అన్వేషించండి
Advertisement
Karthika Deepam: 'కార్తీకదీపం' సీరియల్ లో బిగ్ బాస్ ఫేమ్ మానస్, రోల్ ఏంటంటే?
'కార్తీక దీపం' సీరియల్ లో నెక్స్ట్ జెనరేషన్ కథలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోయేది ఎవరో తెలుసా..? బిగ్ బాస్ ఫేమ్ మానస్ నాగులపల్లి.
'కార్తీకదీపం' సీరియల్ నుంచి డాక్టర్ బాబు, వంటలక్క క్యారెక్టర్లను ఎండ్ చేసేశారు దర్శకుడు. విలన్ మోనిత క్యారెక్టర్ ను కూడా తప్పించారు. ఇప్పుడు నెక్స్ట్ జెనరేషన్ కథతో ఈ సీరియల్ ను నడిపించబోతున్నారు. దీప, కార్తిక్ ల చావుకి కారణం హిమేనని ఆమెని హేట్ చేయడం మొదలుపెడుతుంది సౌర్య. వీరి మధ్య గొడవతో సీరియల్ ని సాగదీయబోతున్నారు. ఇప్పుడు కథలో కొన్ని క్యారెక్టర్లు రాబోతున్నాయి.
నెక్స్ట్ జెనరేషన్ కథలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోయేది ఎవరో తెలుసా..? బిగ్ బాస్ ఫేమ్ మానస్ నాగులపల్లి. హిమ, సౌర్యలు పెద్ద వాళ్లు అయిన తరువాత వారిలో ఒకరికి పెయిర్ గా మానస్.. కార్తీకదీపం సీరియల్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ షెడ్యూల్ లో మానస్ షూటింగ్ లో పాల్గొన్నాడు. మానస్ తో పాటు మరికొంతమని ఈ సీరియల్ లో కొత్తగా అడుగుపెట్టనున్నారు. సౌర్య, హిమలకు జోడీగా ఇద్దరు నటులు రాబోతున్నారు. ఇక సౌందర్య, ఆనందరావుల క్యారెక్టర్లు కంటిన్యూ కాబోతున్నాయి.
వారు తప్పించి సీరియల్ లో కనిపించబోయేవారంతా కొత్తవారేనని తెలుస్తోంది. టైటిల్ ని మాత్రం మార్చే ఉద్దేశం లేదట. కొత్త కథ, కథనాలతో సీరియల్ సాగనుంది. ఇప్పటికే మానస్ 'కోయిలమ్మ' సీరియల్ తో బుల్లితెర ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 5లో తన పెర్సనాలిటీతో ఆకట్టుకున్నాడు. మిస్టర్ పెర్ఫెక్ట్ గా హౌస్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి మానస్ కెరీర్ కి 'కార్తీకదీపం' ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి!
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
జాబ్స్
విశాఖపట్నం
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion