అన్వేషించండి

Brahmamudi November 28th Episode: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : అరుణ్‌ను పట్టుకుని నిజాలు బయటపెడతానన్న కావ్య- అప్పు, కళ్యాణ్‌లను అనుమానించిన అనామిక

Brahmamudi Serial Today Episode: స్వప్న, అరుణ్ విషయంలో నిజానిజాలు బయటపెట్టేందుకు కావ్య ఎంక్వైరీ మొదలుపెడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఇంట్రస్టింగ్గా జరిగింది.

Brahmamudi Telugu Serial Today Episode: అప్పును టిఫిన్‌ చేయమని వాళ్ల పెద్దమ్మ పిలవడంతో  టిఫిన్‌ వద్దని ఇంత విషం ఉంటే  పెట్టమని కోపంగా చెప్పి బయటకు వెళ్తుంది అప్పు. అప్పు పరిస్థితిని అర్థం చేసుకున్న కనకం వాళ్ల అక్కతో ఎలాగైనా అప్పును కళ్యాణ్‌ కు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది. అదే విషయం వాళ్ల అక్కతో చెబితే వద్దని వారిస్తుంది. కానీ కళ్యాణ్‌ కూడా అప్పును ప్రేమిస్తుండొచ్చని పెళ్లికి ముందే కళ్యాణ్‌కు విషయం చెప్పి అప్పును పెళ్లి చేసుకునేటట్లు చేస్తే  అప్పు సంతోషిస్తుందని కనకం చెప్తుండగానే వాళ్ల ఆయన కోపంగా దీన్ని కూడా ఆ ఇంటికే కోడలుగా పంపుతావా? నీకు బుద్దుందా ఈ విషయం తెలిస్తే ఇక్కడ ఉన్నదాన్ని అక్కడకు పంపడం కాదు. అక్కడ ఉన్న ఇద్దరినీ ఇక్కడకు పంపిస్తారు అంటూ వార్నింగ్‌ ఇస్తాడు. కనకం బాధపడుతూ చూస్తుండిపోతుంది. స్వప్న బెడ్‌రూంల టెన్షన్‌ పడుతూ ఉంటుంది. అక్కడికి కావ్య వచ్చి

కావ్య: ఇలా ఎంతకాలమని ఇంకా పిచ్చి పనులు చేస్తూనే ఉంటావు అక్క.   

స్వప్న: అసలే నేను చాలా చిరాకులో ఉన్నాను. నన్ను ఇంకా చిరాకు పెట్టకు.

కావ్య: నీకెందుకు చికాకు. మాకు కదా ఉండాలి.

స్వప్న: ఇక్కడ సమస్య నాది. నీది కాదు.

కావ్య: నీ సమస్య నాది కూడా.. అని ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావు అక్క. నువ్వు ఏ తప్పు చేసినా అది నా మెడకు  చుట్టుకుంటుంది. నీతో పాటు నన్ను కూడా కలిపి తప్పు పడతారు.

స్వప్న: అయితే ఇప్పుడు అందరి దగ్గరకు వెళ్లి మా చెల్లి ఏ తప్పు చేయలేదని బతిమాలమంటావా?

కావ్య: నేను మాట్లాడుతుంటే నీకు కోపం వస్తుంది కానీ నువ్వు ఎంత ధీనమైన పరిస్థితుల్లో ఉన్నావో తెలుస్తుందా?

స్వప్న: తెలుసు

కావ్య: తెలియదు. తెలిస్తే నువ్వు ఇలా చేయవు. ఏ ఆడపిల్లకైనా తల్లి కావడం అనేది చాలా పెద్ద విషయం. అది తెలియగానే ఎంత సంతోషపడుతుందో తెలుసా? తన చుట్టు ఉన్నవాళ్లకు తన భర్తకు అందరికీ గర్వంగా చెప్పుకుంటారు. దాన్ని ఒక పండగలా చేస్తారు. కానీ నీ విషయంలో మాత్రం అది తెలియగానే అందరూ అయోమయంలో పడ్డారు.

స్వప్న: ఎవ్వరేమనుకున్నా నేను మాత్రం ఏ తప్పు చేయలేదు.

కావ్య: చేయని దానివి అయితే ఆ అరుణ్‌కు డబ్బులెందుకు ఇచ్చావు?

అని కావ్య అడగగానే నేను ఎంతో నమ్మిన అరుణ్‌ ఇలా మారతాడని నేను అస్సలు ఊహించలేదు అంటూ బాధపడుతుంది స్వప్న. అయితే అరుణ్‌ ఎందుకు అలా మారాడో నేను తెలుసుకుంటాను. తెలుసుకుని నిజానిజాలు బయటపెడతాను. అంటూ స్వప్నను ధైర్యంగా సంతోషంగా ఉండమని చెప్తుంది కావ్య.  తర్వాత బయటకు వచ్చిన కావ్య అరుణ్‌ గురించి ఆలోచిస్తుంది.

రుద్రాణి రాహుల్‌ ను ఆఫీసుకు వెళ్లమని ఇంట్లో ఖాళీగా కూర్చోవడం బాగాలేదని మందలిస్తుంది.

