అన్వేషించండి

Brahmamudi October 30th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రుద్రాణికి నిజం తెలుస్తుందా? కావ్యాను వెనకేసుకొచ్చిన రాజ్

‘బ్రహ్మముడి’ సీరియల్ లో స్వప్న గర్బిణీ కాదన్న విషయం రుద్రాణికి తెలుస్తుంది. దీంతో సీరియల్ లో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠకు తెరలేసింది.

నీ కోడలు గుడికి వెళ్లమని చెప్పినా వెళ్లలేదని అంటుంద రుద్రాణి అంటుంది. నాకు అబద్దాలు చెప్పడం రాదని మీరు నాకు చెప్పలేదని కావ్య అంటుంది. వదిన నీ కోడలుకు పెద్దంతరం చిన్నంతరం లేదని వాదిస్తుంది. దీంతో రాజ్‌ కలిపించుకుని అత్త ఆగు అంటాడు. ఇంతలో రుద్రాణి ఏంటి రాజ్‌ నీ పెళ్లాన్ని అనగానే నీకు కోపం వచ్చిందా? అంటుంది.

రాజ్‌: కాదు నిజం మాట్లాడాలనిపించింది. మీరు కళావతికి చెప్పారో లేదో నాకు తెలియదు.. కానీ తనకి మాత్రం అబద్దం చెప్పే అలవాటు  లేదు.

రుద్రాణి: అంటే నాకు అలవాటు ఉందంటున్నావా? నువ్వు నేను చెప్పినప్పుడు లేవు అలాంటప్పుడు అంత కచ్చితంగా ఎలా చెప్తున్నావురా..?

రాజ్‌: కళావతి గురించి నాకు తెలుసు.. తాను ఎప్పుడూ తప్పు చేయదు.. అందుకే ఎవ్వరికీ భయపడదు.. అలాంటప్పుడు అబద్దం చెప్పాల్సిన అవసరం లేదు కదా..? మళ్లీ నేను సపోర్ట్‌ చేస్తున్నాని అనకండి.. జస్ట్‌ తనేంటో చెప్తున్నాను అంతే..

అంటూ రాజ్‌ పైకి వెళ్లిపోతాడు. రుద్రాణి అపర్ణకి నీ కొడుకుతో జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. స్వప్న బెడ్‌ రూంలో చిరాకుగా చీరను కింద పడేస్తుంది. రుద్రాణి స్వప్న రూంలోకి వచ్చి నీకు రెడీ కావడం రాకపోతే నా రూంలో నిన్ను రెడీ చేయడానికి కొందరు రెడీ ఉన్నారు అక్కడికి వెళ్లు నిన్ను రెడీ చేస్తారని చెప్తుంది.

స్వప్న: మీరిలా మాట్లాడుతుంటే నాకు సంతోషంగా ఉంది. నేను వెళ్లి రెడీ అవుతాను..

రుద్రాణి: త్వరగా వెళ్లు రెడీ అవ్వు అంటుంది.

స్వప్న వెళ్లాక రూంలో ప్రెగ్నెసీ రిపోర్ట్‌ తీసుకుని ఫొటోలు తీసుకుంటుంది రుద్రాణి.. స్వప్న తిరిగి రూంలోకి వస్తుంది. ఏంటి అత్తయ్యా ఇంకా ఇక్కడే ఉన్నారు అని అడుతుంది. ఏం లేదు అని వెళ్లిపోతుంది రుద్రాణి.

సీమంతం ఏర్పాట్లు జరుగుతుంటే చుట్టాలు వస్తుంటారు. చుట్టాల్లో ఒకరు అప్పుని చూసి అబ్బాయి అనుకుని ఆట పట్టిస్తుంది. దీంతో కుటుంబ సభ్యులందరూ.. అప్పును కూడా అమ్మాయిలా తయారవ్వమని చెప్తారు. దీంతో అప్పు చీర కట్టుకట్టుకోవడానికి వెళ్తుంది.

