Chinni Serial Today May 10th: చిన్ని సీరియల్: దేవా, వల్లిల ప్లాన్ సక్సెస్.. బాల ఆటోలో డ్రగ్స్.. కావేరి తిన్న స్వీట్‌లో విషం..!
Chinni Today Episode చిన్ని ఫంక్షన్‌లో కావేరితో విషం కలిపిన స్వీట్ నాగవల్లి తినిపించడం, బాలరాజు ఆటోలో డ్రగ్స్ పెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode చిన్నికి పది లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ నాగవల్లి ఇస్తే సత్యంబాబు వద్దని అంటాడు. సరళ డిసప్పాయింట్ అయిపోతుంది. వద్దు అంటే వాళ్లు ఫీలవుతారు అలా అనొద్దు అని అంటుంది. మేనమామని చూసిన చిన్ని తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. సరళ చిన్నితో అలా చూస్తావేంటి నీకు అన్నీ మీ మేనమామ పోలికలే తీసుకో అంటుంది.
చిన్ని తీసుకొని పక్కన పెట్టేస్తుంది. అంత ఖరీదైన బహుమతి పక్కన పెడతావేంటే నేను జాగ్రత్తగా ఉంచుతాలే అని తీసుకుంటుంది. ఇక చిన్నికి అందరూ మంగళ హారతి ఇస్తారు. కావేరి, రాజులు ఎవరూ చూడకుండా చిన్నిని ఆశీర్వదిస్తారు. చిన్ని చాలా సంతోషపడుతుంది. ఇక దేవా మనుషులు డ్రగ్స్‌ని బాలరాజు ఆటోలో పెడతారు. దేవా వాళ్లకి కాల్ చేసి ఆటో కదలగానే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వు అని చెప్తాడు. ఇక సత్యంబాబు సరళతో భోజనాలు అన్నీ సక్రమంగా అయ్యేలా వచ్చే ప్రతీ ఒక్కరూ తిన్నారో లేదో చూసుకో అని చెప్తాడు. సత్యంబాబు, సరళల దగ్గరకు దేవేంద్ర వర్మ వస్తాడు, ఫంక్షన్ బాగా జరిగింది అంటూ మాట్లాడుతూ చిన్ని వాళ్ల అమ్మానాన్నల కోసం అడుగుతాడు.
సరళ, సత్యం ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఇక చిన్నికి కావేరి బట్టలు ఇచ్చి మీ నాన్న తీసుకొచ్చారు అంటుంది. చిన్ని తండ్రికి థ్యాంక్స్ చెప్తుంది. ఇక కావేరి చిన్నిని తీసుకెళ్లి డ్రస్ మార్చి ఫొటోల కోసం తీసుకొస్తుంది. అందరూ ఫొటోస్ తీసుకుంటారు. దేవేంద్ర వర్మ వాళ్లని ఫొటోకి పిలుస్తుంది. దానికి ఉష ముందు మేనమామ, అత్తలతో దిగండి తర్వాత బయట వాళ్లతో దిగొచ్చు అంటుంది. సత్యంబాబు సరే అంటాడు. ఇక వాళ్లు ఫొటోలు తీసుకుంటారు. తర్వాత మెల్లగా రాజు కూడా వెళ్లి కావేరి పక్కన నిల్చొని ఫొటో తీసుకుంటాడు. దేవా వాళ్లు ఆశ్చర్యంగా చూస్తారు. ఇక సరళ పిలవడంతో దేవా వాళ్లు వెళ్తారు. దేవా వాళ్లతో ఫొటో తీసుకుంటుంది. ఇక భారతి సత్యంబాబుని పిలిచి నువ్వు ఇచ్చిన వెండి కంచంలో స్వీట్స్ పెట్టి ఇస్తా నువ్వు నీ భార్య తినిపించండి అంటుంది.
భారతి స్వీట్స్ పెడుతుంటే నాగవల్లి వెళ్లి చిన్ని కోసం స్పెషల్‌గా తీసుకొచ్చాం.. అని ఇవ్వబోతే సత్యంబాబు ఆపి మేనకోడలికి మేనమామ తెచ్చిన స్వీట్స్ పెట్టాలి సంప్రదాయం అంట అని చెప్పి వాళ్ల స్వీట్స్ తినిపిస్తారు. నాగవల్లి డిసప్పాయింట్ అయిపోతుంది. సత్యంబాబు చేయించిన రకరకాల స్వీట్స్ తినిపిస్తారు. ఇక నాగవల్లి ఒకబ్బాయిని పిలిచి ఆ స్వీట్స్ అందరికీ పంచమని చెప్తుంది. కావేరికి పెట్టమని దేవా నాగవల్లికి సైగ చేస్తాడు. ఇక చివరిగా కావేరిని చంపాలి అనుకున్నస్వీట్ విషం కలిపిన స్వీట్ కావేరికి ఇస్తుంది. ఉష ఈ రోజు నువ్వు అవుట్ అని మనసులో అనుకుంటుంది. కావేరికి స్వీట్ ఇచ్చి తినమని చెప్తుంది. కావేరి తినేస్తుంది. దేవా, నాగవల్లి నవ్వుకుంటారు. ఇక వాళ్లు వెళ్లిపోతారు.
ఫంక్షన్ బాగా జరిగింది అనుకున్న దానికంటే బాగా జరిగింది అని అనుకుంటారు. దేవా వదినను, మహిని వేరే కారులో పంపేస్తారు. మీరు వల్లి రారా అని ప్రమీల హర్ట్ అయిపోతుంది. కావేరి తిన్న లడ్డూ కాసేపట్లో పని చేస్తుందని కావేరి, రాజుల ఇద్దరి పతనం ఒకేసారి చూద్దామని దేవా, వల్లి అక్కడే ఉంటారు. రౌీలు అనుమానంగా తిరగడం ఆఫ్ టికెట్ చూస్తాడు. వాళ్ల దగ్గరికి వెళ్లి ఎవరు మీరు ఇక్కడ తిరుగుతున్నారేంటి అని అడుగుతాడు. దాంతో రౌడీలు ఆఫ్ టికెట్‌ని తోసేస్తారు. బాలరాజు వచ్చి ఆఫ్ టికెట్‌ని పట్టుకుంటాడు. రౌడీలు కావాలనే రాజుతో గొడవ పెట్టుకుంటారు. మరోవైపు చిన్ని కావేరి మాత్రమే స్టేజ్ దగ్గరు ఉంటారు. కావేరి కళ్లు తిరుగుతుంటాయి. చిన్ని స్వీట్ తినిపించమని అనడంతో కావేరి తినిపిస్తుంది. తర్వాత తల, కడుపు పట్టుకొని ఇబ్బంది పడుతుంది.దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: చిన్ని రాజు కూతురని దేవాకి తెలిసిపోతుందా.. అన్న సంతోషం చూసి పొంగిపోయిన కావేరి!





















