chinni serial today march 30th: చిన్ని సీరియల్: చిన్నిని అనుమానించిన మ్యాడీ! కోయిదొర విషయం తెలిసిపోయిందా!
chinni serial today episode march 30th దేవా కల్యాణానికి ఉండను అని చెప్పడం.. నాగవల్లి ఒప్పించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode శ్రేయ బాధ పడుతుంటే లోహిత వెళ్లి నువ్వేం టెన్షన్ పడుకు శ్రేయ మీ అత్తయ్య ఎంత చెప్పినా మ్యాడీ కల్యాణానికి నల్లపూసల కార్యక్రమానికి ఒప్పుకోడు అని అంటుంది. అత్తయ్య పక్కకి తీసుకెళ్లింది అంటే ఒప్పించేస్తుందని శ్రేయ అంటే ఎన్ని చెప్పినా ఒప్పుకోడు.. ఒప్పుకోడు అని లోహిత అంటుంది. ఇంతలో నాగవల్లి వాళ్లు వచ్చి మ్యాడీ ఒప్పుకున్నాడు అని అంటుంది. చిన్ని హ్యాపీ అయితే శ్రేయ, లోహిత షాక్ అయిపోతారు.
నాగవల్లి దేవా దగ్గరకు వెళ్లి సంతోషంగా కార్యక్రమానికి అన్నీ ఏర్పాటు చేసేశాను అని చెప్తుంది. దేవా రేపు పార్టీ ఆఫీస్‌కి వెళ్లాలి అని అంటాడు. ఇంట్లో పూజ కంటే ముఖ్యమైన మీటింగా.. నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో నాకు తెలుసు బావ.. చిన్ని మ్యాడీ కలిసి పూజ చేయడం నీకు ఇష్టం లేదు కదా అందుకే ఇలా ఇంట్లో ఉండకూడదు అనుకుంటున్నావ్ కదా.. తప్పు బావ.. మన ఇంట్లో కార్యక్రమానికి నువ్వు లేకపోతే ఎలా.. మన మ్యాడీ క్షేమం కోసం చేస్తున్న పూజ.. మ్యాడీ మంచి కోరుకునే తల్లిదండ్రులుగా మనం కూడా మ్యాడీ కోసం పీటల మీద కూర్చొని మన ఇంటి పీడ చిన్ని పోవాలి అంటే ఇద్దరం కూడా సీతారాముల కల్యాణం జరిపించాలి అని అంటుంది. మన శత్రువు మన ముందే ఉంటే చూస్తూ ఊరుకోవడం నా వల్ల కాదు అని దేవా అంటాడు. మన మీద ఎవరికీ ఏం అనుమానం రాకుండా ఉండాలి అంటే కొన్ని చేయక తప్పవు అని నాగవల్లి అంటుంది. దేవా సరే అని అంటాడు.
నాగవల్లి వెళ్లిపోయిన తర్వాత నీ ఆలోచనలు నీకు ఉంటే నా ఆలోచనలు నాకు ఉంటాయి నాగవల్లి.. ఆ చిన్నిని, బాలరాజుని చంపేస్తే తప్ప నాకు ప్రశాంతత ఉండదు అని అనుకుంటాడు. తన ఫ్రెండ్ ఎస్‌పీకి కాల్ చేసి పోలీస్‌లా కాకుండా నా ఫ్రెండ్ బాలరాజుని పట్టి ఇవ్వు.. చిన్ని ఎవరితో మాట్లాడుతుందో ఏం చేస్తుందో ఫోన్ ట్యాప్ చేసి నాకు చెప్పు అని అంటాడు. చిన్ని మ్యాడీ దగ్గరకు వెళ్తుంది. మ్యాడీ కోపంగా ఉంటే చిన్ని పెళ్లి కూతురు బొమ్మ పట్టుకొని ఏంటి మధు మీ శ్రీవారు ఇంత హ్యాపీగా ఉన్నారు.. నీతో కలిసి కల్యాణం జరిపిస్తున్నాను అని సంతోషంగా ఉన్నారా.. అదే కదా.. రేపు నీ మెడలో నల్లపూసలు వేస్తున్నా అని కూడా హ్యాపీగా ఉన్నారా అని అంటుంది. మ్యాడీ కోపంగా ఆ కోయి దొర రావడం.. కల్యాణం.. నల్లపూసలు ఇదంతా నీ ప్లానే కదా.. చెప్పు అని అంటాడు. చిన్ని షాక్ అయిపోతుంది. తడబడుతూ నాకు తెలీదు బాబు నా ప్లాన్ కాదు.. మీ అమ్మ ప్లాన్ అంటుంది. మా అమ్మ ఎందుకు అలాంటి ప్లాన్ చేస్తుంది అని మ్యాడీ అంటే మరి నేను కూడా కాదు.. నీకు ఉన్న గండాలు తొలగిపోవాలని మీ అమ్మగారు ఇది చేస్తున్నారు అని అంటుంది. నాకు దగ్గర అవ్వాలని నువ్వే ఈ నాటకాలు ఆడుతున్నావ్ అని అర్థమవుతుంది. నువ్వు నా పక్కన కూర్చొని ఎన్ని పూజలు చేసినా.. నల్లపూసలు వేయించుకున్నా నా మనసు మార్చలేవు.. గడువు పూర్తయిపోయిన తర్వాత ఆ తాళి బొట్టు.. నల్లపూసలు నీ మెడలో ఉండవు.. అని అంటాడు.
గడువు పెట్టిన మొదటి రోజు నువ్వు నాతో మాట్లాడిన మాటలకు ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్న మాటలకు చాలా తేడా ఉంది.. కోపం లెవల్స్ తెగ్గితే కదా.. ఆ మార్పు వచ్చేది.. మా అమ్మ ఏ తప్పు చేయలేదు అని నిరూపిస్తా.. మనిద్దరం హ్యాపీగా కలిసిపోతున్నాం అని అంటుంది. మా మమ్మీ చెప్పిందని ఒప్పుకున్నా అంతే కానీ ఆ కార్యక్రమం చేస్తే నాలో ఏదో మార్పు వచ్చేస్తుందని అనుకోవద్దు అని అంటాడు.
లోహిత శ్రేయతో ఇదంతా చిన్ని ప్లాన్ కోయి దొర నిజంగా రాలేదు అని అంటుంది. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి చేద్దాం అని లోహిత అంటే ఏం చేద్దాం అని శ్రేయ అడిగితే చిన్ని మ్యాడీతో కలిసి పూజ చేయకుండా చేద్దాం.. నల్లపూసలు వేయకుండా చేద్దాం అని అంటుంది. అందుకు శ్రేయకి ఓ ప్లాన్ చెప్తుంది. చిన్ని తల్లి ఫోటో చూస్తూ మ్యాడీ నాకు రేపు నల్లపూసలు వేస్తాడమ్మా.. నాకు చాలా సంతోషంగా ఉంది. నా భర్తకి దగ్గరవ్వడానికి నా అత్తింట్లో పెద్ద యుద్ధమే చేస్తున్నా.. అందులో గెలుస్తా అని అందరి ముందు నవ్వుతూ తిరుగుతున్నా., సంతోషంగా ఉన్నట్లు నటిస్తున్నా.. కానీ అమ్మ దగ్గర నటించలేను కదా అందుకే ఏడుస్తున్నా.. నా కాపురం దిద్దుకోగలను అనిపిస్తుంది కానీ ఒక్కోసారి మ్యాడీ మాటలు వింటుంటే భయం వేస్తుంది అని అంటుంది. చిన్ని ఏడుస్తుంటే ప్రమీల చూసి వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.























