అన్వేషించండి

chinni serial today may 5th: చిన్ని సీరియల్: చిన్ని కడుపులో కావేరి పుడుతుందా! దేవాకి ఊహించని షాక్!

chinni serial today episode may 5th చిన్ని కలలో కావేరి కనిపించి పాపగా పుడతాను అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మ్యాడీ, చందు బాలరాజుని కలుస్తారు. త్వరలోనే మీది కావేరి గారికి ఏ తప్పు లేదని మీరు ఇద్దరూ నిర్దోషులు అని నిరూపిస్తామని మ్యాడీ అంటాడు. దానికి బాలరాజు సంతోషంతో అలా జరిగితే నా కూతురు అత్తారింట్లో సంతోషంగా ఉంటుంది.. అంత కంటే నాకు ఇంకేం కావాలి అని బాలరాజు అంటాడు. త్వరలోనే మీ కోరిక తీరుతుంది అంకుల్ అని చెప్పి మ్యాడీ, చిన్ని, చందు బయల్దేరుతారు.
 
చందు లాయర్‌కి కాల్ చేస్తాడు. ముగ్గురు లాయర్ శ్రీనివాస్‌ని కలవడానికి వెళ్తారు. దేవా మనుషులు ముగ్గురిని ఫొటో తీసి దేవాకి పంపిస్తారు. దేవా తన మనుషులకు కాల్ చేసి ఆ ఫొటోలు మ్యాడీ పక్కన ఉంది ఎవరు అని అడుగుతాడు. మ్యాడీ చిన్ననాటి ఫ్రెండ్ చందు సార్ అని చెప్తాడు. దాంతో దేవా సత్యంబాబు కొడుకు చందునా అని అనుకుంటాడు. వాళ్లు ఎవరి దగ్గరకు వెళ్తున్నారు.. ఏం మాట్లాడుతున్నారు.. మొత్తం తెలుసుకోండి అని దేవా అంటాడు. రౌడీలు మ్యాడీ వాళ్ల కారుని ఫాలో అవుతారు. మరోవైపు నాగవల్లి దేవా దగ్గరకు వచ్చి అర్జెంటుగా మన మ్యాడీ శ్రేయ మెడలో తాళి కట్టాలి బావ అని అంటుంది. మ్యాడీ ఇప్పుడు కేసు పనిలో ఉన్నాడు.. మన మాట వినడు.. శ్రేయ మెడలో తాళి కట్టడు అని దేవా అంటే వింటాడు అని నాగవల్లి ప్లాన్ చెప్తుంది. నీ ప్లాన్ చాలా బాగుంది నాగవల్లి ఇది వర్కౌట్ అయితే మ్యాడీ శ్రేయ మెడలో తాళి కడతాడు.. వాళ్ల పెళ్లి అయిపోతుందని దేవా అంటాడు. రేపే పెళ్లికి ముహూర్తం పెట్టానని నాగవల్లి చెప్తుంది. 
 
