అన్వేషించండి

chinni serial today April 3rd: చిన్ని సీరియల్: బాలరాజు దేవాకి దొరికిపోయాడా! చిన్నికి దేవా ఏం చెప్పాడు?

chinni serial today episode April 3rd దేవా చిన్నితో మీ నాన్న కాసేపట్లో నాకు దొరికిపోతాడని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode : నల్లపూసల కార్యక్రమానికి మరో ముత్తయిదువు లేదు అని లోహిత అనడంతో చిన్ని వెళ్లి తన తల్లి ఫొటో తీసుకొని వచ్చి కార్యక్రమం దగ్గర పెడుతుంది. అందరూ నల్లపూసలు గుచ్చుతారు. తర్వాత మ్యాడీ నల్లపూసల్ని చిన్ని మెడలో వేస్తాడు. పంతులు ఇద్దరినీ ఆశీర్వదిస్తారు. నిండు నూరేళ్లు అన్యోన్యంగా ఉంటారని అంటారు. 

మ్యాడీ ఆవేశంగా తన గదిలోకి వెళ్లి పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు బొమ్మల్ని పట్టుకొని చూస్తాడు. ఇంతలో చిన్ని అక్కడికి వస్తుంది. చిన్ని సౌండ్ చేయడంతో మ్యాడీ బొమ్మలు అక్కడ పెట్టేస్తాడు. శ్రీవారు చిన్నప్పటి ఫ్లాష్‌బ్యాక్ గుర్తు చేసుకొని తన్మయత్వంలో మునిగిపోయినట్లు ఉన్నారే అని అంటుంది. అంత లేదు అని మ్యాడీ అంటాడు. చిన్నప్పుడు మనిద్దరం ఆ బొమ్మల పెళ్లి చేశాం.. ఇప్పుడు ఇద్దరం కలిసి సీతారాముల కల్యాణం చేశాం.. రెండింటికీ ఉన్న తేడా తెలుసు.. అప్పుడు మనం ఫ్రెండ్స్.. ఇప్పుడు మనం దంపతులం.. ఆ ఫీల్‌కి ఈ ఫీల్‌కి తేడా ఉంటుంది కదా అని చిన్ని అంటుంది. ఏం లేదు అని మ్యాడీ అంటాడు. మధు పెళ్లి కూతురి బొమ్మ పట్టుకొని మా శ్రీవారు నా మెడలో నల్లపూసలు వేయడం చాలా సంతోషంగా ఉందని అంటుంది. తర్వాత పెళ్లి కొడుకు బొమ్మ పట్టుకొని మ్యాడీ నీ భార్య మెడలో నల్లపూసలు వేసినందుకు సంతోషంగా ఉంది కదా అని అంటుంది. మ్యాడీ చెప్పు నీకు హ్యాపీగా లేదు అని చెప్పు.. నేను ప్రేమించిన చిన్ని మెడలో నల్లపూసలు వేసుంటే హ్యాపీగా ఉండేది కానీ నన్ను మోసం చేసిన చిన్ని మెడలో నల్లపూసలు వేసినందుకు బాధగాఉందని అంటాడు.

మా అమ్మ మీ అమ్మని చంపింది అని నువ్వు అనుకుంటున్నావ్.. ఆ సంఘటన జరిగినప్పుడు మనం చిన్నవాళ్లం ఏం జరిగిందో మనకి తెలీదు.. నువ్వు ఒకటి నమ్ముతున్నావ్.. నేను ఒకటి నమ్ముతున్నా.. నాగవల్లి అత్తయ్యకి కూడా నిజం తెలీదు.. నేను చెప్పిందే మీరు నమ్ముతారు.. అయినా మనం ఇప్పుడు ఆలోచించాల్సింది.. మీ నాన్న చెప్పింది నిజమా.. మా నాన్న చెప్పింది నిజమా అని కాదు.. అసలేం జరిగిందో అది తెలుసుకోవడం అవసరం అని అంటుంది. మన మధ్య ఉన్న అపార్థాలను అడ్డుగోడలను ఈ నల్లపూసలు తొలగించి మనల్ని కచ్చితంగా కలుపుతాయి.. నా నమ్మకం త్వరలోనే నిజం అవుతుంది చూస్తూ ఉండు అని అంటుంది. 

