Chinni Serial Today May 19th: చిన్ని సీరియల్: బాలరాజు మీద అరిచిన పిల్లలు.. కన్నీటితో సత్యంబాబు అంత్యక్రియలు!
Chinni Today Episode నువ్వే మా నాన్నని చంపేశావ్ అని పిల్లలు బాలరాజు మీద అరవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode సత్యంబాబు శవాన్ని అంబులెన్స్‌లో ఇంటికి తీసుకొస్తారు. సత్యంబాబుని బాలరాజు చంపేశాడని పోలీసులు సరళతో చెప్తారు. సరళ అలా ఉండిపోతుంది. కళ్లు తిరిగి పడిపోతుంది. కావేరి, చిన్ని, పిల్లలు సరళని లేపాలని ప్రయత్నిస్తారు. ఇక ఆఫ్‌టికెట్ జైలుకి వచ్చి నువ్వు సత్యంబాబుని చంపడం ఏంటి అన్న నేను నమ్మను అంటాడు.
బాలరాజు తాను ఏం తప్పు చేయలేదు అని ఒక్క గంట పర్మిషన్ ఇవ్వమని చెప్తాడు. వద్దని వెళ్లడం కుదరదు అని పోలీస్‌లు అంటారు. లాయర్‌ని తీసుకురమ్మని బాల ఆఫ్ టికెట్‌కి చెప్తాడు. సత్యంబాబు శవం దగ్గర చిన్ని, కావేరి, పిల్లలు ఏడుస్తారు. సరళ గదిలో షాక్ అయి కూర్చొంటుంది. నీ మాట వినకుండా బాలరాజుతో వెళ్లి నీకు ఈ పరిస్థితి తీసుకొచ్చా నన్ను క్షమించు అన్నయ్యా అని కావేరి మనసులో ఏడుస్తుంది. ఇక లాయర్ వచ్చి బెయిల్ ఇప్పించి బాలరాజుని విడిపిస్తాడు. రెండు గంటల పర్మిషన్ మీద బాల బయటకు వెళ్తాడు.
సత్యంబాబు శవాన్నీ అంత్యక్రియలకు తీసుకెళ్తారు. సరళ మాత్రం బయటకు రాదు. చిన్ని వాళ్లు ఏడుస్తారు. దేవేంద్రవర్మ, నాగవల్లిలి అక్కడికి వస్తారు. కావేరి వాళ్లని చూసి అసహ్యించుకుంటుంది. నాగవల్లి లోహిత దగ్గరకు వెళ్లి ఏమైంది అమ్మ అని అడుగుతుంది. ఆ బాలరాజు చంపేశాడని చెప్తుంది. చిన్నిని చెప్పబోతే కావేరి ఆపుతుంది. బాలరాజు మా నాన్నని చంపిన వీడియో చూశానని లోహిత చెప్తుంది. బాలరాజు ఎంత దారుణం చేశాడు అని దొంగ నాటకం ఆడుతారు. ఇంతలో బాలరాజుని తీసుకొని పోలీసులు వస్తారు.
చందు బాలరాజుని చూసి నువ్వు ఎందుకు వచ్చావ్ అంకుల్ మా నాన్నతో పాటు మమల్ని చంపేయాలి అనుకుంటున్నావా? ఎందుకు మానాన్నని చంపేశావ్ ? అని అంటాడు. నేను చంపలేదు అని బాలరాజు చెప్తాడు. లోహిత కూడా నువ్వే చంపేశావ్ అంటుంది. దేవేంద్ర వర్మ బాలరాజుతో నువ్వే చంపావ్ నువ్వే చంపావ్ అని వీడియో చూశాం అని అందరూ బాలరాజు తప్పు చేశాడు అనేలా మాట్లాడుతాడు. బాలరాజు తప్పు చేయలేదు అని నేను నమ్ముతున్నా అని మా నాన్న అని చిన్ని చెప్పబోతే కావేరి చిన్నిని ఆపుతుంది. బాలరాజు అందరితో ఎవరు నమ్మినా నమ్మకపోయినా సత్యంబాబు నమ్ముతాడు. అతన్ని ఎవరు చంపారో ఆయనకు మాత్రమే తెలుసు అంటాడు.
సత్యంబాబు శవం దగ్గరకు బాలరాజు వెళ్లి దండం పెట్టుకుంటాడు. చందు చాలా ఆవేశంగా చూస్తాడు. ఇక చందుతో జరగాల్సిన కార్యక్రమం చేయిస్తారు. అంందరూ ఏడుస్తుంటారు. చందు సత్యంబాబు శవానికి నిప్పు పెడతాడు. బాలరాజుని జైలుకి తీసుకెళ్తుంటారు. దేవా వచ్చి నీ చేతులతో నువ్వు చంపేసి ఆ చితి మంటల్ని కన్నీటితో చూస్తే అయిపోతుందా.. సత్యంబాబుని అతి దారుణంగా చంపేసిన దుర్మార్గుడు నువ్వు అని అంటాడు. మానసిక పరివర్తన కోసం రెండు నిమిషాలు మాట్లాడుతా అని అందర్నీ పక్కకు వెళ్లమని చెప్తాడు. నేను ఇచ్చిన షాక్ ఎలా ఉంది అని అడుగుతాడు. నేనే చంపేసి ఆ నేరం నీ అకౌంట్‌లో వేశానని చెప్తాడు. గతం మర్చిపోయి మనం ఫ్రెండ్స్ అవుదాం అంటే నో అన్నావ్ ఇప్పుడు కావేరి పరిస్థితి ఏంటో ఆలోచించు అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీ మెడలో వారసత్వ నగ.. ముడిపడిన లక్ష్మీ, సహస్రల తాళి!





















