అన్వేషించండి

Chinni Serial Today March 23rd: చిన్ని సీరియల్: అదిరిపోయిన ట్విస్ట్! నాగవల్లే చిన్ని, మ్యాడీలకు పెళ్లి చేసిందా!

Chinni Serial Today episode march 23rd | మ్యాడీ రికవరీ అయి ఇంటికి రావడం చిన్నిని దూరం పెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode చిన్ని మ్యాడీతో మాట్లాడుతూ నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో అర్థమైంది అని అంటుంది. ఆ పరిస్థితిలో ఎవరు ఉన్నా అలాగే కాపాడేవాడిని అని మ్యాడీ అంటాడు. ఇక డాక్టర్ వచ్చి ఐసీయూలో ఎక్కువ మంది ఉండకూడదు అని చెప్పడంతో నాగవల్లి, దేవా, చిన్ని బయటకు వెళ్లిపోతారు. శ్రేయ కంగారు పడుతూ అత్తయ్యా బావకి ఎలా ఉంది.. నీతో మాట్లాడాడా అని అడిగితే మాట్లాడాడు శ్రేయ నీతో కూడా మాట్లాడుతాడు అని చెప్తుంది. 

నాగవల్లి దేవాని పక్కకి తీసుకెళ్లి చిన్నిని చంపడానికి ఎందుకు ప్లాన్ చేశావ్,,ఈ యాక్సిడెంట్ ఎందుకు చేయించావ్ అని అడుగుతుంది. నేనే చేశా.. 30 రోజుల్లో అది చేస్తా ఇది చేస్తా అని ఇంట్లో సెటిల్ అయిపోయింది.. దాన్ని చూసి మ్యాడీ ఎంత టెన్షన్ పడుతున్నాడో నీకు తెలీదు.. వాడిని చూసి నేను ఎంత టెన్షన్ పడుతున్నానో నీకు తెలీదు అని అంటాడు. ఎన్ని సార్లు చెప్పాను బావ తొందరపడొద్దు తనని ఏం చేయొద్దు అని అంటుంది. అది బతికుంటే నాకు మనస్శాంతి ఉండదు అని దేవా అంటే కాస్త ఓపిక పట్టు బావ.. ఆ చిన్ని చనిపోతుంది అని నాగవల్లి అంటుంది. ఎలా అని దేవా అంటే ఎలా ఏంటో నాకు తెలీదు కానీ మ్యాడీ జాతకం కూడా నీ జాతకంలాగే ఉంది.. పెళ్లి అయిన కొన్ని రోజులకే భార్య చనిపోతుంది. అందుకే కావాలనే నేను శ్రేయతో నిశ్చితార్థం అయిన తర్వాత మ్యాడీ మధుని పెళ్లి చేసుకునేలా చేశాను.. అని గుడిలో ఇద్దరూ పెళ్లి చేసుకునేలా చేయడం తన ప్లానే అని నాగవల్లి అంటుంది. నీ తొందర వల్ల మ్యాడీకి ప్రమాదం అయింది.. మ్యాడీ నా ప్రాణం బావ.. వాడికి ఏమైనా అయితే నేను ప్రాణాలతో ఉండలేను అని నాగవల్లి ఏడుస్తుంది. 

అందరూ మ్యాడీని చూడటానికి వెళ్తారు. మ్యాడీ కాలు నొప్పి అని అంటే నాగవల్లి కాలు పట్టుకుంటుంది. నేను చేస్తా అత్తయ్యా మీరు ఎందుకు అని చిన్ని అంటే అక్కర్లేదు అని నాగవల్లి అంటుంది. ఇంతలో డాక్టర్ చూసి ఏంటి మేడం మీరు కాలు పట్టుకుంటున్నారు.. మీ కోడలు ఉంది కదా.. అని అంటే మ్యాడీ చిన్నికి కాలు పట్టమని అంటాడు. నాగవల్లి మనసులో డాక్టర్ ముందు ఇంటి గుట్టు పెట్టడం ఇష్టం లేక  మ్యాడీ ఇలా చెప్పుంటాడని నాగవల్లి అనుకుంటుంది. చిన్ని మ్యాడీ కాలు పట్టుకుంటుంది. ఇక డాక్టర్ నాగవల్లి వాళ్లతో మీరు చాలా లక్కీ అండీ అంత పెద్ద యాక్సిడెంట్ అయినా కూడా త్వరగా కోలుకున్నాడు.. మీ కోడలి అదృష్టం అమ్మా.. నీ భర్తని జాగ్రత్తగా చూసుకోమ్మా అని చిన్నికి చెప్తారు డాక్టర్. చిన్ని మ్యాడీకి ఫ్రూట్స్ తినిపించి జ్యూస్ తాగిస్తుంది. 

