అన్వేషించండి

Brahmamudi Serial Today January 22nd: కావ్యను హాస్పిటల్ కు తీసుకెళ్లిన స్వప్న – హాస్పిటల్లో శ్వేత, రాజ్ ను చూసి షాక్ అయిన కావ్య

Brahmamudi Today Episode: శ్వేతను రాజ్ హాస్పిటల్ కు తీసుకుని రావడం కావ్య చూస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది.

Brahmamudi Serial Today Episode: అనామిక, రుద్రాణి కలిసి హాల్లోకి వస్తారు. ధాన్యలక్ష్మీ కిచెన్‌లో వంట చేస్తుంటే అంటీ మీరు వెళ్లి మాట్లాడండి అని రుద్రాణిని ధాన్యలక్ష్మీ దగ్గరకు పంపిస్తుంది అనామిక. రుద్రాణి, ధాన్యలక్ష్మీ దగ్గరకు వెళ్ళి కళ్యాణ్‌ ఇంకెప్పుడు ఆఫీసుకు వెళ్తాడని అతనేం ఇంకా చిన్నపిల్లాడు కాదని రుద్రాణి అంటుంది. అనామిక కోసమైనా కళ్యాణ్‌ ఆఫీసుకు వెళ్లాలని లేదంటే వారిద్దరి కాపురంలో గొడవలు వస్తాయని కట్టుకథలు చెప్తుంది రుద్రాణి. దీంతో ధాన్యలక్ష్మీ ఆలోచనలో పడిపోతుంది. రుద్రాణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

అనామిక: ఏంటంట?

రుద్రాణి: నువ్వు చెప్పినట్లే ధాన్యలక్ష్మీ మనసులో అనుమానం అనే విత్తనం నాటాను. అది ఇప్పుడు పెరిగి చెట్టులా మారి కళ్యాణ్‌ కోసం పోరాడుతుంది.

అనామిక: అప్పుడే పోరాడదు ఆంటీ మా అత్తయ్య అనుమానం పెరిగే కొద్దీ దానికి మనం బలాన్నివ్వాలి.

రుద్రాణి: అందుకు నేనున్నానుగా.. కళ్యాణ్‌కు రాజ్‌తో పాటు సమానమైన హోదా వచ్చే వరకు  నీకోసం నేను నిలబడతాను.

  అనగానే అనామిక థాంక్స్‌ చెప్పి వెళ్లిపోతుంది. పిచ్చిదాన నేను నీకు హెల్ప్‌ చేయడం లేదే కళ్యాణ్‌ను అడ్డుపెట్టుకుని రాహుల్‌కు కూడా ఆస్థిలో భాగం వచ్చేలా చేస్తున్నా అని మనసులో అనుకుంటుంది రుద్రాణి. మరోవైపు రాజ్‌ రెడీ అవుతుంటాడు. ఇంతలో శ్వేత ఫోన్‌ చేసి రాజ్‌ సేవ్‌ మీ ఫ్లీజ్‌ అంటూ ఫోన్‌లో గట్టిగా ఆరుస్తూ.. కాల్‌ కట్‌ చేస్తుంది. టెన్షన్‌గా రాజ్‌ వెళ్లబోతుంటే.. కావ్య కాఫీ తీసుకుని వస్తుంది. ఎక్కడికి  అని అడుగుతుంది అర్జెంట్‌  పని ఉంది వెళ్తున్నానంటూ వెళ్లిపోతాడు. మూర్తి ఇంట్లో కూర్చుని ఉండగా ఆర్డర్‌ ఇచ్చిన వ్యక్తి వచ్చి 15 రోజులైంది ఇంకా పూర్తి చేయలేదేంటని అడుగుతాడు. మా అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యింది అందుకే పని చేయలేకపోయానని మూర్తి చెప్పగానే ఆయన సరేలే అని వెళ్లిపోతాడు. మరోవైపు హాల్లో కావ్య, స్వప్న, బామ్మ ఉంటారు ఇంతలో కావ్య కళ్లు తిరిగి కిందపడబోతుంటే స్వప్న చూస్తుంది.

స్వప్న: కావ్యా  కావ్యా  ఏమైందే..ఎందుకంత నీరసంగా కనిపిస్తున్నావు.

కావ్య: ఎందుకో తెలియదు అక్క మూడు రోజుల నుంచి అలాగే ఉంది.

బామ్మ: ఎందుకుండదు చెప్పు పెళ్లి పనులు మొదలు పెట్టినప్పటి నుంచి క్షణం ఖాలీ లేకుండా పనలు చేస్తూనే ఉన్నావు. రెస్ట్‌ తీసుకుంటేనే కదా నీరసం తగ్గడానికి

స్వప్న: మూడు రోజులుగా ఇలా ఉందంటే హాస్పిటల్‌కు వెళ్లడం మంచిది అనిపిస్తుంది అమ్మమ్మ.

