అన్వేషించండి

Brahmamudi Serial Today March 26th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : రాజ్‌‌ను భోజనం దగ్గర అవమానించిన రుద్రాణి - తినకుండా కోపంగా వెళ్లిపోయిన అపర్ణ

Brahmamudi Today Episode: భోజనం దగ్గర రాజ్ ను రుద్రాణి దారుణంగా అవమానిస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది.

Brahmamudi Serial Today Episode:  అందరూ డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చుని ఉంటారు.. తినకుండా రాజ్‌ కోసం ఎదురుచూస్తుంటారు. ఇంతలో రుద్రాణి అందరి ముందుకు రాలేక రాజ్‌ రూంలోనే ఉండిపోయాడేమో అంటుంది. అందరూ నీ కొడుకులాగా దులిపేసుకోలేరు అంటాడు సుభాష్‌. ఇంతలో రాజ్‌ వచ్చి డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చొని తనకు తానే వడ్డించుకుంటుంటే..

రుద్రాణి: తొందరగా వడ్డించుకో రాజ్‌ ఇలాంటి సమయంలోనే గబగబా తినాలి.  ఎందుకంటే బాబు లేస్తాడు. లేస్తే ఏడుస్తాడు. ఏడిస్తే ఎత్తుకోవడానికి వాడి కన్నతల్లి ఇక్కడ లేదుగా

అంటూ రుద్రాణి మాట్లాడుతుంటే  అపర్ణ లేచి వెళ్లబోతుంది. ఆపర్ణ చేయి పట్టుకుని రాజ్‌ అపుతాడు.

రాజ్‌: మమ్మీ భోం చేసి వెళ్లు..

అపర్ణ: రుద్రాణి మాటలతో నా కడుపు నిండిపోయింది. నీలాంటి వంశోద్దారకుణ్ని కన్నందుకు నాకింకా ఎన్ని అవమానాలు జరుగుతాయే తెలియక కడుపు రగిలిపోయి ఆకలి చచ్చిపోయింది.

రాజ్‌: మమ్మీ ఎవరి మీదో కోపం అన్నం మీద చూపించకూడదని నువ్వేగా చెప్పావు.

అపర్ణ: నేనింకా చాలా చెప్పాను తప్పు చేయకూడదని చెప్పాను. ఇంటి పరువు తీయకూడదని చెప్పాను. వంశ గౌరవం నిలబెట్టాలని చెప్పాను. నువ్వు తిను.

రాజ్‌: నేను భోజనం చేయడం  మీకెవ్వరికీ నచ్చకపోతే.. నావల్ల మీరెందుకు అన్నం మానేయాలి. నేనే వెళ్లిపోతాను.

రుద్రాణి: ఇప్పుడు కొడుకు తినకుండా పోయాడని మా వదిన కన్నపేగు కదిలిపోయి తను తినడం మానేస్తుందేమో?

అనగానే అపర్ణ తినకుండా వెళ్లిపోతుంది. దీంతో ఒకరి తర్వాత ఒకరు లేచి వెళ్లిపోతారు. ధాన్యలక్ష్మీ మాత్రం తనకు బాగా ఆకలేస్తుందని తినబోతే సుభాష్‌ తిడతాడు. దీంతో ధాన్యలక్ష్మీ, రుద్రాణి, రాహుల్‌, అనామిక కూడా తినకుండా వెళ్లిపోతారు. తర్వాత కావ్య ప్లేట్‌ లో భోజనం రాజ్‌కు తీసుకెళ్తుంటే అపర్ణ వచ్చి ఆపుతుంది. ఇలా చేయడం కరెక్టు కాదని కావ్య చెప్పి భోజనం తీసుకుని వెళ్తుంది.

రాజ్‌: నాకు ఆకలిగా లేదు.

కావ్య: ఇది పాత సినిమాల డైలాగ్‌

రాజ్‌: నీకు నా కథ సినిమాలా ఉందా?

కావ్య: ఆకలిగా లేదన్నమాట లక్షసార్లు విన్నట్టే ఉంది. ఓ బిడ్డను ఎత్తుకొచ్చి వీడు నా బిడ్డ అన్నాక ఏ పెళ్లానికైనా మొగుడి మీద సానుభూతి ఉంటుందా? నోరు మూసుకుని తినండి.

అని ప్లేట్‌ తీసి రాజ్‌ చేతిలో పెడుతుంది కావ్య. రాజ్‌ తింటుంటే కావ్య చూస్తుంది. రాజ్‌ తిన్నాక

కావ్య: ఇప్పుడు చెప్పండి ఇదంతా ఎందుకు చేస్తున్నారు. ఇంట్లో వాళ్లను ఎందుకు బాధపెడుతున్నారు.  

రాజ్‌: ఎవరిని బాధపెట్టాలన్న ఉద్దేశం నాకు లేదు.

కావ్య: మరి ఇందులో ఏదైనా లోక కళ్యాణం ఉందా?

రాజ్‌: నాకు ఇంకో దారి లేదు.

కావ్య:  మీ దారిలో మీకు  మీ కుటుంబం ఉంది. అది మర్చిపోతున్నారు.

రాజ్‌: అలాగని నా బాధ్యత నేను వదిలేసుకోలేను.

కావ్య: మీరిలా గదిలో కూర్చుని బాధపడుతూ ఇంట్లో వాళ్లను కూడా బాధపెడుతున్నారు. ఇవాళ ఎవరూ భోజనం  చేయలేదు దానికి కారణం మీరే కదా? కనీసం వాళ్ల గురించైనా ఆలోచించి నోరు తెరచి నిజం ఏంటో చెప్పండి.  

రాజ్‌: నిజం నిద్రపోతుంది.

కావ్య: అబద్దం ఆవలిస్తుందా.?

అనగానే రాజ్‌ కోపంగా నువ్వు నాతో మాట్లాడటానికే భోజనం తెచ్చావా అంటూ కోప్పడి గుడ్‌నైట్‌ అంటూ నిద్రపోతుంటే.. ఎన్నాళ్లీ నిజం నిద్రపోతూనే ఉంటుంది అంటూ కావ్య అడిగినా చెప్పకుండా నిద్రపోతాడు రాజ్‌. మరోవైపు ధాన్యలక్ష్మీ, రుద్రాణి, అనామికలు అందరూ ఆకలి వేస్తుందని బాధపడుతుంటారు. ఇంతలో రాహుల్‌ ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేశానని చెప్పడంతో అందరూ హ్యాపీగా ఫీలవుతారు. ఇంతలో డెలివరీ బాయ్‌ ఫుడ్‌ తీసుకుని వస్తాడు. బయట ఫోన్‌ మాట్లాడుతున్న సుభాష్‌ , డెలివరీ బాయ్‌ని ఎం తీసుకొస్తున్నావు అంటూ అడగ్గానే ఫుడ్‌ తీసుకొస్తున్నానని.. చెప్పగానే ఎవరు ఆర్డర్‌ చేశారని సుభాష్‌ అడుగుతాడు. రాహుల్‌ అని డెలివరీ బాయ్‌ చెప్పగానే రాహుల్‌ ఎవరూ ఈ ఇంట్లో లేరని ఆ ఫుడ్‌ నువ్వే తినమని సుభాష్‌ చెప్పి లోపలికి వెళ్తాడు. లోపల ఉన్న ఫుడ్‌ కూడా తీసుకువచ్చి డెలివరీ బాయ్‌కి ఇస్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: సెలబ్రిటీల హోలీ వేడుకలు చూద్దాం రండి - ఎవరెవరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారంటే..

టాప్ హెడ్ లైన్స్

Debjani Modak: బెంగాలీ భామ, తెలుగు బుల్లితెర 'వేద'.. దేబ్జానీ మోదక్ రియల్ లైఫ్ విశేషాలు
బెంగాలీ భామ, తెలుగు బుల్లితెర 'వేద'.. దేబ్జానీ మోదక్ రియల్ లైఫ్ విశేషాలు
Jagadhatri Serial Today JULY 21th: యువరాజుపై చేయిచేసుకున్న నిషిక...భార్య చెంప పగులగొట్టిన యువరాజు
జగద్ధాత్రి సీరియల్: యువరాజుపై చేయిచేసుకున్న నిషిక...భార్య చెంప పగులగొట్టిన యువరాజు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 21st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సొంత ఇంటికి చేరుకున్న క్రిష్! అక్కతో ఆటలు.. నానమ్మ గోరుముద్దలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సొంత ఇంటికి చేరుకున్న క్రిష్! అక్కతో ఆటలు.. నానమ్మ గోరుముద్దలు!
Godavari Serial Today July 21st: 'గోదావరి' సీరియల్: దుకాణంలో నందుతో దుకాణం పెట్టేసిన మురళీ! సీన్ అదుర్స్! గోదారమ్మాయిని వదిలేసిన పడవబ్బాయ్!
'గోదావరి' సీరియల్: దుకాణంలో నందుతో దుకాణం పెట్టేసిన మురళీ! సీన్ అదుర్స్! గోదారమ్మాయిని వదిలేసిన పడవబ్బాయ్!

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadambari Jethwani Case Facts: ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
Rahul Gandhi Lok Kalyan Marg Protest: ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
Balakrishna Injured: బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
Rag Mayur: రాగ్ మయూర్ నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు
రాగ్ మయూర్ నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు
Benefits Of Walk After Dinner: రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Embed widget