అన్వేషించండి

Brahmamudi Serial Today February 22nd promo: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: బావతో కలిసి ఇంటికొచ్చిన కావ్య - బావను ఇంట్లోనే ఉండమన్న స్వప్న, ఇరకాటంలో రాజ్‌

Brahmamudi Today Episode: ఇంటికొచ్చిన తమ బావను హోటల్ ఉండకుండా తమ ఇంట్లోనే ఉండమని స్వప్న చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఇంట్రస్టింగ్ జరిగింది.

Brahmamudi Serial Today Episode:  కావ్య తన బావతో కలిసి బయట తిరగడానికి వెళ్లిందని ఆఫీసు పనుల గాలికొదిలేసి షికార్లకు వెళ్లిందని ఇంట్లో వాళ్లకు చెప్పి కావ్యకు విడాకులు ఇవ్వొచ్చని రాజ్, శ్వేతతో చెప్పి ఇంటికి వస్తాడు. గార్డెన్లో కూర్చున్న ఇందిరాదేవిని చూసి ఆమె దగ్గరకు చాలా స్పీడుగా వెళ్తాడు. అప్పటికే అంత తెలిసిన ఇందిరాదేవి.. రాజ్ ను చూసి లోపల ప్రేమ ఉన్నా పైకి మాత్రం ఎంత బాగా నటిస్తున్నాడో నా మనమడు అనుకుంటుంది. ఇంతలో ఇందిదాదేవి దగ్గరకు వచ్చిన రాజ్, కోపంగా కావ్యను తిడుతూ.. కావ్య తన బావతో బయటకు వెళ్లిందని చెప్తాడు. నీ మనమరాలు అమాయకురాలు అంటూ వెనకేసుకొస్తావు ఇప్పుడు చూడు ఎంతకు తెగించిందో అంటాడు. 

మనసులో ఎంత ప్రేమ ఉన్నా బయటకు మాత్రం బాగా నటిస్తున్నావురా? మనవడా.. అని మనసులో అనుకుంటూ బయటకు మాత్రం ఏమీ ఎరగనట్లు నటిస్తుంది ఇందిరాదేవి. రాజ్ కోపంగా చెప్తూనే ఉంటే ఇక అయిపోయిదా? చాడీలు చెప్పటం అని అంటుంది. నేను చాడీలు చెప్తున్నానా? కావాలిస్తే ఆఫీసుకు ఫోన్ చేసి కనుక్కో బామ్మా అంటూ రాజ్ అసహనం వ్యక్తం చేయడంతో నేను కనుక్కోవాల్సిన అవసరం ఏమీ లేదు. కావ్య తన బావను తీసుకుని మన ఇంటికే వచ్చింది. అని చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. రాజ్ కు  నోట్లోంచి మాటలు రావు. నత్తి వచ్చినవాడిలా మాట్లాడతాడు. అంత కంగారు ఎందుకు రాజ్, కావ్య ఇంట్లోనే ఉంది. అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. నువ్వు కూడా పద వెళ్లి మనం భోజనం చేద్దాం అని రాజ్ ను తీసుకుని ఇందిరాదేవి ఇంట్లోకి వెళ్తుంది. 

రాజ్, బామ్మతో కలిసి ఇంట్లోకి వెళ్లగానే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తుంటారు. స్వప్న, కావ్య ఇద్దరూ తమ బావకు ప్రేమగా కొసిరి కొసిరి వడ్డిస్తుంటారు. ఇంతలో స్వప్న వాళ్ల బావను ఫారిన్ గురించి అడుగుతుంది. అక్కడ లైఫ్ ఎలా ఉందని అడుగుతుంది. దీంతో వాళ్ల బావ ఫారిన్ లైఫ్ ఎంతో ఎంజాయ్ గా  ఉంటుందని.. అక్కడి విశేషాలు చెప్తుంటాడు. అలాగే రుద్రాణి, రాహుల్ ను వెటకారంగా వాళ్ల బావకు పరియచం చేస్తుంది స్వప్న. రుద్రాణి, రాహుల్ కోపంగా చూస్తుంటారు.

అయితే లోపలికి రాజ్, బామ్మ రావడం గమనించిన కావ్య.. వాళ్ల బావకు సైగ చేస్తుంది. దీంతో మరోసారి కావ్య, వాళ్ల బావ తమ నాటకాన్ని మొదలుపెడతారు. అది చూసిన రాజ్ ఇరిటేట్ అవుతుంటాడు. ఇందిరాదేవి మాత్రం లోపల లోపల నవ్వుకుంటుంది. ఇంతలో కావ్య రాజ్, ఇందిరాదేవిని కూడా భోజనం చేయమని పిలుస్తుంది. రాజ్ భోజనం చేయడానికి కూర్చోగానే స్వప్న అదేంటి రాజ్ ఎప్పుడూ లేనిది ఇవాళ లంచ్ చేయడానికి ఇంటికి వచ్చావు అని అడుగుతుంది. దీంతో షాక్ తిన్న రాజ్ ఎం చెప్పాలో అర్థం కాక అలాగే చూస్తుండిపోతాడు.

ఇంతలో కావ్య మన బావ వచ్చారని కంపెనీ ఇవ్వడానికి వచ్చారనుకుంటా అంటుంది. కంపెనీ అంటే గుర్తుకొచ్చింది అంటూ బావ నువ్వు ఫారిన్ నుంచి వచ్చావు కదా ఎక్కడ ఉంటావు అని అడుగుతుంది. తాను హోటల్లో ఉంటున్నట్లు వాళ్ల బావ చెప్పగానే.. ఇంత ఇల్లు ఉండగా నువ్వు హోటల్ లో ఉండాల్సిన కర్మ నీకెందుకు బావ నువ్వు లగేజీ తీసుకునిరా ఇక్కడే ఉందువు అంటుంది స్వప్న. దీంతో కావ్య, ఇందిరాదేవి కూడా వాళ్ల బావను ఇంట్లోనే ఉండమని చెప్తారు. రాజ్ మాత్రం ఇరిటేటింగ్ గా చూస్తుంటాడు. రాజ్ ను గమనించిన కావ్య వాళ్ల బావ నేను ఇంట్లో ఉండటం మీ ఆయనకు ఇష్టం లేనట్లుంది అంటాడు. దీంతో రాజ్ ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే చూస్తుండిపోతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.

Also Read: నేను చనిపోయానని అనుకున్నారు, అంతా మా నాన్న వల్లే: ‘మన్మథుడు’ నటి అన్షు

టాప్ హెడ్ లైన్స్

Brahmamudi Serial Today July 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్: లక్కీ, మదన్ మధ్య గొడవ – శశికి పడిపోయిన ఐషు
‘బ్రహ్మముడి’ సీరియల్: లక్కీ, మదన్ మధ్య గొడవ – శశికి పడిపోయిన ఐషు
Nuvvu leka Neanu Lenu Serial Today July 28th:హాల్‌లో చాపమీద పడుకున్న విక్కీ....తిట్టి రాధ గదిలోకి పంపించిన సునంద
నువ్వులేక నేను లేను: హాల్‌లో చాపమీద పడుకున్న విక్కీ....తిట్టి రాధ గదిలోకి పంపించిన సునంద
Illu Illalu Pillalu Serial Today July 28th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమ సీక్రెట్‌ అందరి ముందు బట్టబయలు! ఒక్క చెంప దెబ్బతో ట్విస్ట్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమ సీక్రెట్‌ అందరి ముందు బట్టబయలు! ఒక్క చెంప దెబ్బతో ట్విస్ట్!
Gundeninda Gudigantalu July28th Episode: రోహిణిపై అనుమానంతో అత్తింటికి వచ్చిన మనోజ్‌...అక్కడ ఏం చూశాడు...?.
గుండెనిండా గుడిగంటలు: రోహిణిపై అనుమానంతో అత్తింటికి వచ్చిన మనోజ్‌...అక్కడ ఏం చూశాడు...?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Embed widget