అన్వేషించండి

chinni serial today April 10th: చిన్ని సీరియల్: కావేరి ఫోటోని గోడ మీద తీసేసిన శ్రేయ! చిన్ని ఏం చేస్తుంది! లాయర్ హరిని కలుస్తుందా!

chinni serial today episode April 10th చిన్ని బాలరాజుని కలిసి ఇంటి నుంచి బయటకు రావొద్దని చెప్పి లాయర్‌ హరి గురించి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode లోహిత రాత్రి జరిగిందే తలచుకొని అసలు రాత్రి ఏం జరిగింది.. నేను చూసిందే జరిగిందా.. ఏదో జరిగింది అని నేను ఊహించుకున్నానా.. చిన్నిని అడిగి తెలుసుకుంటే బెటర్ అని గదిలోకి వెళ్లి చిన్ని అంటుంది. ఏంటి అని చిన్ని అనగానే లోహిత వణికిపోతుంది. నువ్వు రావడం చూసే ఇలా అన్నాను అని చిన్ని అంటుంది. చిన్నగా అరవడం ఏంటి దెయ్యంలా అంతలా అరిచావ్ అంటుంది. ఏంటి దెయ్యం దెయ్యం అంటున్నావ్ అని చిన్ని అంటే లేదు రాత్రి నువ్వు చాలా చేశావ్ గుర్తు చేసుకో అని అంటుంది. 

చిన్ని ఆలోచించి రాత్రి నువ్వు ఎక్కువ కలలు కనేశావ్.. నేను అసలు లేవలేదు.. అంతా నీ భ్రమ నువ్వు నా లైఫ్‌ మీద ఫోకస్ చేయడం మానేసి నీ జీవితం ఆలోచించుకో అని అంటుంది. ఆలోచిస్తూ వెళ్తున్న లోహితను శ్రేయ వచ్చి పట్టుకోగానే లోహిత పెద్దగా అరుస్తుంది. ఎందుకు అరిచావ్.. రాత్రి నుంచి తేడాగా ప్రవర్తిస్తున్నావ్.. నువ్వు చిన్నికి భయపడుతున్నావా అని శ్రేయ అడిగితే నేను చిన్నికి భయపడటం ఏంటి.. దెయ్యానికి కూడా భయపడను అంటుంది లోహిత. నీ ముఖం చూస్తుంటే నువ్వు నిజంగానే భయపడుతున్నట్లు ఉంది.. నీ కంటే నేనే బెటర్ అని అనుకొని శ్రేయ వెళ్తుంది. 

చిన్ని బతకడం ఏంటి.. ఎలా బతికింది అని దేవా తన మనిషికి కాల్ చేస్తాడు. చిన్నిని చంపాలని ప్రయత్నించిన మన వాళ్లని చిన్నినే చంపబోయింది.. అందరూ హాస్పిటల్‌లో ఉన్నారు.. చిన్నికి ఏదో ఆవహించినట్లు ఆదిశక్తిలా మారిపోయింది అంట సార్ అని చెప్తాడు. నాగవల్లి దేవా దగ్గరకు వచ్చి నాకు తెలీకుండా ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది బావ.. ఎప్పుడూ లేనిది మ్యాడీ చిన్నితో కలిసి బయటకు వెళ్లడం ఏంటి.. కావేరి భర్త్‌డే అని స్వీట్స్ పంచడం ఏంటి.. ఎప్పుడూ లేనిది పొద్దెక్కే వరకు నేను లేవకపోవడం ఏంటి.. రాత్రి తిన్న స్వీట్ ఏమైనా తేడా చేసుంటుందా.. నువ్వు ఆ స్వీట్ తిన్నావా బావ అని అడుగుతుంది. తిన్నాను కానీ నాకు ఏం కాలేదు అని దేవా అంటాడు. ఈ తలనొప్పులు కాదు ముందు మనం ఆ బాలరాజు సంగతి తేల్చాలి అని దేవా అంటాడు. 

చిన్ని తండ్రి బాలరాజుని కలుస్తుంది. నిన్ను మ్యాడీ బాబుని పక్కపక్కన చూసి చాలా హ్యాపీగా ఉంది.. మీ ఇద్దరూ ఎప్పుడూ ఇలాగే ఉండాలి అని అంటాడు. ఏం హ్యాపీ నాన్న అమ్మ నిర్దోషి అని నిరూపించకపోతే మ్యాడీ నాకు దగ్గరవ్వడు అని అంటుంది. నేను అందుకే ప్రయత్నిస్తున్నాను.. మీ అమ్మ క్లాస్ మేట్ హరి అని ఒక లాయర్ ఉన్నాడమ్మా.. గతంలో నన్ను, మీ అమ్మని ఆ కేసుల నుంచి బయట పడేయడానికి చాలా ప్రయత్నించాడు.. ప్రస్తుతం హరి ఎక్కడున్నాడో తెలీదు.. నేను, ఆఫ్ టికెట్ కలిసి హరిని వెతుకుతాం అని అంటాడు. వద్దు నాన్న.. మీ కోసం వెతుకుతున్నారు. మీరు బయటకు వెళ్తే చాలా పట్టేస్తారు.. నా సిమ్ కూడా ట్రేస్ చేస్తున్నారు.. అందుకే కొత్త సిమ్ వేసుకున్నా అని చెప్తుంది. నిన్ను నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి నాన్న లేదంటే అమ్మానాన్న లేని అనాథ అయిపోతా అని ఏడుస్తుంది. దాంతో బాలరాజు వెళ్లను అమ్మ ఇక నుంచి నేను ఇంటి నుంచి వెళ్లను అని అంటాడు. ఆ లాయర్ డిటైల్స్ నాకు ఇవ్వు నాన్న అంటుంది. బాలరాజు చెప్తాడు.

