Chinni Serial Today June 14th: చిన్ని సీరియల్: మహి, చిన్నిల బొమ్మల పెళ్లి.. బాల చేతికి మోమోరీకార్డ్.. దేవా పరిస్థితేంటి?
Chinni Today Episode దేవాని కటకటాల పాలు చేయడానికి మాణిక్యం, బాలరాజు చేతులు కలిపి పార్వతిని దేవా చంపినట్లు ఉన్న సాక్ష్యాన్ని బాలరాజుకి మాణిక్యం ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మాణిక్యం తనని నమ్మడం లేదని డైరెక్ట్‌గా వెళ్లి కలిసి సాక్ష్యం సంపాదిస్తానని బాలరాజు హైదరాబాద్ వెళ్తానని అప్పటి వరకు నువ్వు చిన్ని జాగ్రత్త అని కావేరికి చాటుగా ఓ చోటుకి తీసుకెళ్లి చెప్తాడు. ఇంతలో దేవా నా ఇంట్లో ఉంటూ నా తిండి తింటూ నా మీద కుట్రలు చేస్తున్నారా మొగుడూ పెళ్లాలు అని అంటాడు. నీలా వెనకాలే గోతులు తవ్వే టైప్ మేం కాదని బాల కౌంటర్ వేసి కావేరిని తీసుకెళ్లిపోతాడు.
ప్రమీల పెళ్లి ఎలా జరుగుతుందో చెప్తుంటే చిన్ని పెళ్లి కూతురిలా మహి పెళ్లి కొడుకులా రెడీ అయితే చందు పంతులు గెటప్‌లో వాళ్లకి పెళ్లి చేస్తాడు. గౌరీ పూజ జీలకర్రా బెల్లం, మంగళ సూత్రధారణ ఇవన్నీ ప్రమీల చెప్తుంది. మహి చిన్ని చేతిలో ఉన్న పెళ్లి కూతురి బొమ్మకి తాళి కడతాడు. ప్రమీల అప్పగింతల ఘట్టం గురించి చెప్తుంది. ఇప్పటి వరకు సంతోషంగా సాగిన ఈ పెళ్లిలో అప్పగింతలు ఘట్టం అందరికీ కన్నీరు తెప్పిస్తుందని పుట్టింటిలో మహారాణిలా పెరిగిన అమ్మాయి అత్తారింటికి వెళ్తుంది. పుట్టింటికి ఇకపై చుట్టం చూపులా వస్తుంది అని చెప్తుంది. కావేరి ఎమోషనల్ పక్కకు వెళ్లి చిన్నికి పెళ్లి అయినట్లు గుర్తు చేసుకొని ఏడుస్తుంది.
బాలరాజు కావేరి దగ్గరకు వెళ్లి ఏంటి ఇది కావేరి నువ్వు ఇప్పుడు పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తున్నట్లు ఫీలైపోతున్నావేంటి అని అడుగుతాడు. చిన్ని వచ్చి ఏడుస్తూ అమ్మని హత్తుకుంటుంది. ఏమైంది చిన్ని అని కావేరి అడిగితే నేను పెద్ద అయ్యాక పెళ్లి చేసుకోను అమ్మా.. పెళ్లి చేసుకుంటే అమ్మానాన్నల్ని వదిలేసి వెళ్లిపోవాలి అంట కద నేను మీ ఇద్దరినీ వదిలేసి ఎక్కడికి వెళ్లను అని ఏడుస్తుంది. బాలరాజు చిన్నితో అందరూ పెళ్లి అయి అత్తారింటికి వెళ్తారేమో కానీ మేం నిన్ను పంపము అల్లుడిని ఇళ్లరికం తీసుకొస్తా ఎందుకు అంటే నిన్ను చూడకుండా ఒక్క రోజు ఉండలేను అమ్మా అని ఏడుస్తాడు. సరిపోయింది తండ్రీకూతుళ్లు అని కావేరి అంటుంది. బాల చిన్నిని లోపలికి పంపేసి హైదరాబాద్ వెళ్తాను అని చెప్తాడు.
