Chinni Serial Today july 18th: చిన్ని సీరియల్: అన్న డబ్బు కొట్టేసిని లోహిత.. చందుకి అవమానం తప్పదా! సోదమ్మా మహికి ఏం చెప్పిందంటే!
Chinni Today Episode మహి చిన్నిని త్వరలోనే చూస్తాడని సోదమ్మా చెప్పడం మహి సంతోషంతో గొలుసు ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode లోహిత వరుణ్ కోసం కావాలనే తన పుట్టిన రోజు అని పార్టీ ఉందని అంటుంది. శ్రేయ లోహితతో మధుని కూడా పిలు మనం దాంతో ఆడుకుందా అని అంటుంది. లోహిత వెళ్లి మధుకి నైట్ పార్టీకి పిలుస్తుంది. మధు రాను అని అంటుంది. దాంతో శ్రేయ కూడా పిలుస్తుంది. అందరూ ఒప్పించడంతో మధు రావడానికి ఒప్పుకుంటుంది. లోహిత, మధు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు.
బాలరాజు ఓ చోట కూర్చొని ఉంటాడు. చిన్ని గురించ తలచుకొని తప్పకుండా నీ దగ్గరకు వస్తానమ్మా అని అనుకుంటాడు. ఇంతలో ఒకామె తన కూతుర్ని చిన్ని అని పిలుస్తుంది. బాలరాజు తన కూతురే అనుకొని ఆటో వెనకాలే పరుగులు తీస్తాడు. కాదని తెలిసి డీలా పడిపోతాడు. నా చిన్ని నా కావేరి ఎక్కడున్నారో అనుకుంటాడు. మరోవైపు మహికి శ్రేయ కాల్ చేస్తుంది. ఎక్కడున్నావ్ అంటే పని ఉండి బయటకు వచ్చాను అంటాడు. దాంతో శ్రేయ కూడా లోహిత పార్టీకి వెళ్లాలి అన్నయ్య కూడా తన ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకున్నాడు నువ్వు రావాలి అంటుంది. మహి సరే అంటాడు. ఇక మహి దగ్గర్లో ఓ సోదమ్మ వెళ్తుంది. మహి ఆమెతో సోది చెప్పించుకుంటాడు.
చిన్ని తనకు పదేళ్ల క్రితం దూరం అయింది మళ్లీ ఎప్పుడు కలుస్తుంది అని సోదమ్మని అడుగుతాడు. సోదమ్మా తన దివ్య దృష్టితో ఇప్పటికే మహి మధు అలియాస్ చిన్నిని కలవడం చూసి నవ్వుతుంది. ఏమైందని మహి అడిగితే నువ్వు దూరం అయింది అనుకున్న నీ చిన్ని నీకు దూరం కాలేదు బిడ్డా నువ్వు వెతుకుతున్న ఆ చిన్ని నీతోనే ఉంది నీ చుట్టూ తిరుగుతుంది. దోబూచులాడుతుంది. ఈ రోజు నెల పొడుపు నువ్వు నెల పొడుపు చూసిన తర్వాత నీ చిన్నిని చూస్తావ్. తను నిన్ను గుర్తు పట్టడానికి టైం పడుతుంది అని అంటుంది. మహి చాలా సంతోషపడతాడు. ఎంత చక్కగా చెప్పావ్ తల్లీ అని డబ్బులు ఇవ్వడానికి పర్స్ చూస్తాడు. అందులో కార్డులు తప్ప డబ్బు లేకపోవడంతో తన మెడలో చైన్ ఇచ్చేస్తాడు. ఇదేంటి బిడ్డా అని ఆమె అడిగితే నా చిన్నిని కలుస్తాను అని ఆశ ఇచ్చావ్ పెద్దమ్మా నీకు ఏం ఇచ్చినా తక్కువే అంటాడు.
లోహిత తన ఫ్రెండ్‌తో ఇంటికి వస్తుంది. హాయ్ అంటీ అని సరళకి చెప్తే సామెతలు చెప్తుంది. దాంతో మీరు భలే సామెతలు చెప్తారమ్మా అనిలోహిత ఫ్రెండ్ అంటుంది. దాంతో సరళ థ్యాంక్స్ అమ్మా నువ్వు అయినా నా టెలెంట్ గుర్తించావ్ అంటుంది. లోహిత, తన ఫ్రెండ్ పార్టీకి డబ్బులు గురించి మాట్లాడుకుంటారు. లోహిత రిచ్ ఫ్రెండ్ గీతిక డబ్బు లేదని అనేస్తుంది. దాంతో ఏం చేయాలా అని లోహిత తలపట్టుకుంటుంది. ఇంతలో చందు గిరిధర్ అనే వ్యక్తికి డబ్బులు ఇవ్వాల్సి ఉండి 58 వేలు అతనికి ఇవ్వమని తల్లికి డబ్బు ఇస్తాడు. అది చూసిన లోహిత ఆ డబ్బు తీసుకోవాలని అనుకుంటుంది. సరళ ఆ డబ్బుని బీరువాలో దాయడం చూస్తుంది.
లోహిత తన ఫ్రెండ్‌తో డబ్బు రెడీ అయింది నువ్వు కిటికీ దగ్గర ఉండు నేను ఇస్తా అంటుంది. సరళ, చందులు చూడకుండా డబ్బు దొంగతనం చేసేస్తుంది. తన ఫ్రెండ్‌కి డబ్బులు ఇచ్చి పార్టీకి ఏర్పాటు చేయమని రాత్రి తాను పార్టీ టైంకి వస్తానని అంటుంది. వరుణ్‌ని ఇక లైన్‌లో పెట్టేయొచ్చు అని గదిలోకి వెళ్లి తీన్మార్ డ్యాన్స్ వేస్తుంది. ఇక వరుణ్‌ని లవర్‌గా సెట్ చేసుకోవాలి అనుకుంటుంది. చిన్ని రెడీ అవుతుంది. సుబ్బు, స్వరూపలు కూరగాయలు అమ్మడానికి సర్దుకుంటారు. చంటీ తండ్రితో నాన్న నీకు లంకెబిందెలు దొరికితే ఎవరికి ఇస్తావ్ అని అడుగుతాడు. దాంతో సుబ్బు అక్కకే ఇస్తాను అని అంటాడు. దాంతో చంటి నాకు ఇవ్వకుండా అక్కకి ఇస్తావా అంటే నువ్వు అయినా మీ అక్కకే ఇస్తావ్ కదరా అని అంటుంది. స్వరూప చంటీతో మన ముగ్గురిలో ఎవరైనా ఏదైనా ముందు అక్కకే ఇస్తాం కదా అంటుంది. చిన్ని ఎమోషనల్ అయిపోతుంది. ఇక చిన్ని, పద్దులు పార్టీకి రెడీ అయి వెళ్తారు. మరోవైపు లోహిత ఇంటికి గిరిధర్ వస్తాడు. చందుని పిలుస్తాడు. డబ్బు ఇస్తావా లేదా అని చందుని కోప్పడతాడు. డబ్బు రెడీగా ఉందని చందు చెప్తాడు. సరళకి డబ్బు అడుగుతాడు. సరళ వెళ్లి చూస్తే డబ్బు కనిపించదు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: అర్ధరాత్రి లోహితని చెట్టుకి కట్టేసిన మధు.. వెక్కి వెక్కి ఏడుస్తున్న లోహిత.. వీడియో వైరలైతే?





















