద ప్రేమ నువ్వు ఎప్పటికీ చంపుకోలేవు అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget