అన్వేషించండి

chinni serial today April 13th: చిన్ని సీరియల్: నాగవల్లికి చుక్కలు చూపించిన కావేరి! కూతురు అల్లుడిని కలపాలని కంకణం కట్టుకున్న కావేరి ఆత్మ!

chinni serial today episode April 13th చిన్నిలోకి కావేరి ఆత్మ దూరి ఇంట్లో నాగవల్లి వాళ్లకి చుక్కలు చూపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode చిన్ని మ్యాడీ కాళ్ల మీద కాఫీ కప్ పెట్టి కప్ తీయాలి అంటే ఐలవ్‌యూ అయినా చెప్పాలి.. లేదంటే కాఫీ తాగాలి అంటుంది. కాఫీ తాగుతా కప్ తీయమని మ్యాడీ అంటాడు. చిన్ని కప్ తీసి ఇస్తే మ్యాడీ కాఫీ తాడుతాడు. మ్యాడీ మనసులో ఇన్ని మంచి లక్షణాలు ఉన్న నీలో మోసం చేయడం అన్న ఒకే ఒక్క చెడు లక్షణం లేకపోయి ఉంటే ఎంత బాగున్ను అని అనుకుంటాడు.

గోడ మీద ఉన్న కావేరి ఫొటో మ్యాడీని చూస్తూ నా కూతురు మీద నీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు మహి. కాకపోతే ఆ ప్రేమ బయట పడకుండా కొన్ని అడ్డు తెరలు అడ్డుకుంటున్నాయి. ఆ అడ్డు తెరలు తొలగించి నేను మీ ఇద్దరినీ కలుపుతాను అని అనుకుంటుంది. మరోవైపు బాలరాజు ఆచూకీ తెలియక దేవా చాలా కోపంగా అన్నీ తన్నేస్తూ రగిలిపోతాడు. ఏమైందని నాగవల్లి అడిగితే కావేరిని చంపినట్లు ఆ చిన్నిని బాలరాజుని చంపితే కానీ మనకు మనస్శాంతి ఉండదు అని అంటే అప్పుడే కాఫీ తీసుకొస్తున్న చిన్ని మీదకు కావేరి ఆత్మ వస్తుంది. కోపంగా దేవాని చూసి నన్ను చంపిన అంత తేలిక కాదురా నా వాళ్లని చంపడం అని అనుకుంటుంది. చస్తారు బావ తొందర్లోనే అందరూ చస్తారు అని నాగవల్లి అంటుంది. ఇంతలో డోర్ పెద్ద సౌండ్‌తో క్లోజ్‌ అవుతుంది. నాగవల్లి, దేవా ఇద్దరూ గాలికే అయ్యుంటుందని అనుకుంటారు. 

నాగవల్లి వెళ్లి చూసే సరికి ఎదురుగా చిన్ని ఉంటుంది. ఏంటి అత్తయ్యా అలా చూస్తున్నారు అని చిన్ని అంటే నీ గొంతు ఎందుకు అలా ఉంది అని నాగవల్లి అడుగుతుంది. జలుబు చేసింది అని అంటుంది. ఇద్దరికీ కాఫీ ఇచ్చి మీరు మామయ్య ఎప్పుడూ ఇలాగే మాట్లాడుకుంటారా.. కాఫీ తాగండి అని అంటుంది. నాగవల్లి కాఫీ తాగుతూ ఉంటే ఎవరో గొంతు పట్టి బలవంతంగా తాగించినట్లు కప్పు మూతి నుంచి రాదు.. నాగవల్లి ఉక్కరి బిక్కిరి అయిపోతుంది. ఏమైందని దేవా అడిగితే కప్పు మూతికి అతుక్కుంది రావడం లేదు అని అంటుంది. చిన్ని నాగవల్లి చేతిని పట్టుకొని లాగుతుంది. చిన్ని కాఫీ కప్పు లాగుతున్నట్లు నాగవల్లి గొంతు పట్టేస్తుంది. తర్వాత చూసి సారీ అని చెప్తుంది. మామయ్య నా వల్ల కావడం లేదు మీరు ప్రయత్నించండి  అని అంటుంది. దేవా లాగడంతో కప్పు వస్తుంది. మంట మంట అని నాగవల్లి ఏడుస్తుంది. చిన్నిలో ఉన్న కావేరి నా వాళ్లని చంపుతాను అంటే నాకు మండుతుంది కదా అని అనుకుంటుంది. మొత్తానికి కావేరి నాగవల్లికి చుక్కలు చూపిస్తుంది. 

నాగవల్లి తన నొప్పి అని తల పట్టుకొని కూర్చొంటుంది. అప్పుడే ఎదురుగా కాఫీ కప్ కనిపిస్తుంది. దాన్ని తీసుకొని నాగవల్లి తాగాలి అనుకొని చుట్టూ గాలి రావడం చూసి భయపడుతుంది.  తర్వాత కాఫీ కప్ చూస్తే మొత్తం ఖాళీగా ఉంటుంది. ఇదేంటి ఇది నాగవల్లి కంగారు పడి కప్ కింద పడేస్తుంది. కప్ కింద పడిన తర్వాత చూస్తే కాఫీ కప్ పడినట్లు కాఫీ ఉంటుంది. ఇదేంటి అని నాగవల్లి బిత్తరపోతుంది. ఇంతలో నాగవల్లి ఫ్రెండ్స్ ఇద్దరు ఇంటికి వస్తారు. చిన్నిని పిలిచి నాగవల్లి గురించి అడుగుతారు. కిచెన్‌లో చిన్ని ఉండటంతో పని మనిషి అని వెటకారం చేస్తారు. ఇంతలో ప్రమీల వచ్చి తను పని మనిషి కాదు ఈ ఇంటి కోడలు అని చెప్తుంది. ఈ అమ్మాయి ఈ ఇంటి కోడలు ఎలా అయిందో మాకు అర్థం కాలేదు అని వాళ్లు అంటే మా టైం బాలేక అయిందని నాగవల్లి అంటుంది. లోహిత, శ్రేయ అందరూ మన టైం బాలేదు కాబట్టి తన టైం బాగుందని అనుకుంటారు. నాగవల్లి అందరికీ కాఫీలు తీసుకురమ్మని అంటారు. చిన్ని కోపంగా చూస్తూ వెళ్తుంది. 