మ్యాడీ, చందు, చిన్ని లాయర్‌ని కలుస్తారు. చందు లాయర్‌కి హరి గురించి అడిగితే ఏ హరి అని ఫుల్ డిటైల్స్ అడుగుతారు. ఇంతలో చిన్ని బొమ్మ గీసి చూపిస్తా అని లాయర్ హరి బొమ్మ గీస్తుంది. ఆ బొమ్మని చూసి లాయర్ హరిశ్చంద్రప్రసాద్‌ గారా అని ఆయన ప్రాక్టీస్ మానేశారు. ఆయన ప్రస్తుతం ఓ విలేజ్‌లో ఉన్నారు అని అడ్రస్ చెప్తాడు. అయితే చాటుగా దేవా మనిషి అదంతా వినేస్తాడు. మ్యాడీ వాళ్లు అక్కడికి బయల్దేరుతారు. ఇంతలో నాగవల్లి మ్యాడీకి కాల్ చేస్తుంది. మ్యాడీ నాగవల్లితో తాను చిన్ని, చందు కేసు పని మీద తిరుగుతున్నాం అని చెప్తాడు. తర్వాత నాగవల్లి దగ్గరకు లోహిత వస్తుంది. లోహిత పట్టీల శబ్ధానికి నాగవల్లి మళ్లీ ఆత్మ వచ్చిందేమో అని కంగారు పడుతుంది. లోహి అని చూసి లోహితకు పట్టీలు తీసేయని అంటుంది. ఇక రైడీలు మ్యాడీ వాళ్ల కంటే ముందే అడ్రస్‌కి వెళ్లి లాయర్ హరిని పట్టుకొని చితక్కొడతారు. సాక్ష్యాలు అడుగుతారు. నన్ను చంపినా ఆ సాక్ష్యాల గురించి చెప్పను అని హరి అంటారు. అయితే చంపేస్తాం అని రౌడీలు హరిని చంపే టైంకి మరోరౌడీ ఆపి సార్‌ని అడిగి నిర్ణయం తీసుకుందామని అంటాడు. దేవా కాల్ చేసి వాడిని చితక్కొట్టి సాక్ష్యాలు తీసుకోమని అంటాడు. 
మ్యాడీ చిన్నిని తీసుకొని రాత్రి ఇంటికి రావడంతో దేవా, నాగవల్లి సీరియస్ అవుతారు. ఇంత లేట్ ఎందుకు అయింది అని ప్రశ్నిస్తారు. కేసు విషయంలో తిరగడం వల్ల లేటు అయిందని ఆ టైంలోనే ఊహించని నిజాలు తెలిశాయి అని చిన్ని వాళ్ల అమ్మ కేసు వాదించిన లాయర్‌ని ఎవరో కిడ్నాప్‌ చేశారు. మీకు తెలుసు కదా అని దేవాని అడుగుతాడు. నాకు ఏం తెలుసు అని దేవా అంటే మీ శత్రువులు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. అదంతా మీ ఊహాగానాలు అని దేవా అంటే అదేం కాదు మేం లాయర్‌ని కలుస్తాం అని తెలిసే కిడ్నాప్ చేశారు అని చిన్ని అంటుంది.
 
నాగవల్లి, చిన్ని గొడవ పడుతుంటే మ్యాడీ ఆపుతాడు. మ్యాడీ నాగవల్లితో నిజానిజాలు తెలిసే వరకు చిన్నిని ఏం అనొద్దని అంటాడు.  చిన్ని రాత్రి పడుకునే టైంలో కావేరి మాటలు చిన్నికి వినిపిస్తాయి. త్వరలోనే నేను నీకు పాపగా పుడతాను నీకు దగ్గరవుతాను అని మాటలు వినిపిస్తాయి. చిన్ని తల్లి ఫొటో దగ్గరకు వెళ్లి ఏడుస్తుంది. మ్యాడీకి సంతోషంగా విషయం చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ వంటలకు విహారి ఇంట్లో ప్రశంసలు..! కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి లక్ష్మీ మాస్టర్ ప్లాన్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ వంటలకు విహారి ఇంట్లో ప్రశంసలు..! కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి లక్ష్మీ మాస్టర్ ప్లాన్!
TV Actor Arrested: మైనర్ బాలికపై వేధింపులు... పోక్సో కేసులో టీవీ యాక్టర్‌ అరెస్ట్
మైనర్ బాలికపై వేధింపులు... పోక్సో కేసులో టీవీ యాక్టర్‌ అరెస్ట్
Vanana Brundha: మోడలింగ్‌తో కెరీర్ స్టార్ట్.. వెండితెరపై ఎంట్రీ ఇచ్చి బుల్లితెరకు షిఫ్ట్.. మేఘసందేశం వందన రియల్ లైఫ్ విషయాలు
మోడలింగ్‌తో కెరీర్ స్టార్ట్.. వెండితెరపై ఎంట్రీ ఇచ్చి బుల్లితెరకు షిఫ్ట్.. మేఘసందేశం వందన రియల్ లైఫ్ విషయాలు
Godavari Serial Today July 11th: 'గోదావరి' సీరియల్: పెళ్లి కొడుకు గుట్టు బయటపెట్టిన జాను.. చివరి నిమిషంలో ఆగిన నందు పెళ్లి!
'గోదావరి' సీరియల్: పెళ్లి కొడుకు గుట్టు బయటపెట్టిన జాను.. చివరి నిమిషంలో ఆగిన నందు పెళ్లి!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Car Insurance: నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Embed widget