అన్వేషించండి

Brahmamudi Serial Today January 11Th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : కావ్యను వెనకేసుకొచ్చిన అపర్ణ – అప్పుకు యాక్సిడెంట్ అవ్వడంతో ఇంట్లోంచి చెప్పకుండా వెళ్లిపోయిన కావ్య

Brahmamudi Today Episode: వ్రతానికి రెడీ అవుతున్న కావ్యకు కనకం ఫోన్ చేసి అప్పుకు యాక్సిడెంట్ అయ్యిందని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది.

Brahmamudi Serial Today Episode: తన చీర కుచ్చిళ్లు మడత పెట్టడానికి రుద్రాణిని పిలిచానని స్వప్న చెప్పడంతో.. రాహుల్‌, రుద్రాణి షాక్‌ అవుతారు. నేను నీ కాళ్ల దగ్గర కూర్చుని కుచ్చిళ్లు పెట్టాలా అంటూ కోపంగా రుద్రాణి ప్రశ్నిస్తుంది.  కాళ్ళ దగ్గర కాకపోతే చేతుల దగ్గర కూర్చుంటారా ఎవరైనా అంటూ వార్నింగ్‌ ఇచ్చినట్లు చెప్తుంది స్వప్న. దీంతో రుద్రాణి కోపంగా రాహుల్‌ వైపు చూడగానే ఎదో ఫోన్‌ వచ్చినట్లు రాహుల్‌ బయటకు వెళ్లిపోతాడు. రుద్రాణి.. స్వప్నను వెంటబడి కొట్టినట్లు కలగంటుంది. స్వప్న చిటికె వేసి రుద్రాణిని ఊహల్లో తనను కొట్టింది చాలు ముందు కుచ్చిళ్లు కట్టు అంటుంది. షాకైన రుద్రాణి, స్వప్న కాళ్ల దగ్గర కూర్చుని కుచ్చిళ్లు కట్టి బయటకు వెళ్లి రాహుల్‌ను తిడుతుంది. కింద వ్రతానికి అంతా సిద్దంగా ఉందని మూడు జంటలను వచ్చి కూర్చోమని పంతులు చెప్తారు. దీంతో బామ్మ అందరిని పిలుస్తుంది. కళ్యాణ్‌, అనామిక, స్వప్న, రాహుల్‌  రెడీ అయ్యి కిందకు వస్తారు. రాజ్‌, కావ్య మాత్రం రారు. కావ్య వచ్చి రాజ్‌ త్వరగా రెడీ అవ్వండి అని చెప్తుంది. రాజ్‌ అయిపోయింది పద అంటాడు. ఇంతలో కనకం కావ్యకు ఫోన్‌ చేసి అప్పుకు యాక్సిడెంట్‌ అయ్యిందని ఏడుస్తూ చెప్తుంది. డాక్టర్లు లోపలికి తీసుకెళ్లారని అప్పు స్పృహలో లేదని మీ నాన్నగారు కూలబడిపోయారు అంటూ చెప్తుంది. కావ్య హాస్పిటల్ పేరు కనుక్కుని అలాగే నిలబడి ఉంటుంది.

రాజ్‌: ఏయ్‌ ఇంకా ఏం ఆలోచిస్తున్నావు. పద వెళ్దాం.

కావ్య: వెళ్దాం కాదు నేను మాత్రమే వెళ్తాను.

రాజ్‌: నీకేమైనా పిచ్చా.. అప్పుకు యాక్సిడెంట్‌ అయ్యిందంటే ఒక్కదానివే వెళ్తానంటావేంటి?

కావ్య: అది కాదండి కింద అందరూ మనకోసం ఎదురుచూస్తున్నారు. అమ్మమ్మగారు మూడు జంటలు వ్రతం చేయాలి అన్నారు.

రాజ్‌: ఇప్పుడవన్నీ ఎందుకు?

కావ్య: కింద అందరూ సంతోషంగా ఉంటే.. అప్పుకు ఇలా అయ్యిందని తెలిస్తే పూజ ఆపేస్తారు. అనామిక చాలా ఫీలవుతుంది. నేను ఎవ్వరికీ చెప్పకుండా వెనక నుంచి వెళ్లిపోతాను. మీరు కిందకు వెళ్లి ఏదో ఒకటి చెప్పి వాళ్ల చేత వ్రతం జరిపించండి.