చిన్నిలోకి కావేరి వస్తుంది. నా కూతుర్ని అవమానిస్తే నాకు ఎంత మండుతుందో ఈ కాఫీ తాగితే మీకు అంతే మండుతుంది అని కాఫీలో ఉప్పు, కారం కలిపేసి వాళ్లకి ఇస్తుంది. కాఫీ తాగిన నాగవల్లి ఫ్రెండ్స్ మంట మంట అని అరుస్తారు. అందరూ ఏమైందని కంగారు పడతారు. తర్వాత నాగవల్లి తాగి కారం అంటుంది. మ్యాడీ, వరుణ్ అందరూ అక్కడికి వస్తారు. నాగవల్లి ప్రశ్నిస్తే నేను ఎందుకు కారం వేస్తాను అత్తయ్యా పంచదారే వేశాను అంటుంది. నేను నిజనిజాలు తేల్చుతా అని మ్యాడీ తాగి కాఫీ బాగుందే అని అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. నాగవల్లి మీ పని పిల్ల ఏదో చేసింది అని నాగవల్లి ఫ్రెండ్స్ అంటే తను పని పిల్ల కాదు ఈ ఇంటి కోడలు అని మ్యాడీ అంటాడు. సారీ సారీ కోడలు పిల్ల అనబోయి పని పిల్ల అనేశాం అంటారు. మీ మమ్మీ డాడీ ఎవరు.. ఎన్ని బిజినెస్‌లు చేస్తున్నారు అని వాళ్లు అడిగితే అవన్నీ మీకు అనవసరం తను నేను తాళి కట్టిన భార్య ఈ ఇంటి కోడలు.. ఈ ఇంటి కోడలుకి మీరు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి లేదంటే మీ మర్యాద పోతుందని అంటాడు. దాంతో వాళ్లు సరే అంటారు. 

నాగవల్లి మ్యాడీతో తనకి అంత గౌరవం ఇవ్వాలి అంటావేంటి అంటే మన ఇంటి గొడవలు నాలుగు గోడల మధ్యే ఉండాలి.. నలుగురి లోపలికి వెళ్లకూడదు అంటాడు. మ్యాడీ చేసింది కరెక్టే అని అందరూ అనుకుంటారు. మ్యాడీ చిన్ని గదిలో కూర్చొని ఉంటే చిన్ని మ్యాడీతో నా మీద నీకు ఎంత ప్రేమ ఉంది.. డైలాగ్స్‌లో ప్రేమ లేదు అంటూనే యాక్షన్‌లో చూపిస్తున్నావ్ అని అంటుంది. నేను భర్త హోదాలో అలా మాట్లాడలేదు.. ఒక ఫ్రెండ్‌గా వాళ్ల ముందు నీ పరువు నిలబెట్టాలి అని అలా మాట్లాడాను అంటాడు. కావేరి ఫొటోలో నుంచి నా అల్లుడికి నా కూతురి మీద చాలా ప్రేమ ఉంది.. అది బయట పడాలి అంటే నేనే వాళ్ల అమ్మని చంపాను అన్నదాని నుంచి మహిని బయట పడేయాలి.. పడేస్తాను.. ఇద్దరినీ నేను కలుపుతాను అని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 
 

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 6th: కాచీపై ఆదిలక్ష్మీ చేయిచేసుకోవడానికి కారణమేంటి..? ఆదిలక్ష్మీ కుట్రను ధాత్రి ఎలా బయటపెట్టింది..?
జగద్ధాత్రి సీరియల్: కాచీపై ఆదిలక్ష్మీ చేయిచేసుకోవడానికి కారణమేంటి..? ఆదిలక్ష్మీ కుట్రను ధాత్రి ఎలా బయటపెట్టింది..?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 6th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి, క్రిష్‌లను చంపేయమని సుభాష్‌తో చెప్పిన అంబిక! నిజం దాచేసిన పండు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి, క్రిష్‌లను చంపేయమని సుభాష్‌తో చెప్పిన అంబిక! నిజం దాచేసిన పండు!
Godavari Serial Today August 6th: 'గోదావరి' సీరియల్: నమ్మి వెళ్లిన గౌతమిపై కల్యాణ్ అత్యాచారం! ఆ నలుగురి వేట!
'గోదావరి' సీరియల్: నమ్మి వెళ్లిన గౌతమిపై కల్యాణ్ అత్యాచారం! ఆ నలుగురి వేట!
నిండు మనసులు: 50-50 ఛాన్స్.. హాస్పిటల్‌లో సిద్ధూ.. ఇంటర్వ్యూలో ప్రేరణ! నిజం దాచేసిన మంజుల!
నిండు మనసులు: 50-50 ఛాన్స్.. హాస్పిటల్‌లో సిద్ధూ.. ఇంటర్వ్యూలో ప్రేరణ! నిజం దాచేసిన మంజుల!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget