Chinni Serial Today April 25th: చిన్ని సీరియల్: చిన్న కోసం కావేరి, రాజులు కలిసిపోయారా.. రాజు ఇంట్లో కావేరి సందడి
Chinni Today Episode సత్యంబాబు దేవేంద్ర కోసం తిరుగుతూ కావేరి, చిన్నిలు ఉన్న రాజు ఇంటికే వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode చిన్ని, కావేరిలను రాజు ఇంటికి తీసుకెళ్తాడు. ఆఫ్ టికెట్ వదిన వచ్చింది అని సంతోషంతో హారతి తీసుకొస్తే చిన్ని అమ్మానాన్నలకు హారతి తీసి కుడి కాలు లోపల పెట్టి రమ్మని చెప్తుంది. కావేరి వచ్చి ఇంట్లో కూర్చొంటుంది. చిన్ని తల్లికి మర్యాదలు చేస్తుంది. రాజుని తీసుకెళ్లి కావేరి పక్కన కూర్చొపెడుతుంది. కావేరి పక్కకు జరుగుతుంది. దాంతో చిన్ని ఇద్దరి మధ్యలో కూర్చొని హ్యాపీగా ఫీలవుతుంది.
కావేరి చిన్నితో వెళ్లిపోదాం అని అంటుంది. చిన్ని తల్లితో లంచ్ టైం అయింది కదా తినేసి వెళ్దాం అంటుంది. అరగంటలో వంట చేసేస్తా తినేసి వెళ్లండి అని రాజు అంటాడు. చిన్ని తల్లిని ఒప్పిస్తుంది. చిన్ని కోసం కావేరి సరే అంటుంది. కావేరి సరే అనడంతో చిన్ని, ఆఫ్ టికెట్ ఎగిరి గంతులేస్తారు. మరోవైపు సత్యంబాబు, లాయర్ హరి దేవేంద్ర కోసం ఆ పేరు ఉన్న ప్రతీ ఇంటికి వెళ్లి వెతుకుతారు. సత్యంబాబు బాలరాజు వాళ్ల ఏరియాకే వస్తారు. చిన్ని, కావేరిలు అక్కడే ఉండి రాజుకి వంటలో సాయం చేస్తారు. లాయర్ బాలరాజుకి ఒక సారి అడుగుదామని అంటే వాడు చెప్పడు అని సత్యంబాబు అంటాడు. ఒకసారి గట్టిగా అడుగుదామని అంటాడు హరి దాంతో సత్యంబాబు రాజు ఇంటికి వెళ్తాడు.
సత్యంబాబు, హరి ఇంటికి రావడం హాఫ్ టికెట్ చూస్తాడు. వెంటనే బయటకు వెళ్తున్నట్లు బయట నుంచి తలుపు గడియ పెడతాడు. కావేరి చిన్నిల చెప్పుల మీద క్లాత్ వేసేస్తాడు. ఇంటికి తాళం వేసి రాజు లేడని పెద్ద గిరాకీ వచ్చిందని బయటకు వెళ్లాడని అంటాడు. తర్వాత వద్దాం అని సత్యంబాబు వాళ్లు వెళ్లిపోతూ సత్యంబాబు వెనక్కి వచ్చి బాలరాజు రాత్రి వరకు రాడా నిజమేనా అని అడుగుతాడు. నిజమే అని హాఫ్ టికెట్ చెప్పి ఊపిరి పీల్చుకుంటాడు. రాజు, ఉషలు వంట చేస్తూ ఒకరిని ఒకరు ఢీ కొట్టుకుంటారు. మరోసారి డీ కొట్టుకోకపోతే కొమ్ములు వస్తాయని చిన్ని చెప్తుంది. రాజు కూడా కావేరిని ఢీ కొట్టమని అంటాడు. చిన్ని బతిమాలడంతో రాజు తల పగిలేలా కావేరి ఢీ కొడుతుంది. మీ అమ్మ తల గట్టిదే అని రాజు చిన్నితో అంటాడు.
చిన్ని రాజు కావేరిలను ఆడుకోవడానికి పిలుస్తుంది. కావేరి తనకు ఇష్టం లేదని చెప్తుంది. ఇక చిన్ని మేం ఆడుకుంటాం నువ్వు చూడు అని చెప్తుంది. రాజు చిన్నూ ఇద్దరూ కళ్లకు గంతలు కట్టుకొని ఆడుకుంటారు. తర్వాత వాటర్‌తో ఆడుకుంటారు. కావేరి, చిన్ని రాజు ముగ్గురు వాటర్‌తో తడుస్తూ సరదాగా ఆడుకుంటారు. ముగ్గురు ఫుల్‌గా తడిసిపోతారు. అన్ని అడ్రస్‌లు పూర్తి చేసిన సత్యంబాబు, హరి చివరిగా కొన్ని ఇళ్లు తిరుగుతారు. ఇంతలో సత్యంబాబుకి దేవేంద్ర వర్మ ఎదురువుతాడు. సత్యం చేతిలో ఉన్న పేపర్ల గురించి అడుగుతాడు. సత్యంబాబు ఆర్డర్లు అని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: నాతో వచ్చేయ్ కావేరి మనం దూరంగా వెళ్లిపోదాం.. రాజుని కావేరి క్షమిస్తుందా!





















