అన్వేషించండి

Chinni Serial Today April 18th: చిన్ని సీరియల్: దేవేంద్రని కనిపెట్టే పనిలో సత్యంబాబు.. ఉషనే తన మేనత్తని తెలుసుకున్న చందు

Chinni Today Episode ఉష చందుతో తన పీటీ ఉషనే తన తల్లి కావేరి అని చెప్పడం చందు ఉషని అత్తమ్మా అని పిలవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode కావేరిని కోనేటిలో తోసేసిన మహిళ నాగవల్లి డబ్బు ఇస్తుందని వెయిట్ చేస్తుంటుంది. నాగవల్లి ( పాత నాగవల్లిని మార్చి కొత్త నాగవల్లిని పెట్టారు) ఆ మహిళలను కొట్టి డబ్బు ఇస్తుంది. ఇక సరళ కూరగాయలు కొంటుంది. అక్కడకి నాగవల్లి వెళ్తుంది. సరళని పలకరిస్తుంది. సరళని నాగవల్లి మీరు చాలా అందంగా ఉన్నారని బుట్టలో వేసుకుంటుంది. 

సరళని బుట్టలో వేసిన నాగవల్లి

నాగవల్లి సరళకు పీటీ టీచర్‌ గురించి మాట్లాడుతుంది. ఉష చాలా మంచిది అని పొగిడేస్తుంది. తను డెహ్రాడూన్ అమ్మాయి అని సరళ అంటుంది. దానికి నాగవల్లి తను అక్కడమ్మాయిలా లేదు మన రాజమండ్రి అమ్మాయిలా ఉంది అని నాగవల్లి అంటుంది. దానికి సరళ నాకు అదే అనుమానం వచ్చింది కానీ తన తల్లిదండ్రుల్ని చూస్తే అర్థమైంది తనని తెలుగు అమ్మాయిలా పెంచారని అని చెప్తుంది. ఇక నాగ వల్లి వెళ్లిపోతుంది. సరళ నాగవల్లి కారు చూసి అలాంటి కారులో తిరాగాలి అన్నా రాసి పుట్టాలి మెషెన్ తొక్కుకునే వాళ్లకి కార్లు ఎక్కడ నుంచి వస్తాయ్ అని బాధ పడుతుంది.

కావేరినే ఉష అని తెలుసుకున్న లాయర్

సత్యంబాబు చెల్లి కావేరి గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ మెషిన్ తొక్కుతాడు. మెషిన్  తన చేతి మీదకు వచ్చే టైంకి లాయర్ వచ్చి సత్యంని ఆపుతాడు. చెల్లి కష్టాలు కళ్ల ముందు కనిపిస్తుంటే బాధేస్తుందని అంటాడు. లాయర్ విషయం అడిగితే సత్యంబాబు కవర్ చేస్తాడు. నువ్వు నా దగ్గర ఏం దాచినా పర్లేదు కానీ కావేరి గురించి నిజం దాయొద్దని అంటాడు. దాంతో సత్యంబాబు ఉష తన చెల్లి కావేరి అని చెప్తాడు. లాయర్ నమ్మలేకపోతున్నాను మీరు చాలా అదృష్టవంతులు అని అంటాడు. దేవేంద్ర వర్మ అడ్రస్ తెలుసుకోవాలని కావేరిని కాపాడుకోవాలంటే ముందు అది మనకు తెలియాలి అని సత్యంబాబు అంటాడు.

దేవేంద్రని కనిపెడదాం పద..

 దానికి లాయర్ హరి వాడిది మన రాజమండ్రినే అయింటుందని హైదరాబాద్ బిజినెస్ పని మీద వెళ్లుంటాడని అందుకే హైదరాబాద్ మొత్తం వెతికినా దొరకలేదు ఇప్పుడు ఇక్కడ వెతకాలి అంటాడు. మున్సిపల్ ఆఫీస్‌కి వెళ్లి పేరుతో ఎంక్వైరీ చేద్దామని అతన్ని నేను చూశా కాబట్టి దేవేంద్రని గుర్తు పడతానని హరి అంటాడు. దాంతో ఇద్దరూ మున్సిపల్ ఆఫీస్‌కి వెళ్లారు. లాయర్, సత్యంబాబులు మున్సిపల్‌ ఆఫీస్‌కి వెళ్లి ఓ ఆఫీసర్‌తో తమకు దేవేంద్ర వర్మలు ఎంత మంది ఉంటే అంత మంది అడ్రస్‌లు కావాలని అడుగుతాడు. ఆఫీసర్ కుదరదు అంటే హరి ఆయనకు లంచం ఇస్తాడు. దాంతో ఆయన అడ్రస్ పంపిస్తానని అంటాడు.

నా ప్రాణం పోయినా పర్లేదు..

దేవేంద్ర వర్మ అంతు చూడాలని సత్యంబాబు అంటే హరి సత్యంబాబుతో వాడికి ఎదురెళ్లడం అంటే ప్రాణాలతో చెలగాటమే మనం తొందరపడకూడదు అని అంటాడు. దానికి సత్యంబాబు నా చెల్లి, మేనకోడలు సంతోషంగా ఉండటానికి నా ప్రాణాలు పోయినా పర్లేదని అంటాడు.  చెల్లి కోసం ప్రాణాలు తెగించి యుద్ధం చేసే నీలాంటి అన్నయ్య ఉన్నందుకు నీ చెల్లి చాలా అదృష్టవంతురాలు అని అంటాడు లాయర్. దానికి సత్యంబాబు నా చెల్లి పుట్టుకతోనే అదృష్టవంతురాలు ఎప్పుడైనా ఆ బాలరాజు దరిద్రం పట్టిందో అప్పుడే నా చెల్లి బతుకు ఇలా అయిపోయిందని అంటాడు.