రుద్రాణి: శ్రీదేవి మా స్వప్న రిపోర్ట్స్‌ నీకు పెట్టాను చూడు..వాటిని చూసి నిజంగా కడుపు ఉందో లేదో చూసి చెప్పు..

డాక్టర్‌: సరే కొంచెం టైం ఇవ్వు..

రుద్రాణి: నా దగ్గర లేనిదే అది త్వరగా కనుక్కుని చెప్పు..

డాక్టర్‌: చూడు నీవు ఇలా తొందర పెడితే నాకు రాంగ్‌ రిజల్ట్ చెబితే మొత్తానికే నువ్వు ఇరుక్కుంటావు అలా చేయమంటావా?

రుద్రాణి : అంత కోపం ఎందుకులే కానీ కాస్త త్వరగా చూసి పెట్టు..

పంక్షన్‌లో అందరు బిజిగా ఉంటే రాహుల్‌ ఫోన్‌ లో గేమ్‌ ఆడుతూ ఉంటాడు అది చూసిన..

రాజ్‌ : ఏరా సగం తండ్రి.. అందరూ బిజిగా ఉంటే నువ్వు గేమ్‌ ఆడుతూ కూర్చున్నావేంట్రా రాస్కెల్‌ ఈ ఘనకార్యం నీదేరా.. ఈ శుభకార్యం కూడా నీదే..

అంటుండగా అప్పు చీర కట్టుకుని వస్తుంది. కుటుంబ సభ్యులందరూ అప్పు చీరకట్టులో బాగాలేదని ఆటపట్టిస్తుంటారు.

రుద్రాణి: చీర కట్టడం ఒక ఆర్ట్. రేపు తన పెళ్లిలో కూడా ఈ అమ్మాయి ప్యాంట్‌ షర్ట్‌ వేసుకుంటుందేమో..

కావ్య: కవిగారు ఇక ఏడిపించింది చాలు.. నన్ను మా అక్కను ఏ మగపిల్లలు ఏడిపించకుండా ఉండటానికే మా అప్పు బ్రదర్‌ లా పెరిగింది. అందుకే ప్యాంట్‌ షర్టులు అలవాటయ్యాయి. చక్కగా జడ వేసి చీర కడితే చాలా బాగా కనిపిస్తుంది.

బామ్మ: కావ్య, రాజ్‌ మీరింకా ఇలాగే ఉంటారా? కార్యక్రమం అయిపోయాక రెడీ అవుతారా? వెళ్లి కొత్త బట్టలు వేసుకుని రండి

కావ్య రాజ్‌ పైకి వెళ్తారు. కనకం స్వప్న రూంలోకి వచ్చి.. రెడి అవుతున్న స్వప్పను చూసి...

కనకం.. ఏంటో నువ్వింకా రెడీ కాలేదా.. ఇలా అయితే ఎలా.. త్వరగా రెడీ కావాలి

స్వప్న: అమ్మ వాటిని ఎలా పడితే అలా వేయోద్దు. అవేమైనా మన ఇంట్లో లాగా గిల్టీ నగలు..

కనకం: సరేలే కానీ పెట్టుకో..

రాహుల్‌: చూశావా మమ్మీ మన నగలు వేసుకుని తన నగలు అని బిల్డప్‌ కొడుతుంది.

రుద్రాణి: ఇంటి కోడలు అయినప్పుడు ఆ మాత్రం ఉంటుంది.

అని రుద్రాణి డాక్టర్‌ కు కాల్‌ చేసిన విషయం రాహుల్‌కు చెప్తుంది. స్వప్నకు కడుపు లేదని డాక్టర్‌ శ్రీదేవి చెప్పిందనడంతో ఇవాళ్టి ఏపిసోడ్‌ ముగుస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 18th:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
జగద్ధాత్రి సీరియల్:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
Godavari Serial Today August 18th: 'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
Anu Sri Raj: సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget