అన్వేషించండి

Jagadhatri Serial Today May 6th: అవినాష్‌ను అరెస్ట్ చేయడానికి వెళ్లిన జేడీ..? ధాత్రికి ఊహించని షాక్‌ ఇచ్చిన అవినాష్

Jagadhatri Serial Today Episode May 6th: అవినాష్‌ను అరెస్ట్ చేయడానికి వెళ్లిన జేడీ..? ధాత్రికి ఊహించని షాక్‌ ఇచ్చిన అవినాష్

Jagadhatri Serial Today Episode: అవినాష్ చేసిన పనికి జగధాత్రి, కేదార్‌పై ఇంట్లో అందరూ మండిపడుతుంటారు.ఇంతలో సుధాకర్‌ వచ్చి కేదార్‌ చెంప పగులగొడతాడు. ఊహించని పరిణామానికి కేదార్‌, జగధాత్రి షాక్‌ తింటారు. అమ్మానాన్న లేని అనాథగాడివి నీకు ఏం తెలుస్తుందిరా కుటుంబం విలువ అంటే అని అంటాడు. అలా మాట్లాడొద్ద నాన్న అని కేదార్ బ్రతిమలాడుకుంటాడు.రోడ్డుమీద పోయే గొడవలను ఇంటిమీదకు తీసుకొస్తావా అని మండిపడతాడు.ఇవాళ నీ వల్ల నాకోడలు, కూతురు జీవితాలు నాశనమయ్యేవని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. మర్యాదగా మీ ఇద్దరూ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోండని ఆదేశిస్తాడు.జీవితంలో మళ్లీ నా కంటికి కనిపించొద్దని అంటాడు. ఆ మాటలకు వైజయంతి, నిషిక ఆనందపడిపోతారు.ఇన్నాళ్లకు వీళ్ల పీడ విరగడైందని అనుకుంటారు. అడ్డమైన వాళ్లని చేరదీసి ఇంట్లో పెట్టుకుంటే ఇలాగే అవుతుందని వైజయంతి అంటుంది. ఇంకా చూస్తూ ఊరుకున్నావేంటి నిషిక....వీళ్లను మెడపట్టి బయటకు గెంటివేయమని అంటుంది. సుధాకర్‌ కూడా వాళ్లను వెళ్లిపొమ్మని అనడంతో ధాత్రి,కేదార్ చాలా బాధపడుతుంటారు. అప్పుడే కౌషికి కలుగజేసుకుని....మీకు ఏమైందని, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని అంటుంది. మనకు మంచి జరిగినప్పుడు ఆనందించి...కొంచెం బాధ కలగగానే కుటుంబాన్ని వదులుకుంటామా అని అంటుంది.జగధాత్రి, కేదార్‌ వల్ల ఈ ఇంటికి జరిగిన మంచి మర్చిపోయారా అని అంటుంది. అయినా రోడ్డుమీద యాక్సిడెంట్ జరిగితే పోలీసులు ఫిర్యాదు చేశారు.కానీ ఆ రౌడీ వెధవలు పగబట్టి ఇంటిమీదకు వస్తే అందులోవీళ్ల తప్పు ఏముందని అంటుంది. ఇంతలో శ్రీవల్లి కూడా వచ్చి ఇందులో అన్నయ్య తప్పుఏం లేదని ఇంట్లో నుంచి పంపించవద్దని అంటుంది. దీంతో సుధాకర్‌ కోపం తగ్గించుకుని శ్రీవల్లి చెప్పింది కాబట్టి మిమ్మల్ని ఇంట్లో ఉండనిస్తున్నానని అంటాడు. ఆ రౌడీవెధవలు మళ్లీ ఈ ఇంటివైపు కన్నెత్తి చూస్తే సహించేది లేదని చెప్పి వెళ్లిపోతాడు. వాడిని మీరు క్షమించినా నేను మాత్రం వదిలిపెట్టేదిలేదని కౌషికి అంటుంది. కేసుపెట్టి లోపల వెయిస్తానని అంటుంది.
                           అవినాష్‌ ఇంతపని చేస్తాడని ఊహించలేదని...ఒక ఆడబిడ్డకు న్యాయం చేయడం కోసం మన ఇంటి ఆడపిల్లలను ఇబ్బందిపాలు చేస్తామని  ఊహించలేకపోయామని జగధాత్రి అంటుంది. ఇప్పుడు వదిన ఎలాగూ కమిషనర్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తుంది.అదిసాదూ సర్ వద్దకే వస్తుంది. ఇక ఈకేసులో అవినాష్‌ను అరెస్ట్‌ చేసి జీవితంలో బయటకురాకుండా చేయాలని అనుకుంటారు. ఇదే విషయం సాధూకు చెప్పగా...సరేనంటాడు. ఈరోజుతో జగధాత్రి పీడ విరగడైందని అనుకుంటే మళ్లీ కౌషికి వదిన అడ్డుపడిందని నిషిక బాధపడుతుంటుంది. అప్పుడే ధాత్రి ఆమెకు పాలుతీసుకునివెళ్లి ఇస్తుంది. నువ్వు ఇంట్లో ఉన్నన్నాళ్లు నాకు సంతోషంలేదని....మీరు మర్యాదగా వెళ్లిపోండని చెప్పి పాలగ్లాసు విసిరికొడుతుంది. అటు యువరాజు కూడా కేదార్‌తో గొడవపడతాడు. నా ఆస్తి ఎవడో తన్నుకునిపోతుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాననుకుంటున్నావని అంటాడు. దీంతో వాళ్లిద్దరూ కొట్టుకుంటారు.
                              జేడీపై గెలిచానని అవినాష్‌ ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయి చేస్తుంటాడు.అప్పుడే అక్కడికి వచ్చిన వాళ్ల నాన్నతో జేడీ,కేడీ వెనక ఉన్న ముఖాలు నాకు తెలుసని....నీ బర్త్‌డేగిఫ్ట్‌గా నీకు ఆరోజు వాళ్లు ఎవరో చెప్పేస్తానని అంటాడు. ఇంతలో అవినాష్‌ను అరెస్ట్ చేయడానికి జేడీ,కేడీ వస్తారు. ఇప్పుడు మీరు వాడిని అరెస్ట్ చేస్తే వాడు భయంతో మీరు ఎవరో వాళ్ల నాన్నకు చెప్పేస్తాడేమోనని రమ్య అంటుంది.వాడి వీక్‌నెస్‌ నాకు తెలుసునని దానిపై దెబ్బకొడతానని అంటుంది.అరెస్ట్ చేయడానికి లోపలికి వెళ్లిన జేడీ...అవినాష్‌ను మాటలతో రెచ్చగొడుతుంది. నేను ఎవరో అందరికీ చెబుతానని ఛాలెంజ్ చేస్తున్నావ్ కదరా చెప్పుకోమని అంటుంది. దీంతో అవినాష్‌ నీపై నేను గెలిచే వరకు నువ్వు ఎవరో ఎవరికీ చెప్పనని అంటాడు.రౌడీలతో జేడీ,కేడీలను కొట్టించాలని చూడగా....వాళ్లు రౌడీలను ఇరగ్గొడతారు. వెంటనే మిని‌స్టర్‌ కొడుకు దగ్గరకు వచ్చి పారిపొమ్మని చెబుతాడు.అవినాశ్, వాడి  ఫ్రెండ్‌ పారిపోతుండగా....ఫ్రెండ్‌ను కేదార్ కాలిపై కాలుస్తాడు. అవినాష్‌కు తుపాకీ గురిపెట్టి..మినిష్టర్‌ను ఇంటి చుట్టుూ పరుగులు తీయమని ఆదేశిస్తాడు. ఇంట్లో వాళ్ల నాన్న పడిన ఇబ్బందికి  బదులు తీర్చుకుంటాడు. ఇంతలో అవినాష్ గట్టిగా నవ్వుతూ మీరు నన్ను ఏమీ చేయలేరని..ఎందుకంటే మీ మేనకోడలిని నేను కిడ్నాప్ చేసి దాచిపెట్టానని చెబుతాడు.                                

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 1st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
Godavari Serial Today August 1st: 'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
Nindu Manasulu Serial Today August 1st: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
Karthika Deepam 2 Serial Today August 1st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!
Advertisement

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
Embed widget