అమ్మ చనిపోలేదు చందు..

చిన్ని గ్రౌండ్‌లో కూర్చొని డ్రాయింగ్ వేసుకుంటూ అమ్మ ఎప్పుడు నాన్నని అర్థం చేసుకుంటుందో నాన్న పూర్తిగా మారిపోయాడు అమ్మ అని నాన్నని అర్థం చేసుకో అమ్మ అని అమ్మానాన్నలు తన చేయి పట్టుకున్నట్లు డ్రాయింగ్ వేస్తూ ఏడుస్తుంది. చందు దూరం నుంచి చూసి చిన్ని ఒంటరిగా ఏం చేస్తుంది అనుకుంటాడు. దగ్గరకు వెళ్లి చూస్తాడు. ఆ డ్రాయింగ్ చూసి అత్తయ్య గురించి ఎప్పుడూ ఇలా ఆలోచిస్తే ఎలా అత్తయ్య చనిపోయినప్పుడు డిప్రెషన్‌లోకి వెళ్లి ఎంత బాధ పడ్డావో కదా ఇప్పుడు మళ్లీ ఇలా అయితే ఎలా అని ఈ బొమ్మ ఉంటే నువ్వు అత్తయ్య కోసం ఆలోచించి బాధ పడతావ్ బొమ్మ చింపేస్తా అని అంటాడు. చిన్ని ఆపుతుంది. అమ్మ చనిపోలేదని చెప్తుంది. చందు షాక్ అవుతాడు. అత్తయ్య చనిపోలేదా అని అడుగుతాడు.  చనిపోలేదని చిన్ని చెప్తుంది. మన పీటీ టీచరే మా అమ్మ అని చెప్తుంది. ఇంకా అదే భ్రమలో ఉన్నావా చిన్ని అని చందు అడిగితే భ్రమ కాదు నిజం అని మొత్తం చిన్ని చెప్తుంది. 

అత్తమ్మా అని పిలిచిన చందు..

డ్రాయింగ్ చూసి చందు ఏడుస్తాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని చందుతో చిన్ని చెప్తుంది. ప్రామిస్ వేయించుకుంటుంది. ఇక ఇద్దరూ కావేరిని చూడటానికి వెళ్తారు. వాళ్లు తనని చూడటం కావేరి గుర్తిస్తుంది. పిల్లల దగ్గరకు వస్తుంది. ఏంట్రా ఇక్కడ చేస్తున్నారు అంటే ఏం లేదు అత్తమ్మ అని చందు అంటే ఉష వరసలు ఏంట్రా అని అడుగుతుంది. మీరు మా నాన్నకి చెల్లి కాని చెల్లి కదా నన్ను మేనల్లుడు కాని మేనల్లుడు అని అన్నారు కదా అందుకే మీరు నాకు అత్తమ్మ కానీ అత్తమ్మ అంటాడు. దాంతో కావేరి చందు చెవి మెలేసి నవ్వుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: రత్నమాలకు పక్షవాతం.. గిరి మారిపోయాడా.. త్రిపుర పెళ్లికి ఒప్పుకుంటుందా!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలకు ఎక్కువైపోయిన అమ్మవారు! మూడో డోస్ కలిపేసిన అంబిక.. డేంజర్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలకు ఎక్కువైపోయిన అమ్మవారు! మూడో డోస్ కలిపేసిన అంబిక.. డేంజర్!
Nindu Manasulu Serial Today November 17th: నిండు మనసులు: సిద్ధూని మార్చడానికి గణ, ప్రేరణల మాస్టర్ ప్లాన్! గణ ఇంట్లో దీపావళి వేడుక వెనక సీక్రెట్!
నిండు మనసులు: సిద్ధూని మార్చడానికి గణ, ప్రేరణల మాస్టర్ ప్లాన్! గణ ఇంట్లో దీపావళి వేడుక వెనక సీక్రెట్!
Godavari Serial Today November 17th: 'గోదావరి' సీరియల్: జాను సేవలో సంజయ్.. శివుడు పారు ఫిదా! దీపావళి సంబరాల్లో ఫ్యామిలీ.. ఒంటరైన నందు!
'గోదావరి' సీరియల్: జాను సేవలో సంజయ్.. శివుడు పారు ఫిదా! దీపావళి సంబరాల్లో ఫ్యామిలీ.. ఒంటరైన నందు!
Nuvvu leka Neanu Lenu Serial Today NOV 17:భరత్ నిజస్వరూపం తెలుసుకుని రాధ షాక్‌...అనసూయకు పెళ్లి ఇష్టంలేదని విక్కీకి చెప్పేసిన రాధ
నువ్వులేక నేను లేను: భరత్ నిజస్వరూపం తెలుసుకుని రాధ షాక్‌...అనసూయకు పెళ్లి ఇష్టంలేదని విక్కీకి చెప్పేసిన రాధ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Demands Apology: తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Ranu Bombai Ki Ranu Lyrics : రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
మార్కెట్‌లోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు.. Bajaj Pulsar 180కి మళ్లీ బ్రేక్‌!
యూత్‌ఫుల్‌ బైక్‌ బజాజ్ పల్సర్ 180 ఇక కనిపించదా? ఐదేళ్లలో రెండోసారీ అదే పరిస్థితి
MS Dhoni Retires: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
Cheap Liquor Scam: ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
Embed widget