అంటూ స్వప్న చెబుతూనే రాజ్‌ కు కాల్‌ చేయ్‌ వచ్చి హాస్పిటల్‌కు తీసుకెళ్తాడని ఫోన్‌ తీసి కావ్యకు ఇస్తుంది. మరోవైపు రాజ్‌,  శ్వేత ఇంట్లోకి వెళ్తాడు ఇంతలో కావ్య ఫోన్‌ చేస్తుంది. నేను బిజీగా ఉన్నాను అంటూ రాజ్‌ ఫోన్‌ కట్‌ చేస్తాడు. దీంతో స్వప్న నేను వస్తాను వెళ్దాం పద హాస్పిటల్‌కు అంటూ ఇద్దరు కలిసి వెళ్తారు. మరోవైపు రూంలో  రక్తం కారుతూ పడిపోయిన శ్వేతను హాస్పిటల్‌కు తీసుకెళ్తుంటాడు రాజ్‌.  మరోవైపు కావ్య, స్వప్న డాక్టర్‌ రూంలో కూర్చుని ఉంటారు. డాక్టర్‌ కావ్యను చెక్‌ చేసి..

డాక్టర్‌: బ్లడ్‌ టెస్ట్‌ రిపోర్ట్స్‌ కూడా  వచ్చాక ఒకేసారి మెడిసిన్స్‌  రాస్తాను.

స్వప్న: అసలు ప్రాబ్లమ్‌ ఎంటి డాక్టర్‌.

డాక్టర్‌: పేషెంటే చెప్పాలి. ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్‌ను చూస్తే బీపీ డౌన్‌ అవ్వడం తప్పా వేరే కాంప్లికేషన్స్‌ కనిపించడం లేదు.

అనగానే ఇంట్లో తనకు ఎప్పుడు రెస్ట్‌ ఉందడని.. మందను మేపడానికే టైం అయిపోతుందని పైనుంచి అత్తింటి ఆరళ్లు ఎక్కువయ్యాయని స్వప్న చెప్తుంది. దీంతో డాక్టర్‌ మీకు  ఒత్తిడి, నిద్రలేమి వల్ల ఇలా జరిగి ఉండొచ్చని మీ అక్క మాటలను బట్టి తెలుస్తుంది అంటూ మీరు బయట వెయిట్‌ చేయండి నేను రిపోర్ట్స్‌ వచ్చాక పిలుస్తాను అంటుంది. కావ్య, స్వప్న బయటకు వెళ్లబోతుంటే రాజ్‌, శ్వేతను తన చేతులతో ఎత్తుకుని హాస్పిటల్‌లోకి రావడం కావ్య చూస్తుంది. దీంతో కావ్య గుండెలు బద్దలవుతాయి. కావ్య మరోసారి తూలిపడబోతుంటే స్వప్న పట్టుకుంటుంది.    మరోవైపు శ్వేతను రూంలో అడ్మిట్‌ చేస్తారు. అసలు ఏం జరిగిందని రాజ్‌ శ్వేతను అడుగుతాడు. ఇంతలో కావ్య, శ్వేత రూం దగ్గరకు వెళ్లబోతుంటే డోర్‌ దగ్గర నిలబడ్డ సిస్టర్‌ రాజ్‌, శ్వేత గురించి మాట్లాడుకుంటుంటే కావ్య వింటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ : కాంగ్రెస్‌లో చేరాక షర్మిల యాస, భాష మారింది- ఏపీకి ఎందుకొచ్చారు?: సజ్జల కీలక వ్యాఖ్యలు

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Naga Chaitanya Sobhita Marriage: అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
Naga Chaitanya Sobhita Wedding : శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ
శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ
CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
TTD News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Naga Chaitanya Sobhita dhulipala wedding Photos | వివాహ బంధంతో ఒక్కటైన నాగచైతన్య శోభితా | ABP DesamAllu Arjun Sandhya Theatre Pushpa 2 | పుష్ప 2 ప్రీమియర్ కోసం సంధ్యా థియేటర్ కు బన్నీ | ABP DesamShinde Suspense in Maharastra | మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవిస్ ఖరారు..కానీ | ABP Desamగోల్డెన్ టెంపుల్‌లో కాల్పుల కలకలం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Naga Chaitanya Sobhita Marriage: అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
Naga Chaitanya Sobhita Wedding : శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ
శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ
CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
TTD News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
Maharashtra CM Devendra Fadnavis: మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
Naga Chaitanya Sobhita Wedding Pic : నాగచైతన్య, శోభిత పెళ్లి ఫోటోలు ఇవే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పర్సనల్ పిక్స్
నాగచైతన్య, శోభిత పెళ్లి ఫోటోలు ఇవే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పర్సనల్ పిక్స్
Best Selling Smartphones: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 10 ఫోన్లు - నంబర్ వన్‌‌లో ఏ ఫోన్ ఉంది?
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 10 ఫోన్లు - నంబర్ వన్‌‌లో ఏ ఫోన్ ఉంది?
Pushpa 2 The Rule: ‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
Embed widget