బాల వెళ్తుంటే కావేరి కుడి కన్ను అదురుతుంది. కావేరి ఏదైనా అపశకునమా అని బాలరాజుని ఆపుతుంది. నాకేం చెడు జరగదు అంతా మంచే జరుగుతుందని బాలరాజు చెప్తాడు. కావేరి బాలరాజుని హత్తుకొని మనం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటాం కదా అని అంటుంది. దానికి బాలరాజు ఈ జన్మలోనే కాదు ఎన్ని జన్మలకైనా కలిసే ఉంటాం అంటాడు. బాలరాజు వెళ్లిపోతాడు. పెళ్లి హడావుడి మొదలవుతుంది. చిన్ని, చందు వాళ్లు మేం మగపెళ్లి వాళ్ల తరుఫున వచ్చాం అంటే మహి, లోహిత వాళ్లు ఆడపెళ్లి వాళ్ల తరుఫున వచ్చాం అని అంటారు. మగపెళ్లి వాళ్ల పవర్ ఆడపెళ్లి వాళ్ల పవర్ అంటూ పిల్లలు సందడి చేస్తారు.
దేవా పెళ్లి కొడుకులా రెడీ అవుతాడు. నాగవల్లిని తన ఫ్రెండ్స్ పెళ్లి కూతురిలా రెడీ అవుతారు. దేవా రౌడీలు దేవా దగ్గరకు వచ్చి బాలరాజు కనిపించడం లేదు అంటే దేవా వాళ్ల మీద కోప్పడి ఎక్కడికి వెళ్లాడో సీసీ టీవీ ఫుటేజ్ చూసి ఫాలో అవ్వండి అంటాడు. బాలరాజు మాణిక్యాన్ని కలవడానికి వెళ్తాడు. ఇద్దరు వ్యక్తులు బాలని చెక్ చేస్తారు. బాలరాజు మాణిక్యాన్ని కలుస్తాడు. తను దేవా మనిషి కాదని పూర్తిగా మారిపోయానని తన కూతురు తనని మనిషిగా మార్చింది అని చెప్తాడు. నా భార్య మళ్లీ నన్ను భర్తగా మార్చింది అని చెప్తాడు. కావేరి భర్తగా చిన్ని తండ్రిగా వచ్చానని దేవా వల్ల నువ్వు నష్టపోయావ్ నేను నష్టపోయానని చెప్తాడు.
దేవా పార్వతిని చంపినప్పుడు తీసిన వీడియో నీ దగ్గర ఉంది కదా నాకు ఇవ్వు నేను కోర్టులో చూపించి నా భార్యని కాపాడుకుంటానని అంటాడు. మాణిక్యానికి దండం పెట్టి కాళ్లు కూడా పట్టడానికి బాలరాజు రెడీ అవుతాడు. దాంతో మాణిక్యం నువ్వు మారావు అంటే నమ్ముతాను బాలరాజు అంటాడు. నాకు తెలిసిన బాలరాజు ఎదుటి వాళ్ల కాళ్లు చేతులు నరికేస్తాడు కానీ ఇలా కాళ్లు పట్టుకోడు అందుకే నువ్వు మారావు అంటే నమ్ముతున్నాను. అధారాలకు సంబంధించిన మెమోరీ కార్డు ఇస్తున్నా అని మాణిక్యం మెమోరీ కార్డు బాలరాజుకి ఇస్తాడు. బాలరాజు దాన్ని తన ఫోన్‌లో పెడతాడు. వీడియో చూస్తాడు. బాలరాజుతో మాణిక్యం దేవా అరెస్ట్ అన్న శుభవార్త చెప్పాలని అంటాడు.
రౌడీలు దేవా దగ్గరకు వచ్చి బాలరాజు రాత్రి వెళ్లిపోయాడు అంటే మొత్తం వెతికించమని అంటాడు. సాక్ష్యాలు తీసుకురావడానికి వెళ్తాడా.. ఆ సాక్ష్యాలు నాగవల్లికి చూపిస్తాడా. పెళ్లి అపేస్తాడా అని టెన్షన్ పడతాడు. ఇక మహి నాగవల్లి దగ్గరకు వెళ్తాడు. మా పిన్ని రెడీనా అంటే పిన్ని కాదు అమ్మ అమ్మ అని చెప్పాను కదా అంటుంది. మహి హగ్ చేసుకొని సారీ అమ్మ మర్చిపోయా అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: రాఘవ కొడుకే ఆనంద్.. రుక్మిణి, ఆనంద్‌ల ప్రేమ కథ వెనక పెద్ద కథే ఉందిగా!





