చిన్ని తన తల్లిదండ్రులకు ఇంటికి వెళ్లిపోమని చెప్తుంది. వాళ్లు మ్యాడీ వైపు చూస్తే మ్యాడీ ముఖం తిప్పుకుంటాడు. దాంతో చిన్నికి చెప్పేసి వెళ్లిపోతారు. ఇక చిన్ని నాగవల్లి వాళ్లని కూడా వెళ్లిపోమని చెప్తే నాగవల్లి వెళ్లను అంటుంది. మ్యాడీ అందరినీ క్యాంటీన్‌కి వెళ్లి ఏమైనా తినేసి రమ్మని చెప్తాడు. అందరూ వెళ్తారు. మ్యాడీ కాలు నొప్పి తగ్గిందా అని చిన్ని అడిగితే కాలు నొప్పి తగ్గింది కానీ తల నొప్పి తగ్గడం లేదు 30 రోజులు అయితే కానీ అది పోదు అని అంటాడు. ఇక మ్యాడీ డిశ్చార్జీకి అన్నీ ఏర్పాట్లు చేస్తారు. మ్యాడీని తీసుకొని ఇంటికి వస్తారు. నాగవల్లి ప్రమీల వాళ్లతో మ్యాడీకి దిష్టి తీయడానికి ఏర్పాట్లు చేయమని అంటుంది. మ్యాడీకి వీల్ ఛైర్ తీసుకొస్తానని చిన్ని అంటే అక్కర్లేదు అని మ్యాడీ అని తల్లిని నడిపించమని అంటాడు. దానికి చిన్ని తల్లి చిన్నప్పుడు మాత్రమే నడిపిస్తుంది. పెద్దయ్యాక భార్య నడిపిస్తుందని అంటుంది. నీకు మాటలు బాగా వచ్చే మాటల మాయ చేస్తావ్ అని నాగవల్లి అంటే బాలరాజు, కావేరిల కూతురు కదా అని దేవా అంటాడు. నాగవల్లి మ్యాడీని నడిపిస్తుంది. మ్యాడీ పడిపోబోతే చిన్ని పట్టుకుంటుంది. మ్యాడీ కోపంగా చూస్తే కావాలని పట్టుకోలేదు.. పడిపోబోతే పట్టుకున్నా అంటుంది. నేను అంత ఈజీగా పడను అని మ్యాడీ అంటాడు. ఇక వరుణ్ వీల్ ఛైర్ తీసుకొచ్చి కూర్చొపెట్టి లోపలికి తీసుకెళ్తాడు. 

చిన్ని నాగవల్లికి కాఫీ తీసుకెళ్లి ఇస్తుంది. థ్యాంక్స్ అత్తయ్యా అంటుంది చిన్ని. ఎందుకు అని అంటే మీరు నాకు అమూలమైన అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు కదా అంటుంది. విషయం చెప్పు అని నాగవల్లి అంటే తాళి చూపించి మ్యాడీ నా మెడలో మంగళసూత్రం కట్టేలా చేసి మ్యాడీని నాకు గిఫ్ట్‌గా ఇచ్చింది మీరే కదా అత్త అని అంటుంది. నాగవల్లి షాక్ అయి కాఫీ కప్పు పడేస్తుంది. ఏంటి అత్త షాక్ అయ్యారా.. మీరే నాకు మ్యాడీకి పెళ్లి చేశారు.. మ్యాడీ జాతక ప్రకారం  మొదటి భార్య చనిపోతుందని తెలిసి నేను మ్యాడీని పెళ్లి చేసుకునేలా మీరే కదా చేసింది అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 1st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
Godavari Serial Today August 1st: 'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
Nindu Manasulu Serial Today August 1st: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
Karthika Deepam 2 Serial Today August 1st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
Tilak Varma News: సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక
సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక.. 23 నుంచి దులీప్ ట్రోఫీ
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Embed widget