అన్వేషించండి

Brahmamudi November 21st Today Episode : ‘బ్రహ్మముడి’ సీరియల్: కనకానికి సూసైడ్ టెన్షన్, రాహుల్ కుట్రకు స్వప్న బలికానుందా!

Brahmamudi Serial Today Episode: అప్పు సూసైడ్ చేసుకుంటుందేమో అని కనకం భయపడడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది

Brahmamudi Serial November 21st Episode

స్వప్న: మళ్లీ ఎందుకు ఫోన్ చేశావు.. నీకు రాత్రే చెప్పాను కదా మళ్లీ ఫోన్ చేస్తు పోలీసులకు చెప్తానని అప్పుడే మర్చిపోయావా. అసలు ఎందుకు కాల్ చేశావ్.. ఎందుకు నాతో మాట్లాడాలి అనుకుంటున్నావు. అసలు నీకు నాకు ఏంటి సంబంధం
అరుణ్: అక్రమ సంబంధం. మన మధ్య ఉన్న అక్రమ సంబంధం గురించి అప్పుడే మర్చిపోయావా
స్వప్న: పళ్లు రాలిపోతాయ్ ఇడియట్ ఏం మాట్లాడుతున్నావురా
అరుణ్: జోకు చేస్తున్నా. నిన్ను ఆపడానికి అలా చెప్పా
స్వప్న: అసలు నీకు ఏం కావాలి రా.. ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావ్
అరుణ్: ఇప్పుడు ఇప్పుడు అసలు పాయింట్‌కి వచ్చావు. నిన్న నైట్ నీ దగ్గరకు ఎందుకు వచ్చానో తెలుసా. నీకు భయాన్ని పరిచయం చేయడానికి వచ్చాను. ఇప్పుడు నాకు కావాల్సింది అడుగుతా కాదూ కూడదు అంటే మాత్రం ఊరుకోను
స్వప్న: ఏం కావాలిరా నీకు
అరుణ్‌: ఏం లేదు హాస్పిటల్ కడుతున్నాను. దాని కోసం పది లక్షలు కావాలి. అది ఇస్తే నేను నీకు ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టను 
స్వప్న: అసలు నేను నీకు ఎందుకు ఇవ్వాలిరా నేనేం తప్పు చేశాను. ఇంటికొస్తే రా నాకేం భయం లేదు
అరుణ్: అయ్యో పిచ్చిదానా నేనెందుకు వస్తాను. కొరియర్‌లో ఫొటోలు వచ్చినట్లే మనం కలిసి తిరిగినట్లు రూమ్‌లో గడిపినట్లు గ్రాఫిక్స్‌లో ఫొటోలు చేసి పంపిస్తాను. అసలే నీ అత్తారింట్లో నీ మీద నమ్మకం లేదు. ఇప్పుడు నాతో సంబంధం పెట్టుకున్నావ్ అని తెలిస్తే నువ్వు రోడ్డుపాలవుతావు. అదే నేను అడిగిన డబ్బు నాకు ఇస్తే నువ్వు హ్యాపీగా నీ ఇంట్లో ఉంటావు
స్వప్న: అంత డబ్బు నేనెక్కడి నుంచి తీసుకురావాలి
అరుణ్: నీకు రేపటి వరకు టైం ఇస్తున్నా రేపు మనీ రాకపోతే మీ ఇంటికి కొరియర్ వస్తుంది.

స్వప్న అరుణ్‌కి డబ్బులు ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తుంది. ఇక తాతయ్య నగలు తాకట్టు పెట్టాలి అనుకుంటుంది. కానీ ఇంట్లో తెలిస్తే గొడవ అవుతుందని భయపడుతుంది. మరోవైపు కనకం ఇంటి బయట నుంచి కొందరు ఆడవాళ్లు పరుగుపెడతారు. ఏమైందని అడిగితే ఓ అమ్మాయి ఆత్మ హత్య చేసుకుందని చెప్పడంతో కనకం షాక్ అవుతుంది. అప్పు కూడా అలా చేస్తుందా అని భయపడుతుంది. తనని జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటుంది. అలాగే అప్పు ఓ దగ్గర ఉంటే వెళ్లి మాట్లాడి తనకు వంట దగ్గర సాయం చేయమని అడుగుతుంది. దీంతో అప్పు తన తల్లి వెంట వెళ్తుంది.

మరోవైపు పోలీస్ ఆఫీసర్ రాజ్‌కి కాల్ చేస్తాడు. అరుణ్ ఫైనాన్షియల్‌గా ఇబ్బందుల్లో ఉన్నాడని అంతకు మించి ఇంకే అనుమానంగా లేదని చెప్పాడు. కాలేజ్‌ టైంలో ఇద్దరూ క్లోజ్ అని చెప్తాడు. దీంతో స్వప్న కోసం అనవసరంగా అనుమానపడుతున్నానని అనుకున్నాడు. ఇంతలో కావ్య అప్పుడు వస్తుంది.