లోహిత కావేరి ఫొటో చూస్తూ చిన్ని చేసిన బీభత్సం గురించి ఆలోచిస్తుంది. శ్రేయ వచ్చి ఏం ఆలోచిస్తున్నావ్ అని అడిగితే మ్యాడీ గురించి ఆలోచించి బాధ పడుతున్నా.. తన తల్లిని చంపినది తన తల్లి ఫొటో పక్కనే ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఆలోచించు అని అంటుంది. మన ఇంట్లో వాళ్లని హత్య చేసిన హంతకురాలి ఫొటోని మన ఇంట్లో ఉంచుకుంటామా,, తీసి పడేస్తామా.. అని అంటుంది. దాంతో శ్రేయ కావేరి ఫొటో తీయడానికి వెళ్తుంది. ప్రమీల చూసి ఎందుకు ఇలా చేస్తున్నావ్.. అని అంటుంది. శ్రేయ ఫొటో తీసుకెళ్లి పడేయబోతే చిన్ని వచ్చి అడ్డుకుంటుంది. గడువు పూర్తి అయ్యే వరకు ఈ ఫొటోని మీ అత్తయ్య, మామయ్య, మీ బావ తీసేయాలి అని అనుకోరు.. గడువు అయిపోయిన తర్వాత తీయాల్సిన అవసరం రాదు.. అని అంటుంది. ఈ ఇంటి ఇల్లాలిని దారుణంగా చంపేసిన హంతకురాలి కూతిరివి నీకే అంత ధైర్యం ఉంటే నాకు ఇంకెంత ఉండాలి.. అసలు మీ అమ్మ అని శ్రేయ అంటే శ్రేయ అసలు నీకు ఏం తెలుసు మా అమ్మ గురించి నిజం తేలిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడు అంత వరకు ఒక్క మాట మాట్లాడినా ఈ చిన్ని విశ్వరూపం చూడాల్సి వస్తుందని అంటుంది. తర్వాత చిన్ని కావేరి ఫొటో తీసుకెళ్లి పెడుతుంది. శ్రేయ గదిలోకి వెళ్లి రోజు రోజుకి చిన్ని ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతుంది. చిన్నిని దాని ఓవర్ యాక్షన్‌ని కట్ చేయాలి అని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 
 

 

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today NOV 26:రాధకు గతం గుర్తు చేసేందుకు విక్కీ పడరాని పాట్లు...గుండెపోటుతో అల్లాడిపోయిన నందగోపాల్‌
నువ్వులేక నేను లేను: రాధకు గతం గుర్తు చేసేందుకు విక్కీ పడరాని పాట్లు...గుండెపోటుతో అల్లాడిపోయిన నందగోపాల్‌
Karthika Deepam 2 Serial Today November 26th: కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్‌కి తన ప్రేమ చెప్పిన జ్యోత్స్న! శివన్నారాయణ ఫ్యామిలీని అవమానించిన మాలిని!
కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్‌కి తన ప్రేమ చెప్పిన జ్యోత్స్న! శివన్నారాయణ ఫ్యామిలీని అవమానించిన మాలిని!
Jagadhatri Serial Today Nov 25:తల్లిని నిర్దోషిగా నిరూపించడానికి కావాల్సిన సాక్ష్యాల కోసం జగధాత్రి ప్రయత్నాలు..స్టోర్‌రూమ్ తెరవకుండా అడ్డుపడిన రేఖ
జగద్ధాత్రి సీరియల్:తల్లిని నిర్దోషిగా నిరూపించడానికి కావాల్సిన సాక్ష్యాల కోసం జగధాత్రి ప్రయత్నాలు..స్టోర్‌రూమ్ తెరవకుండా అడ్డుపడిన రేఖ
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 25th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: వారసుడు ఉన్నాడు.. సహస్రకు ట్విన్స్ పుట్టారంటూ షాక్ ఇచ్చిన పద్మాక్షి! పక్కా సాక్ష్యాలు కూడా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: వారసుడు ఉన్నాడు.. సహస్రకు ట్విన్స్ పుట్టారంటూ షాక్ ఇచ్చిన పద్మాక్షి! పక్కా సాక్ష్యాలు కూడా!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Garividi Lakshmi OTT : ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
Meerut Police Half Encounter: యువతిపై దాడి చేసిన ఉన్మాదికి రాప్తాడు తరహా ట్రీట్మెంట్.. మీరట్ పోలీసుల హాఫ్ ఎన్‌కౌంటర్‌లో కాలికి బుల్లెట్ గాయం!
యువతిపై దాడి చేసిన ఉన్మాదికి రాప్తాడు తరహా ట్రీట్మెంట్.. మీరట్ పోలీసుల హాఫ్ ఎన్‌కౌంటర్‌లో కాలికి బుల్లెట్ గాయం!
Ekalavya Series OTT : AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
నేపాల్ లేనిదే రాముడు అసంపూర్ణం అన్న మోదీ! భారత్-నేపాల్ పుణ్యక్షేత్రాల పవిత్ర బంధం
నేపాల్ లేనిదే రాముడు అసంపూర్ణం అన్న మోదీ! భారత్-నేపాల్ పుణ్యక్షేత్రాల పవిత్ర బంధం
Actor Venkatesh: డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
Telangana High Court: కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
Union Cabinet Decisions: ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
Telangana Congress Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
Embed widget