Chinni Serial Today july 22nd: చిన్ని సీరియల్: లోహి ఫేక్ భర్త్‌డేలో మధుకి మత్తు మందు? మహి, మధుల రొమాన్స్! చందుకి తెలిసిన నిజం!
Chinni Today Episode పార్టీలో లోహిత మధుకి మత్తు మందు ఉన్న జ్యూస్ ఇవ్వడం లోహిత ఇంట్లో లేదని సరళ, చందులకు తెలిసిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode లోహిత ఫేక్ భర్త్‌డే పార్టీ మొదలవుతుంది. పద్దూ అక్కడున్న వంటల్ని చూసి ఆకలేస్తుందే తినేస్తానే అంటే మరో ఫ్రెండ్ ఆపుతుంది. ఇంకా కేక్ కటింగ్ అవ్వలేదే అని అంటుంది. వాళ్ల కేక్ కటింగ్ అయ్యే వరకు ఆకలి ఆగుతుందా మనం తినేద్దామని అంటుంది. మధు, పద్దూ వాళ్లు తినడానికి ప్లేట్ తీసుకుంటారు. పద్దూ తింటుంటే శ్రేయ వచ్చి ప్లేట్ తోసేస్తుంది.
మధు తింటున్న ప్లేట్ తోసేస్తావ్ బుద్ధి లేదా అంటే రిచ్ పార్టీలకు వస్తే ప్రొటోకాల్ తెలీదా అని అంటుంది. లంగావోణి బ్యాచ్ అంటూ శ్రేయ అంటుంది. ఇది ట్రెడీషన్ అంటే మా గురించి చీప్‌గా మాట్లాడితే ఊరుకోను అని ఇద్దరూ గొడవ పడుతుంటే ఇద్దరి ఫ్రెండ్స్ ఆపుతారు. నీ సంగతి తర్వాత చెప్తానే అని శ్రేయ అంటే పోవే అని మధు అంటుంది. ఇక మధు తన ఫ్రెండ్స్‌తో పార్టీ లేదు ఏం లేదు వెళ్లిపోదాం పదండే అంటే పద్దూ లోహి ఫీలవుతుంది కేక్ కటింగ్ వరకు ఉందామని అంటుంది. మరోవైపు మ్యాడీ ఫ్రెండ్స్ పాట పాడమని బోరింగ్‌గా ఉందని అంటారు. గిటారు లేకపోతే నేను పాడలేను అని తెలుసుకదా అని మహి అంటే అతని ఫ్రెండ్ గిటారు తెస్తాడు.
నీటి ముల్లై నన్ను గిల్లీ వెళ్లిపోకే మల్లెవాన.. సాంగ్ గిటారుతో ప్లే చేస్తాడు. పద్దూ మధుకి చూపించి మీ పిల్లి గడ్డం గిటారు వాయిస్తుంది. ఓ ఆట ఆడుకుందామా అని అంటుంది. దానికి నా పర్మిషన్ ఎందుకే అని మధు అంటుంది. ఇక పద్దూ వెళ్లి హాయ్ అమెరికా బాబు మిమల్ని చూస్తుంటే హిందీ సినిమాలో హీరోలా ఉన్నాడు అంటుంది. మహి ఫ్రెండ్ ఆ విషయం మా మ్యాడీకి తెలుసు అంటాడు. మరి తెలుసు సినిమాలో విలన్‌లా ఉన్నాడు మీ మ్యాడీకి ఈ విషయం తెలుసా అంటాడు. అందరూ నవ్వుతారు. తనో పాన్ ఇండియా సినిమా తీస్తాను అని నువ్వు హీరో మా మధు హీరోయిన్ అంటే మహి కోపంగా ఈ వెజిటేబుల్ పక్కన నేను హీరోగా చేయను అని అంటాడు.
మహి, మధుల గొడవను అందరూ ఆపి మళ్లీ మహికి పాట పాడమని అంటారు. మహి నా మనసునే మీటకే అంటూ పాట పాడుతాడు. అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. మధు, పద్దూలు కూడా ఎంజాయ్ చేస్తారు. పద్దూ మహి, మధులు ఆ పాటకి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో అని ఊహించుకుంటుంది. మధు పద్దూని తీసి ఏంటే అలా గాల్లో చూస్తున్నావ్ సినిమా తీసినట్లు కల కంటున్నావా అంటే ఒక పాట అయిందే అంటుంది. ఇక లోహిత కూడా వరుణ్‌తో డ్యాన్స్ చేసినట్లు కల కంటుంది. మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా అంటూ స్టెప్పులేసినట్లు కల కంటుంది.
లోహితతో తన ఫ్రెండ్ కేక్ పదినిమిషాల్లో వచ్చేస్తుంది అనగానే లోహిత అందరికీ కూల్ డ్రింక్ ఇవ్వమని సైగ చేస్తుంది. ఇక లోహితనే వెళ్లి మధుకి ఇవ్వాల్సిన కూల్ డ్రింక్‌లో ఏదో పొడి కలిపేస్తుంది. మధు డ్యాన్స్ వేసి వచ్చి ఆ కూల్ డ్రింక్ తాగేస్తుంది. లోహిత తన ఫ్రెండ్‌తో నన్ను నడి రోడ్డు మీద కట్టేసి ఏడిపించింది కదా ఇప్పుడు చూడు దాని పరువు ఎలా పోతుందో అని అంటుంది. మధుకి జ్యూస్ మత్తు వల్ల ఎవరిని చూసినా ఇద్దరిలా కనిపిస్తుంది. మధు తూగుతూ ఉంటే లోహిత తన ఫ్రెండ్స్‌తో ప్లాన్ వర్కౌట్ అవుతుంది. శ్రేయతో అసలు స్ట్రోక్ కాసేపట్లో ఉంటుందని అంటుంది. ఇక లోహిత మనసులో త్వరగా పార్టీ ముగించుకొని ఇంటికి వెళ్లాలి లేదంటే అమ్మ వాళ్లకి డౌట్ వస్తుందని అనుకుంటుంది.
లోహిత కోసం ఇంటికి ఓ అబ్బాయి వస్తాడు. తన అక్క రికార్డ్స్ లోహిత అక్క దగ్గర ఉన్నాయి కావాలి అంటాడు. లోహిత పడుకుందని చందు చెప్పి లోహిత గదిలోకి వెళ్లి రికాడ్స్ ఇస్తాడు. తర్వాత బెడ్ మీద తలగడలు చూసి తల్లికి చెప్తుంది. పార్టీ ఉంటుంది. అందుకే ఇలా వెళ్లిపోయిందని అనుకుంటారు. ఇక సరళ అనుమానమే లేదు ఆ డబ్బు కూడా ఇదే దొంగతనం చేసుంటుందని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: ప్రమాదంతో మిథున, దేవా.. ఆదిత్య షూట్ చేసిందెవరిని? శివంగి ఎంట్రీ!



