కావ్య: మీరెప్పుడు వచ్చారు ఆఫీస్ నుంచి
రాజ్: ఒక మనిషి రావడం కనిపించలేదు అంటే దొంగ వచ్చినా వదిలేస్తావా
కావ్య: మీరు రావడం మీ అమ్మకు కూడా తెలీదు అంటే మీ అమ్మ కూడా బాధ్యత లేదు అంటారా
రాజ్: మా అమ్మతో మీకేంటి పోలిక
కావ్య: ఆఫీస్ నుంచి రాగానే ఎలా గొడవ పడాలి అని అనుకుంటారా
రాజ్: ఆఫీస్ నుంచి రాగానే మొగుడికి కాఫీ ఇవ్వాలి.. మంచి నీరు ఇవ్వాలా అని అడగడం తెలీదా భార్యగా అది నీ బాధ్యత అంటూ గిల్లీగజ్జాలు పెట్టుకుంటారు. 

ఇక అప్పూకి వాళ్ల అమ్మ పనులు చెప్తూ కల్యాణ్ గురించి ఆలోచించకుండా ఉండేలా చూసుకుంటుంది. దాన్ని గమనించిన తన అక్క పక్కింటి సిరిలా అప్పు సూసైడ్ చేసుకుంటుంది అనే కదా ఇలా చేస్తున్నావ్ అని అంటుంది.

స్వప్న: ఇప్పుడికి ఇప్పుడు అంత డబ్బు అంటే ఎక్కడ నుంచి తీసుకురావాలి. దుగ్గిరాల కోడలు అంటే కోట్లు ఉంటాయి అనుకుంటున్నాడా ఆ ఇడియట్. వాడికేం తెలుసు నేనిక్కడ ఎలా ఉంటున్నానో
రాహుల్: ఎవ్వరికీ భయపడను తేల్చుకుంటాను అని చెప్పి నా పెళ్లాం తెగ టెన్షన్ పడిపోతుంది. నా ప్లాన్‌తో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది. ఏమైంది స్వప్న ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు
స్వప్న: నేనా టెన్షనా ఎందుకు అలా ఏం లేదు. దొంగ వీడు ఇలాంటివి మాత్రం బాగా గుర్తుపడతాడు. భార్యను బాగా చూసుకోవడం మాత్రం తెలీదు. 
రాహుల్: చెప్పు స్వప్న ఏదైనా ప్లాబ్లమా. నేను పరిష్కరిస్తా
స్వప్న: నువ్వు నాకు సాయం చేస్తావా. నేను ఎప్పుడు తప్పు చేస్తానా అని ఎదురుచూస్తావు కదా ఇప్పుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నావ్
రాహుల్: అంటే తాతయ్య ఆరోగ్యం బాలేదు కదా మమ్మీ గొడవలు పడొద్దని చెప్పింది. అమ్మో దీనికి అనుమానం వచ్చినట్లుంది.  
స్వప్న: నిజంగానే రాహుల్ హెల్ప్ చేస్తాడా.. నిజంగానే అంత డబ్బు ఇస్తాడా.. వద్దులే మళ్లీ అంత డబ్బు ఎందుకు అని అడిగితే నేను ఇరుక్కుంటాను. రేపు తెల్లారిలో నేనే ఏదో ఒకటి చేస్తా. 

మరోవైపు రాజ్, కావ్యలు ఒకర్ని మరొకరు సెటైర్లు వేసుకుంటారు. ఇక కనకం అప్పు గదికి వెళ్తుంది. అప్పు బెడ్ మీద పడి ఉండడం చూసి షాక్ అవుతుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS: 'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
R Krishnaiah News: బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Kakinada News: కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియోబంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS: 'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
R Krishnaiah News: బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Kakinada News: కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
Amazon: ఏడాదికి రూ.2 కోట్ల ప్యాకేజీతో అమెజాన్‌లో కొలువు - వికారాబాద్ జిల్లా యువకుడి ఘనత
ఏడాదికి రూ.2 కోట్ల ప్యాకేజీతో అమెజాన్‌లో కొలువు - వికారాబాద్ జిల్లా యువకుడి ఘనత
BRS: అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
Telangana Group 2 Hall Tickets 2024: తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్‌ అప్ డేట్ - హాల్‌ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్‌ అప్ డేట్ - హాల్‌ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
Chennemaneni Ramesh: మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు బిగ్ షాక్ - జర్మనీ పౌరుడేనని తేల్చిచెప్పిన హైకోర్టు, రూ.30 లక్షల జరిమానా
మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు బిగ్ షాక్ - జర్మనీ పౌరుడేనని తేల్చిచెప్పిన హైకోర్టు, రూ.30 లక్షల జరిమానా
Embed widget