Chinni Serial Promo Today May 17th: చిన్ని సీరియల్ ప్రోమో: సత్యంబాబుని చంపేసిన దేవా.. బాలరాజు అరెస్ట్.. కావేరి, చిన్నిల రాజుని అసహ్యించుకుంటారా!
Chinni Today Promo దేవా సత్యంబాబుని చంపేయడం ఆ నింద బాలరాజు మీద వేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Promo Today Episode చిన్ని సీరియల్ రోజు రోజుకు ట్విస్ట్‌లతో చాలా ఇంట్రస్టింగ్‌గా సాగిపోతుంది. తాజాగా వచ్చిన ప్రోమో చూస్తూ మతి పోయే ట్విస్ట్ ఇచ్చారు. దీంతో ఓ రేంజ్‌లో సీరియల్ ఉండనుంది. ఇంతకీ ప్రోమోలో ఏం ట్విస్ట్ ఇచ్చారంటే..
" తన చెల్లి జీవితం నాశనం చేసిన దేవేంద్ర వర్మ అంతు చూస్తానని సత్యంబాబు ఆవేశంగా దేవేంద్ర ఇంటికి వెళ్తాడు. అక్కడ దేవేంద్ర వర్మతో గొడవ పడతాడు. దేవేంద్ర వర్మ సత్యంబాబుని బంధించి కత్తితో పొడిచేస్తాడు. తర్వాత సత్యంబాబుని రోడ్డు మీద పడేస్తారు. బాలరాజు సత్యంబాబుని చూసి పొట్టలో ఉన్న కత్తి తీసి నిన్ను రక్షించుకుంటా సత్యంబాబు నీకు ఏం కాదని అంటాడు. కావేరి, చిన్నిలను నువ్వే కాపాడాలి అని సత్యంబాబు చెప్పి చనిపోతాడు. ఇక కావేరి, చిన్నిలు అక్కడికి వస్తారు. ఇంత దారుణం ఎవరు చేశారని కావేరి పోలీసుల్ని అడిగితే పోలీసులు బాలరాజే సత్యంబాబుని చంపాడని చెప్పి అరెస్ట్ చేస్తారు. కావేరి, చిన్ని బాలరాజుని చూసి షాక్ అయిపోతారు. దీంతో ప్రమో పూర్తయిపోతుంది." కావేరి, చిన్నిలు బాలరాజే సత్యంబాబుని చంపాడని నమ్మి అతన్ని అసహ్యించుకుంటారా లేదంటే బాలరాజు ఏం చేయలేదని నమ్మి అతనికి సపోర్ట్ చేస్తారా తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
దేవేంద్ర వర్మ కావేరి ఉష ఒక్కరే అని తెలుసుకుంటాడు. బాలరాజు, కావేరిల కూతురే చిన్ని అని కూడా తెలుసుకుంటాడు. ఈ విషయం బాలరాజు, కావేరిలకు తెలిసిపోతుంది. కావేరితో రాజు విషయం చెప్పి తనతో ఇద్దరినీ వచ్చేయమని చెప్తాడు. కావేరికి అన్న బాలరాజుని నమ్మొద్దని చెప్పి దేవేంద్ర వర్మని తాను శిక్షిస్తానని ధైర్యం చెప్తాడు. కానీ దేవేంద్ర వర్మ కావేరికి కాల్ చేసి బాలరాజుని చిన్నీని చంపేస్తానని బెదిరిస్తాడు. దాంతో కావేరి చిన్నిని తీసుకొని బాలరాజుతో వెళ్లిపోవాలని నిర్ణయించుకొని ఇళ్లు దాటుతుంది. అందుకు ఓ లెటర్ రాసి అన్నయ్యకి క్షమాపణ చెప్పి వెళ్లిపోతుంది. ఆ లెటర్ చదివిన సత్యంబాబు కంగారు పడి చిన్ని కావేరి అనుకొని రాత్రి రాత్రి వాళ్లని వెతకడానికి వెళ్తాడు. కావేరి, చిన్ని ఇద్దరూ బాలరాజు చెప్పిన అడ్రస్‌కి వెళ్లి ఎదురు చూస్తారు.
సత్యంబాబు ఎన్ని సార్లు కాల్ చేసినా కావేరి లిఫ్ట్ చేయదు. సత్యంబాబు బాలరాజు ఇంటికి వెళ్లి చూస్తాడు. తాళం వేసి ఉంటుంది. కిటికీ నుంచి లోపలికి వెళ్లి బాలరాజుని పిలుస్తాడు. ఇక్కడా లేరు అంటే ఎక్కడికి తీసుకెళ్లుంటారు అనుకొని దేవాని గుర్తు చేసుకొని దేవా కాళ్లు విరగ్గొడితే కావేరి గురించి తెలుస్తుందని సత్యంబాబు దేవేంద్ర వర్మ అంతు చూస్తానని ఆవేశంగా దేవేంద్ర వర్మ దగ్గరకు వెళ్లి అతనికి దొరికిపోతాడు. దేవా సత్యంబాబుని బంధించేస్తాడు. దీంతో నిన్నటి ఎపిసోడ్ పూర్తిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: రూపతో మిస్ బిహేవ్ చేసిన దీపక్.. బుడ్డోడితో సహా వాయించేసిన ఫ్యామిలీ!





