చిన్ని లక్కీ ఫెలో అందుకే తనకి అన్నీ కలిసి వచ్చావ్ అని శ్రేయ లోహిత దగ్గర చాలా సీరియస్ అవుతుంది. ఇంతలో చిన్ని అక్కడికి వచ్చి వెతుకుతుంది. ఏం వెతుకుతున్నావ్ అని శ్రేయ అడిగితే ఇక్కడ ఏదో కాలినట్లు వాసన వస్తుందని లోహితను ఉడికిస్తుంది. థ్యాంక్స్ లోహి ఆ తాళి నువ్వే కొట్టేసుంటావని నాకు తెలుసు.. వచ్చిన ముత్తయిదువులను కూడా నువ్వే మ్యానేజ్ చేసుకుంటావని నాకు తెలుసు.. నువ్వు అలా చేయడం వల్లే మా అమ్మ తాళి నాకు దొరికింది.. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.. థ్యాంక్స్ లోహి అని అంటుంది. నువ్వే కావాలని చిన్నికి సాయం చేశావని శ్రేయ లోహి మీద అరుస్తుంది. ఇంత దెబ్బకొట్టిన చిన్నికి ఊహించని దెబ్బ కొడతా అని లోహి అనుకుంటుంది. 

దేవా తన మనుషులకు కాల్ చేసి బాలరాజు దొరికాడా అని అడిగితే 5 నిమిషాల్లో మీకు శుభవార్త చెప్తా సార్ అని అంటారు. ఇంతలో చిన్ని వచ్చి ఏంటి మామయ్యగారు చాలా హ్యాపీగా ఉన్నారు అని అంటుంది. చాలా పెద్ద విశేషం అని అంటాడు. జరిగిన కార్యక్రమాల కోసం ఇంత సంతోషంగా ఉన్నారా అని అంటుంది. నో జరగబోయే కార్యక్రమం గురించి సంతోషంగా ఉన్నాను అని దేవా అంటాడు. నేను ఇంత సంతోషంగా ఉండటానికి మీ అమ్మకి సంబంధించిన కార్యక్రమం కాదు.. మీ నాన్నకి సంబంధించినది.. అని అంటాడు. అంటే మా నాన్న ఆచూకీ మీకు తెలిసిందా అని చిన్ని అడిగితే తెలుస్తుంది.. 5 నిమిషాల్లో తెలుస్తుంది. అప్పుడు ఎవరికి ఏం ఇవ్వాలో అది చక్రవడ్డీతో ఇచ్చేస్తా అని అంటాడు.  చిన్ని చాలా కంగారు పడుతుంది. స్వరూప, సుబ్బులు కార్యక్రమం సక్రమంగా జరిపించినందుకు నాగవల్లి, దేవాకి థ్యాంక్స్ చెప్తారు. అందరిలా మా అమ్మాయి పెళ్లి జరగలేదు.. బాబు నీ పరిస్థితి మేం అర్థం చేసుకోగలం తనని ఎన్ని రకాలుగా ఎవరు మోసం చేసినా తట్టుకోగలడు కానీ భార్య మోసం చేస్తే తట్టుకోలేడు.. చిన్ని ఎవర్ని మోసం చేసే రకం కాదు బాబు అని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 17th: 'గోదావరి' సీరియల్: తమ్ముడిని రెచ్చగొట్టిన నిత్య! సూర్య కోసం అందంగా ముస్తాబైన జానుకి నిశ్చితార్థం గురించి తెలుస్తుందా!
'గోదావరి' సీరియల్: తమ్ముడిని రెచ్చగొట్టిన నిత్య! సూర్య కోసం అందంగా ముస్తాబైన జానుకి నిశ్చితార్థం గురించి తెలుస్తుందా!
Nindu Manasulu Serial Today August 17th: నిండు మనసులు: మంజు ఇంట్లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం! కళ్లు తిరిగి పడిపోయిన ప్రేరణ.. కారణమేంటో తెలుసా!
నిండు మనసులు: మంజు ఇంట్లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం! కళ్లు తిరిగి పడిపోయిన ప్రేరణ.. కారణమేంటో తెలుసా!
Nindu Noorella Saavasam Serial Today August 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆశ్రమంలోకి దూరిన ప్రచండ – ప్రచండకు వార్నింగ్‌ ఇచ్చిన మనోహరి
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆశ్రమంలోకి దూరిన ప్రచండ – ప్రచండకు వార్నింగ్‌ ఇచ్చిన మనోహరి
Jabardasth Pavithra : జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?
జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget