అన్వేషించండి

Brahmamudi Serial Today February 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : రాజ్‌ ఆఫీసులోకి కావ్య బావ ఎంట్రీ - ఇరిటేట్‌ అయిన రాజ్‌

Brahmamudi Today Episode: కావ్య తన బావతో కలిసి ఆఫీసులోకి రావడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: నేను తలుచుకుంటే ఇప్పటికైనా కళ్యాణ్‌ను పెళ్లి చేసుకోగలను అంటూ అప్పు గట్టిగా అనామికకు వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో అనామిక షాక్‌ అవుతుంది. కారులో కూర్చున్న కళ్యాణ్‌, అనామికను పిలుస్తాడు అనామిక వెళ్లడంతో ఇద్దరూ కారులో వెళ్లిపోతారు. అప్పు కూడా వెళ్లిపోతుంది. మరోవైపు రాజ్‌ ఆఫీసులో  కావ్య చాంబర్‌ దగ్గరకు వచ్చి చూస్తాడు. కావ్య అక్కడ కనిపించకపోవడంతో కోపంగా శ్వేతతో...

రాజ్‌: చూశావా? చూశావా?

శ్వేత: ఏంటి?

రాజ్‌: తను ఇంకా రాలేదు.

శ్వేత: తనతో నీకు ఇప్పుడేమైనా ఆర్జెంట్‌ పని ఉందా?

రాజ్‌: ఏయ్‌ తనతో నాకేం పని ఉంటుంది.

శ్వేత: మరి ఎందుకు ఎదురుచూస్తున్నావు.

రాజ్‌: ఇప్పుడు టైం ఎంత అయ్యింది. పొద్దున్న తొమ్మిదింటికి వెళ్లింది. ఫ్లైట్‌ పదింటికి ఇప్పుడు పదకొండున్నర అయ్యింది. అంటే ఇంతసేపు ఏం చేస్తున్నట్లు..

అంటూ రాజ్‌ ఇరిటేటింగ్‌గా మాట్లాడతాడు. ఇంతలో కారు సౌండ్‌ విని కారు వచ్చినట్లు ఉంది అని బయటకు పరుగెడతాడు రాజ్‌. బయట కారు వచ్చి ఆగుతుంది.  కారులోంచి కావ్య, వాళ్ల బావ దిగి నడుచుకుంటూ వస్తుంటారు.

శ్వేత: జంట చూడముచ్చటగా ఉంది కదా?

రాజ్‌: అప్పలమ్మకు బావ అంటే చిప్ప ముఖం వేసుకుని చీదరగా ఉంటాడనుకున్నాను. వీడేంటి హండ్సమ్‌ గా ఉండి చచ్చాడు.

శ్వేత: ఎంటీ జెలసా?

రాజ్‌: ఎయ్‌ చీచీ ఏం లేదు. నాకు జెలసీ ఎంటి?

అనగానే ఇంతలో కావ్య వాళ్ల బావను తీసుకుని లోపలికి వచ్చి అందరినీ పరిచయం చేస్తుంది. రాజ్‌ను పరిచయం చేయగానే రాజ్‌ జెలసీగా  ఫీలవుతాడు. దీంతో అదేంటి బుజ్జి నేను రావడం మీ ఆయనకు ఇష్టం లేనట్టుంది అని కావ్యను వాళ్ల బావ అడగుతాడు.

రాజ్‌: అబ్బే అదేం లేదు నాది బ్రాడ్‌ మైండ్‌ అబ్రాడ్‌లో  చదువుకుని వచ్చాను కదా?

కావ్య బావ: ఏది ఏమైనా మీరు చాలా లక్కీ అన్నయ్య

రాజ్‌: ఎందుకు నీలాంటి తమ్ముడు పుట్టుకొచ్చినందుకా?

అనగానే కాదు అన్నయ్యా బుట్టబొమ్మ లాంటి మా బుజ్జిని పెళ్లి చేసుకున్నందుకు అని చెప్పగానే రాజ్‌ షాక్‌ అవుతాడు. కావ్య వాళ్ల బావ క్లోజ్‌ గా ఉండటం చూసిన రాజ్‌ తన ఇరిటేషన్‌ మొత్తం స్టాఫ్‌ మీద చూపిస్తాడు. ఇంతలో కావ్య వాళ్ల బావను తీసుకుని తన క్యాబిన్‌లోకి వెళ్తుంది. రాజ్‌ కూడా శ్వేతను తీసుకుని తన క్యాబిన్‌లోకి వెళ్తాడు.

కావ్య బావ: ఎంటి కావ్య నీ ఆలోచన వర్కవుట్‌ అవుతుందంటావా? మనం వెళ్లే పద్దతి సరైనదేనా?

కావ్య: బావ నా ఆలోచన కరెక్టే.. నా పద్దతి కరెక్టే.. చూశావుగా బావ నీతో నేను చనువుగా ఉంటే ఎలా మండిపోతున్నాడో.. అది మనకు పనికొచ్చే విషయం. మన పని మరింత సులువు చేసే విషయం.

కావ్య బావ: కానీ దీనివల్ల నీకు చెడ్డపేరు వస్తుందేమోనని భయంగా ఉంది కావ్య.

కావ్య: అదంతా నేను చూసుకుంటాను నువ్వేం భయపడకు బావ.

అనగానే మీ ఆయన చూడటానికి బాగానే ఉన్నారు కానీ నిన్ను ఎందుకు వదిలించుకోవాలనుకుంటున్నాడో అర్థం కావడం లేదని వాళ్ల బావ అడగ్గానే ఆయనకు తిక్క అందుకే ఇలా చేస్తున్నారు అని కావ్య చెప్తుంది. మరోవైపు బయట కావ్య చాంబర్‌ దగ్గర నిలబడి దొంగచాటుగా వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో వింటుంటాడు రాజ్‌. ఇంతలో శృతి వచ్చి పిలుస్తుంది. రాజ్‌ దొంగచాటుగా వినటాన్ని కావ్య గమనించి వాళ్ల బావకు చెప్తుంది. దీంతో ఇద్దరు తమ నాటకాన్ని మరింత పెంచుతారు. ఇంతలో కావ్య వెళ్లి డోర్‌ ఓపెన్‌ చేస్తుంది. రాజ్‌ కింద పడబోతుంటే కావ్య పట్టుకుంటుంది. శ్వేత వచ్చి చూస్తుంది. రాజ్‌ గిల్టీగా ఫీలవుతూ తన చాంబర్‌లోకి వెళ్తాడు. తర్వాత రాజ్ కేక్‌ తెప్పించి కట్‌ చేయబోతుంటే కేక్‌ ఇప్పుడెందుక కట్‌ చేస్తున్నారు సార్‌ అని శృతి అడుగుతుంది.

రాజ్‌: శ్వేతకు తన భర్త నుంచి విడాకులు వచ్చాయి. ఈరోజు నుంచి నా ఫ్రెండ్‌ శ్వేతకు పూర్తి స్వేచ్చ వచ్చింది.

కావ్య: ఇప్పుడు ఇక్కడ అందరూ చప్పట్లు కొట్టాలా? సంతోషంతో.. విచారణతో మౌనం పాటించాలా? మాకేమీ అర్థం కావడం లేదు.

రాజ్‌: ఇది నేను బాగా సంతోషించే విషయం. శ్వేతకు ఎప్పుడు విడాకులు వస్తాయా? అని నేను వెయ్యి కళ్లతో ఎదురుచూశాను.  

అనగానే కావ్య ఎవరి జీవితాలను వాళ్లు ఎవరి సంతోషాలను వాళ్లు చూసుకోవడంలో తప్పు లేదు అనగానే వాళ్ల బావ బుజ్జి ఈ అభ్యుదయ భావాలు ఇంకా నీలోన ఉన్నాయి అంటే చాలా గ్రేట్‌ ఇంత విశాలంగా ఆలోచిస్తున్నావు అంటే నీది ఎంత గొప్ప మనసు బుజ్జి అనగానే రాజ్‌ షాక్‌ అవుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Also Read: పద్మవిభూషణుడికి అమెరికాలో 'మెగా' సత్కారం!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 25th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: నష్ట జాతకుడిని ఇంట్లోకి రానివ్వొద్దు..! విహారి నిర్ణయం ఏంటి?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: నష్ట జాతకుడిని ఇంట్లోకి రానివ్వొద్దు..! విహారి నిర్ణయం ఏంటి?
Godavari Serial Today July 25th: 'గోదావరి' సీరియల్: మా నాన్నని నువ్వే చంపేశావ్.. సింహాద్రిని నిలదీసిన జాను.. ఆధారం కాల్చేసిన భువన!
'గోదావరి' సీరియల్: మా నాన్నని నువ్వే చంపేశావ్.. సింహాద్రిని నిలదీసిన జాను.. ఆధారం కాల్చేసిన భువన!
Nindu Manasulu Serial Today July 25th: నిండు మనసులు: కేఫ్‌లో ప్రేరణతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే కొడుకు! చెంప పగలగొట్టిన ప్రేరణ! సిద్ధూకి తెలుస్తుందా!
నిండు మనసులు: కేఫ్‌లో ప్రేరణతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే కొడుకు! చెంప పగలగొట్టిన ప్రేరణ! సిద్ధూకి తెలుస్తుందా!
Karthika Deepam 2 Serial Today July 25th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న మాలినిని కలిసిందని ఇంట్లో తెలిసిపోయిందా! పారు, జ్యోత్స్నని సూరజ్ నిలదీయడానికి కారణమేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న మాలినిని కలిసిందని ఇంట్లో తెలిసిపోయిందా! పారు, జ్యోత్స్నని సూరజ్ నిలదీయడానికి కారణమేంటి?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Chennai Love Story : హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
Income Tax Notice: చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
CJP GenZ Protest Success Story: కాక్రోచ్‌ల తొలి పోరాటమే సూపర్‌హిట్ - రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది సాధించిన జెన్జీలు !
కాక్రోచ్‌ల తొలి పోరాటమే సూపర్‌హిట్ - రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది సాధించిన జెన్జీలు !
Embed widget