రాహుల్‌: అక్కడికి వెళ్లి రాజ్‌ చెప్పింది చేస్తూ.. అలాగే సార్‌ అంటూ అసిస్టెంట్‌గా పనిచేయమంటావా?

రుద్రాణి:  రాజు  లాంటి శకుని  కూడా కొన్నాళ్లు ఖారాగారంలో ఉండాల్సి వచ్చింది.

రాహుల్‌: పోలీకలు కూడా విలన్‌తోనే పోల్చాలా మామ్‌.

రుద్రాణి: మనది కానీ అస్థిని మనది చేసుకోవాలనుకుంటే అలాంటి వాళ్లనే ఫాలో అవ్వాలి.

అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటుంటే అక్కడికి కావ్య వస్తుంది.  అరుణ్‌కు స్వప్న డబ్బులు ఇచ్చిన విషయం మీకెలా తెలిసింది. ఆ ఫోటోలు మీ దగ్గరకు ఎలా వచ్చాయి. అంటూ ప్రశ్నించడంతో రాహుల్‌, అరుణ్‌ ఇచ్చాడని వాడినే అడగమని చెప్తాడు. అనామిక, కళ్యాణ్‌ షాపింగ్‌కు ఓల్డ్‌ సిటీకి వెళ్తుంటారు. కళ్యాణ్‌ షాపింగ్‌కు అప్పును తీసుకెళ్దామని అనామికకు చెప్తాడు. కనకం ఆలోచిస్తూ కూర్చుని ఉంటుంది. వాళ్ల అక్క వచ్చి మూర్తి చెప్పిందే కరెక్ట్‌ అని నువ్వేమి ఆలోచించొద్దని చెప్తుంది. కానీ అప్పు పరిస్థితి చూస్తే బాధేస్తుందని కనకం చెప్తుంది. ఇంతలో కళ్యాణ్‌ అప్పును పిలుస్తూ లోపలికి వస్తాడు.

కళ్యాణ్‌: ఆంటీ అప్పు ఎక్కడ?

కనకం: ఎక్కడంటే ఏం చెప్పను బాబు గదిలోంచి బయటకు రావడమే లేదు.

కళ్యాణ్‌: ఏందుకు.. ఏమైంది?

 కనకం: ఎందుకు అంటే సమాధానం చెప్పదు. తినమంటే తినదు. ఊరికే మామీద అరుస్తుంది. దాని బాధేంటో నువ్వైనా కనుక్కో బాబు.   

అనగానే కళ్యాణ్‌ అప్పు రూంలోకి వెళ్లి ఎందుకు బాధపడుతున్నావు.. అసలు నువ్వు నువ్వేనా అంటూ బయటకు తీసుకువస్తాడు. అప్పు కళ్యాణ్‌ను తిడుతుంది. కళ్యాణ్‌ అవేమీ పట్టించుకోకుండా అప్పును షాపింగ్‌కు వెళ్దామని బతిమాలుతాడు. అప్పుకు పాత జ్ఞాపకాలు గుర్తు చేస్తాడు. ఇంతలో అనామిక లోపలికి వచ్చి కళ్యాణ్‌ మీద కోప్పడుతుంది. పిచ్చిదానిలా నన్ను కారులో కూర్చోబెట్టడం ఎం బాగాలేదని.. ఇప్పటివరకు నాకోసం ఎవ్వరైనా వెయిట్‌ చేశారని నేను ఎవ్వరి కోసం వెయిట్‌ చేయలేదని సీరియస్‌ అవుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్‌ అయిపోతుంది.

Also Read : 'ఆర్య 2'కి 14 ఏళ్లు - బన్నీ ఎమోషనల్ పోస్ట్!

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని బావిలో తోసేసిన బంటి! సిరి ఇక చనిపోయినట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని బావిలో తోసేసిన బంటి! సిరి ఇక చనిపోయినట్లేనా!
Nindu Manasulu Serial Today October 13th: నిండు మనసులు: జడ్జి ముందు సిద్ధూ, ప్రేరణల విడాకుల టాపిక్! 2 రోజుల్లో తుది నిర్ణయం!
నిండు మనసులు: జడ్జి ముందు సిద్ధూ, ప్రేరణల విడాకుల టాపిక్! 2 రోజుల్లో తుది నిర్ణయం!
Godavari Serial Today October 13th: 'గోదావరి' సీరియల్: సూర్యని లవ్ చేసి నాకు ఎలా ఐలవ్‌యూ చెప్తావ్? జానుపై సంజు ఫైర్! 50 వేలు కోసం నందు, గౌతమిల గొడవ!
'గోదావరి' సీరియల్: సూర్యని లవ్ చేసి నాకు ఎలా ఐలవ్‌యూ చెప్తావ్? జానుపై సంజు ఫైర్! 50 వేలు కోసం నందు, గౌతమిల గొడవ!
Aishwarya Pisse Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ హీరోయిన్... భర్తకు దూరమై ఏడాది, ఇప్పుడు వేరు కాపురం
విడాకులు తీసుకున్న సీరియల్ హీరోయిన్... భర్తకు దూరమై ఏడాది, ఇప్పుడు వేరు కాపురం

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget