Chinni Serial Today july 19th: చిన్ని సీరియల్: డబ్బు పోయిందన్న షాక్‌లో చందు.. లోహిత దొంగనాటకం.. మహి, మధుల ఎంట్రీ!!
Chinni Today Episode లోహిత పుట్టిన రోజు పార్టీకి మహి, మధు, వరుణ్ వాళ్లు రావడం వరుణ్ లోహితని చూసి మైమరిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode చందు దగ్గరకు గిరిధర్ డబ్బు కోసం వస్తాడు. సరళని చందు డబ్బు తీసుకొని రమ్మని చెప్తాడు. సరళ వెతికి డబ్బు కనిపించడం లేదని చెప్తుంది. చందు మొత్తం వెతుకుతాడు. సరళ లోహితని పిలిచి అడిగితే లోహిత తనకు ఏం తెలీదని చెప్తుంది. లోహిత కూడా చందుతో పాటు వెతికినట్లు నటిస్తుంది. ఇప్పుడు గిరికి ఏం చెప్పాలి అని చందు కుప్పుకూలిపోతాడు.
సరళ చందుతో ఇప్పటికి ఏదో ఒకటి చెప్పి పంపేయ్ నాన్న తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని అంటుంది. చందు వెళ్లి డబ్బు కనిపించడం లేదని చెప్తే గిరి చందుని నోటికొచ్చినట్లు తిడతాడు. వారంలో డబ్బు ఇవ్వకపోతే నిన్ను ఏం చేస్తానో నాకు తెలీదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. లోహిత తనకు ఏం తెలనట్లు మొసలి కన్నీళ్లు కార్చి ఏంటి అన్నయ్య ఇది ఎప్పుడూ లేనిది ఇలా జరిగింది నిన్ను చూస్తే బాధగా ఉందని చెప్పి గదిలోకి వెళ్లిపోతుంది. ఇక లోహిత తలగడలు బెడ్ మీద పరిచి తను పడుకున్నట్లు దుప్పటి కప్పి తన ఫ్రెండ్‌కి కాల్ చేసి వీధి చివర ఉంటానని అంటుంది.
మధుమిత, పద్దూ ఇద్దరూ లోహిత భర్త్‌డేకి బయల్దేరుతారు. పద్దూ లోహిత కోసం కేక్ కొని తీసుకొస్తుంది. దానికి అంత అవసరం లేదని మధుమిత రోడ్డు మీదే కేక్ కోసేసి తినేసి పద్దూకి తినిపిస్తుంది. పార్టీకి పిలిచిందని అది మంచిది అనుకోకు అది ముంచే టైప్ అని అంటుంది. ఇక మధు లంగావోణికి కేక్ అంటించుకుంటుంది. దాంతో పద్దూ తన కొత్త లంగావోణి ఇస్తానని మధుని తీసుకెళ్తుంది. ఇక లోహిత మోడ్రన్ డ్రస్‌లో రెడీ అవుతుంది. తన ఫ్రెండ్స్ అందరూ హ్యాపీ ఫేక్ భర్త్‌డే అని విష్ చేస్తారు. ఫేక్ భర్త్‌డే అని నా లవర్‌కి తెలీకుండా ఉండాలే అంటుంది. ఇక మధు వస్తుందా అని తన ఫ్రెండ్స్ లోహితను అడిగితే కచ్చితంగా వస్తుందని ఈ లోహి ఇచ్చే షాక్‌కి అల్లాడిపోతుందని అంటుంది.
లోహిత ఇంటికి మహి వాళ్లు వస్తారు. మధుమిత, పద్దూ కూడా అప్పుడే వస్తారు. మధు, మహి ఒకేసారి గేట్ తీయడానికి వెళ్తారు. ఒకరి తల ఒకరికి తగులుతుంది. నువ్వు ఎందుకు వచ్చావ్ అంటే నువ్వు ఎందుకు వచ్చావ్ అని గొడవ పడతారు. శ్రేయ వచ్చి ఎందుకు మా బావతో గొడవ పడుతున్నావ్ అంటే మీ బావే నాతో గొడవ పడుతున్నాడని అంటుంది. మధు గొడవ వద్దని నాకు ఒకసారి గుద్దు అని అంటుంది. మహి మూడు అడుగుల దూరం అంటాడు. దాంతో మధు ఒక్కసారి గుద్దితే కొమ్ములు వస్తాయి. మేం అసలే మధ్యతరగతి వాళ్లం మా నాన్న కొమ్ములు వస్తే నాకు పెళ్లి కొడుకుని తీసుకురావడం మా నాన్నకి కష్టం అవుతుంది అని అంటుంది. మహి ఎంతకీ ఒప్పుకోకపోవడంతో యాక్షన్‌లోకి దిగుతా అని మధు మహిని పట్టుకొని గుద్దేస్తుంది.
మహి వరుణ్‌తో ఈ టార్చర్ నా వల్ల కాదు బావ నేను వెళ్లిపోతే అంటే శ్రేయ, వరుణ్‌లు కొద్ది సేపు ఉందామని మహిని ఒప్పిస్తారు. అందరూ లోపలికి వెళ్తారు. లోపల లోహిత స్టైల్ కటౌట్‌లతో భర్త్‌డే డెకరేషన్ అదిరిపోతుంది. మధు చూసి ఇక్కడ జరుగుతున్న పార్టీకీ ఈ కటౌట్‌కి ఏదో తేడా కొడుతుందే అని తన ఫ్రెండ్స్‌తో చెప్తుంది. పద్దూ మధుతో ఎవరినైనా బుట్టలో వేసే ప్రోగ్రాంలా ఉందా అంటే అలానే ఉందని అంటుంది. ఇక చికెట్ లాలీపాప్స్ సర్వే చేస్తుంటే మధు ఫుల్లగా తింటుంది. ఇంతలో లోహిత ఎంట్రీ ఇస్తుంది. లోహితను చూసి వరుణ్ మైమరిచిపోతాడు. అందరూ లోహితకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: అన్న డబ్బు కొట్టేసిని లోహిత.. చందుకి అవమానం తప్పదా! సోదమ్మా మహికి ఏం చెప్పిందంటే!





