  అంటూ కావ్య వెనక నుంచి వెళ్లిపోతుంది. ఇప్పుడు కింద వాళ్లకు ఏం చెప్పాలి అంటూ రాజ్‌ ఆలోచిస్తాడు. కింద వాళ్లు రాజ్‌, కావ్య ఇంకా రాలేదేంటి అని అనుకుంటుండగానే రాజ్‌ ఒక్కడే కిందకు వస్తాడు.  అందరూ షాక్‌ అవుతారు. కావ్య ఎక్కడని అడుగుతారు. కావ్య బయటకు వెళ్లిందని రాజ్‌ చెప్పడంతో మరోసారి అందరూ షాక్‌ అవుతారు. ఎందుకు వెళ్లిందని, ఈ టైంలో వెళ్లడం ఏంటని, వ్రతంలో కూర్చోవడం ఇష్టం లేకనే వెళ్లిందని తలో మాట అంటారు. ఇంతలో ఆమె రాకపోయినా పర్వాలేదు మీరు పూజ స్టార్ట్‌ చేయండని ధాన్యలక్ష్మీ చెప్పడంతో అపర్ణ ఫీలవుతుంది. ఎంతైనా అది ( కావ్య) నా కోడలు. నా కొడుకు వ్రతంలో కూర్చోకుండా పూజ చేయమంటావేంటి? అంటూ ధాన్యలక్ష్మీ మీద ఫైర్‌ అవుతుంది అపర్ణ. కళ్యాణ్‌ కూడా వదిన లేకుండా పూజ చేయడం ఏంటని వదిన వచ్చేవరకు వెయిట్‌ చేస్తామని చెప్తాడు. దీంతో రుద్రాణి ఫీలవుతుంది.  

రుద్రాణి: సరిపోయింది. అన్నదమ్ములు రామలక్ష్మణులు అయినా వచ్చిన వాళ్లు కరెక్టుగా ఉండాలిగా..

స్వప్న: మీకు ఓపిక లేకపోతే వెళ్లి మరోసారి మేకప్‌ వేసుకుని రండి. అందరూ వెయిట్‌ చేస్తామంటే మీరేదో మునిగిపోయినట్లు మాట్లాడతారేంటి?

ధాన్యలక్ష్మీ: అంతా నా కర్మ నేనేం మాట్లాడినా తప్పై పోతుంది. నాకెందుకు ఓ మూలన కూర్చుంటాను.

  అనడంతో ధాన్యలక్ష్మీ భర్త ఈశాన్యం మూలవైపు కూర్చోమాకు ఎందుకంటే అక్కడ బరువు ఉండకూడదు అంటూ వెటకారంగా చెప్తాడు. ఇప్పుడెలా అప్పుకు యాక్సిడెంట్‌ అయ్యిందని ఎవ్వరికీ చెప్పొదంది కావ్య.. ఇక్కడేమో ఇలా అంటూ మనసులో అనుకుంటాడు రాజ్. మరోవైపు కావ్య హాస్పిటల్‌కు వస్తుంది. కనకం, మూర్తిలను ఓదారుస్తుంది.  ఇంతలో డాక్టర్‌ వచ్చి అర్జంట్‌గా బ్లడ్‌ కావాలని అది రేర్‌ గ్రూప్‌ అని త్వరగా తీసుకురావాలని లేదంటే చాలా ప్రమాదం అని చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు  కావ్య కోసం ఇంట్లో అందరూ ఎదురుచూస్తుంటారు. ఇంతలో అనామిక లేచి వెళ్లిపోతుంటే.. అందరూ కూర్చోమని చెప్తారు. కావ్య ఇవాళ రాదని, తనకు వ్రతం జరగడం ఇష్టం లేదని  నాకు అర్థం అయ్యిందని అనామిక చెప్తుంది. కావ్య కోరుకున్నట్లే వ్రతం ఆపేద్దాం అంటుంది. అనామికను కళ్యాణ్‌ తిడతాడు. దీంతో ఇవాళ్టి ఏపిసోడ్‌ అయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Jagadatri Serial Today october 22: మురళిని పట్టుకుని దివ్యాంకకు  బుద్ధి చెప్పిన జగధాత్రి..కేదార్‌ గురించి పార్టీలో కమలాకర్ చెప్పకుండా అడ్డుపడిన యువరాజు
జగధాత్రి : మురళిని పట్టుకుని దివ్యాంకకు  బుద్ధి చెప్పిన జగధాత్రి..కేదార్‌ గురించి పార్టీలో కమలాకర్ చెప్పకుండా అడ్డుపడిన యువరాజు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 22nd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: భక్తవత్సలంలో మార్పు! తండ్రిని చంపడానికి సుభాష్‌ని రప్పించిన అంబిక!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: భక్తవత్సలంలో మార్పు! తండ్రిని చంపడానికి సుభాష్‌ని రప్పించిన అంబిక!
Godavari Serial Today October 22nd: 'గోదావరి' సీరియల్: సూర్య, జానుల లవ్‌ వీడియో వేసి పరువు తీసేసిన సింహాద్రి! జానుకి అండగా సంజయ్!
'గోదావరి' సీరియల్: సూర్య, జానుల లవ్‌ వీడియో వేసి పరువు తీసేసిన సింహాద్రి! జానుకి అండగా సంజయ్!
Nindu Manasulu Serial Today October 22nd: నిండు మనసులు: ప్రేరణకు నిజం చెప్పిన గణ! పశ్చాత్తాపంతో కులిమిపోయిన ప్రేరణ! సిద్ధూ క్షమిస్తాడా!
నిండు మనసులు: ప్రేరణకు నిజం చెప్పిన గణ! పశ్చాత్తాపంతో కులిమిపోయిన ప్రేరణ! సిద్ధూ క్షమిస్తాడా!

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Elections: ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
AP Odisha Cyclone Alert: తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
Vijayashanti : రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
Teja Sajja : US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
IND VS NZ Result Update: :  టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
Pawan Kalyan Chandrababu Naidu Meeting : నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Embed widget