Brahmamudi Serial Today March 28th: రాజ్ పై శివాలెత్తిన స్వప్న - బాబును తీసుకురావడంతో అంతు చూస్తానని వార్నింగ్
Brahmamudi Today Episode: ఇంటికి వచ్చిన స్వప్నకు రాజ్ బిడ్డన తీసుకొచ్చాడని తెలియడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తిగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: కావ్య బాబును నిద్రపుచ్చుతుంది. దీంతో రాజ్ థాంక్స్ చెప్తాడు. దేనికి అని కావ్య అడగ్గానే కష్టపడ్డా ఇష్టపడ్డందుకు అని రాజ్ చెప్పడంతో.. మీరు థాంక్స్ చెప్తే నేను సంతోషించే రోజులు పోయాయని మీరు నేను అడిగితే చెప్పరు. మీరు చెప్పేది నాకు అక్కర్లేదు అంటుంది. మరోవైపు అందరూ హాల్ లో కూర్చుని మాట్లాడుకుంటుంటారు. ఇంతలో డెలివరీ అంటూ బాయ్ వస్తాడు.
రుద్రాణి: డెలివరీనా? అల్ రెడీ ఇక్కడ డెలివరీ అయిపోయి బేబీ బాయ్ పుట్టుకొచ్చాడు. నువ్వేం డెలివరీ చేయడానికి వచ్చావు బాబు.
బాయ్: ఈ పార్శిల్ ఆర్డర్ పెట్టారు.
రుద్రాణి: వెళ్లి చూడరా
అనగానే రాహుల్ వెళ్లి డెలివరీ తీసుకొచ్చి ఇదేదో ఊయలలా ఉందని అనడంతో రుద్రాణి వదినా నువ్వే ఆర్డర్ చేశావా అంటూ ఇది నీ మనవడి కోసమేగా అనడంతో అపర్ణ కోపంగా రుద్రాణిని తిడుతుంది. మరి ఊయల ఎవరు ఆర్డర్ చేశారని రుద్రాణి అనడంతో నేనే ఆర్డర్ చేశానని రాజ్ వస్తాడు. రాజ్ పార్శిల్ ఓపెన్ చేస్తుంటే రుద్రాణి వెటకారంగా మాట్లాడుతుంది. ఇందిరాదేవి రుద్రాణిని తిడుతుంది. ఇంతలో రాజ్‌కు ఫోన్ రావడంతో రాజ్ హలో అంటూ బయటకు వెళ్లిపోతుంటే..
రుద్రాణి: వాడి తల్లేమో..? కొడుకు యోగక్షేమాలు కనుక్కోవడానికేమో..?
ధాన్యలక్ష్మీ: అత్తయ్యా ఏంటిదంతా నట్టింట్లో ఉయ్యాల వేసిన ఎవరూ అడగపోతే ఎలా?
రుద్రాణి: రాజ్ ను ఎవరు అడుగుతారు రారాజు కదా? ఊయలలో పడుకున్న వాడి జేజేమ్మ కూడా ఇక్కడే ఉంది. వాడి జేజేమ్మ దిగొచ్చినా ఏం చేయలేదని అర్థం అయిపోయింది.
అంటూ వెటకారంగా రుద్రాణి మాట్లాడుతుంటే అపర్ణ లేచి వెళ్లిపోతుంటే బాబు ఏడుస్తాడు. అందరూ చూస్తుండిపోతారు. ఇంతలో స్వప్న వచ్చి బాబును ఎత్తుకుంటుంది. బాబు ఏడుస్తుంటే ఎవ్వరూ పట్టించుకోరేంటి అని ఈ బాబు ఎవరు అని అడుగుతుంది. దీంతో రుద్రాణి వాడు రాజ్ కొడుకు అని చెప్పగానే రాజ్ చాలా మంచోడు అలా చేయడు అంటూ స్వప్న అందర్నీ నిలదీస్తుంటే రాజ్ లోపలికి వస్తూ నా బిడ్డే అంటాడు. దీంతో స్వప్న షాక్ అవుతుంది. రాజ్ బాబును ఎత్తుకుని పైకి వెళ్తాడు. కావ్యను రూంలోకి తీసుకెళ్లిన స్వప్న కోపంగా ఏంటది అని అడుగుతుంది.
స్వప్న: రాజ్ ఏంటి నా బిడ్డ అన్నాడు.
కావ్య: చెప్పడానికేం లేదు అక్కా.. నువ్వు ప్రయాణం చేసి బాగా అలసిపోయినట్లున్నావు కాస్త రెస్ట్ తీసుకో.. నేను వెళ్లి ఆయనకు బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేస్తాను.
స్వప్న: చేయ్ బాగా చెయ్.. పాపం రాజ్ ఆకలితో ఎదురుచూస్తుంటాడు కదా? ఇంతకీ ఎం చేస్తున్నావు. నీ మొగుడికి బ్రెడ్ ఆమ్లేట్ అంటే ఇష్టం కదా అది చెయ్యకపోయావా?
కావ్య: ఎందుకు అక్క అంత వెటకారంగా మాట్లాడుతున్నావు.
స్వప్న: నేను వెటకారంగా మాట్లాడడం ఏంటి? పాపం రాజ్ ప్రపంచం తలకిందులైనా కొడుకును చూసుకోలేక కష్టపడుతూ అలిసిపోయి ఉంటాడు.
అంటూ స్వప్న కోపంగా కావ్యను తిడుతుంది. దీంతో కావ్య ఆ బిడ్డకు తల్లి ఎవరో తెలిసే వరకు నువ్వు ఏ గొడవ చెయ్యకు అంటూ బాధపడుతుంది. ఈ ఇంట్లో ఇప్పుడు నువ్వు తప్ప నాకు సాయం చేసే వాళ్లు ఎవరూ లేరు అనేసరికి స్వప్న సరే అంటుంది. మరోవైపు కళ్యాణ్ అప్పుకు ఫోన్ చేస్తాడు.
కళ్యాణ్: హలో బ్రో ఎలా ఉన్నావు..?
అప్పు: మీ అన్నయ్య చేసిన పనికి ఎలా ఉంటాము. మా అక్క జీవితం ఏమౌతుందోనని ఇంట్లో అందరం కంగారుపడుతున్నాం.
కళ్యాణ్: నేను అర్థం చేసుకోగలను బ్రో..
అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటుంటే అనామిక వచ్చి వింటుంది. ఈ టైంలో మా అక్కకు హెల్ఫ్ గా ఉండాలని ఉంది అని అప్పు అనడంతో నువ్వేం టెన్షన్ పడకు ఇక్కడ వదినకు ఏం అవసరం వచ్చినా నేను చూసుకుంటాను అంటూ భరోసా ఇచ్చి ఫోన్ కట్ చేస్తాడు. అనామికను గమనించిన కళ్యాణ్ కోపంగా ఇలా దొంగచాటుగా వినడం మానవా నువ్వు అనగానే.. దొంగచాటుగా వినాల్సిన కర్మ నాకేం పట్టలేదు. అనగానే కళ్యాణ్ వెళ్లిపోతాడు. మరోవైపు రాజ్ బాబుకు స్నానం చేయించడానికి వెళ్తుంటే అలా చేయించకూడదని నేను చెప్తాను అలా చేయండని చెప్తుంది కావ్య. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: కాంట్రవర్షియల్ క్రిటిక్ మెచ్చిన క్రూ - ముగ్గురు హీరోయిన్స్ సినిమాకు 3 ప్లస్ రేటింగా!?