అన్వేషించండి

Ammayi garu Serial Today October 14th: అమ్మాయిగారు సీరియల్: కోలుకున్న రాఘవ! విజయాంబిక చాప్టర్ ముగిసినట్లేనా! ఈసారి ఏం చేస్తుందో!

Ammayi garu Serial Today Episode October 14th రాఘవ కోమాలో నుంచి బయటకు వచ్చాడని రాజు, రూపలకు డాక్టర్ చెప్పడం ఆ విషయం విజయాంబిక, దీపక్‌లకు తెలిసిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode విరూపాక్షి విజయాంబిక దగ్గరకు వెళ్లి థ్యాంక్స్ చెప్తుంది. ఇప్పటి వరకు సూర్యకి నీ మీద కోపం నీ మీద నమ్మకం చూసేదాన్ని కానీ మొదటి సారి నీ మీద కోపం చూశా.. అది కూడా నీవల్లే.. అయినా రాఘవ కోలుకున్న వరకు నీకు వచ్చిన కష్టమేమీ లేదు అని నవ్వుకుంటూ వెళ్లిపోతుంది. 

రూప విజయాంబికతో ఎలా ఉంది అత్త నా ఎత్తుగడ అని అంటుంది. ఇదంతా చేసింది నువ్వే అని నాకు తెలుసు రూప అని దీపక్ అంటే అవును దీపక్.. మా అమ్మానాన్నల్ని విడదీయాలి అంటే ఇలాగే అడ్డుకుంటా దానికి ఏం వాడుకుంటానో ఎలా చేస్తానో నాకే తెలీదు కానీ నన్ను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండు అని వెటకారంగా చూసి వెళ్లిపోతుంది. రాజు విజయాంబిక వాళ్లతో మీ ఇద్దరి మంచి కోసం ఓ విషయం చెప్తా రేపో మాపో రాఘవ లేచి మీ గురించి నిజం చెప్తాడు. అప్పుడు మీ ప్రాణాలు పోతాయి అంత వరకు ఎంజాయ్ చేయండి అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. 

కోమలి విజయాంబికతో రాఘవ కోమా నుంచి బయటకు వస్తే మీతో పాటు నేను చచ్చిపోతా అలా జరగకూడదు అంటే రాఘవ కోమా నుంచి బయటకు రాకూడదు అని అంటుంది. హాస్పిటల్‌లో రాఘవ కోమా నుంచి బయటకు వచ్చి కళ్లు తెరుస్తాడు. నర్సు డాక్టర్‌ని పిలవడంతో డాక్టర్ వచ్చి రాఘవని పిలుస్తాడు. నేను పెద్దయ్య గారిని కలవాలి అని రాఘవ అంటాడు. మీరు రెస్ట్ తీసుకోండి నేను పెద్దయ్య గారిని పిలిపిస్తా అంటాడు. వెంటనే డాక్టర్‌ రాజుకి కాల్ చేసి రాఘవని చూసుకునే డాక్టర్ వేరే పని మీద వెళ్తారు నేను ఇప్పుడు రాఘవని చూస్తున్నా రాఘవ కోమా నుంచి బయటకు వచ్చాడు అని చెప్తారు. 

రాజు, రూప చాలా సంతోషపడతారు. రాఘవ పెద్దయ్యగారిని కలవాలి అంటున్నారు అంటే మేం వస్తాం అని రాజు, రూప చెప్పి రాఘవ దగ్గరకు బయల్దేరుతారు. దీపక్ రాజు, రూపల మాటలు చాటుగా విని రాఘవ కోమా నుంచి బయటకు వస్తే ఇక మా చావే అని అనుకొని విజయాంబికకు చెప్పాలి అనుకుంటాడు. విజయాంబిక రోజు రోజుకి తన పవర్ తగ్గిపోతుందని కోమలికి చెప్పుకొని రూప అంతు చూడాలి అని అంటుంది. ఇంతలో మందారం వచ్చి మంట తగ్గలేదా.. బర్నాల్ రాయాలా అని వెటకారంగా మాట్లాడుతుంది. ఇంతలో దీపక్ హడావుడిగా వస్తాడు. మందారాన్ని బయటకు పొమ్మని చెప్తాడు. బలవంతంగా గెంటేస్తాడు. రాఘవ గురించి చెప్తాడు. విజయాంబిక, కోమలి బిత్తరపోతారు. నేను ఇంట్లో నుంచి పారిపోతా అని కోమలి అంటుంది. 

విజయాంబిక, దీపక్‌తో మీ మామయ్య, విరూపాక్షి ఇద్దరూ అసెంబ్లీకి వెళ్లారు. వాళ్లు వచ్చేలోపు రాఘవని ఏదో ఒకటి చేయాలని అంటుంది. రాజు రూపలు అక్కడే ఉంటారు కదా అని దీపక్ అంటే ఉంటారు కానీ మనం రిస్క్ చేయాలని రాఘవ దగ్గరకు వెళ్తారు. కోమలిని ఎక్కడికీ పారిపోవద్దని చెప్తుంది. రాజు, రూపలు రాఘవని చూపి చాలా సంతోషపడతారు. విజయాంబిక వాళ్లు కూడా వస్తారు. 

రాఘవ భయపడుతూ రాజు విజయాంబిక వస్తే నన్ను బతకనివ్వదు ఈలోపే పెద్దయ్యగారికి నిజం చెప్పాలి.. త్వరగా నన్ను పెద్దయ్యగారి దగ్గరకు తీసుకెళ్లు అని అంటాడు. నీకు సెక్యూరిటీ ఉంది.. మేం కూడా ఇక్కడే ఉంటాం నీకేం భయం లేదు అని రాజు అంటాడు. మామయ్యని ఆపాలంటే సూర్యప్రతాప్‌కి యాక్సిడెంట్ చేద్దామని దీపక్ అంటే విజయాంబిక వద్దు అని రాఘవ అంతు చూడాలని అంటుంది. రాజు చంద్రకి కాల్ చేసి సూర్యప్రతాప్‌కి ఫోన్ ఇవ్వమని చెప్తాడు. సూర్యప్రతాప్‌తో మాట్లాడి హాస్పిటల్‌కి రమ్మని చెప్తాడు. సూర్యప్రతాప్‌ క కంగారు పడితే రాఘవ కళ్లు తెరిచాడు మీతో మాట్లాడాలని అంటున్నాడని రాజు చెప్తాడు. సూర్యప్రతాప్‌ సరే అని అంటాడు. 

దీపక్, విజయాంబిక చాలా టెన్షన్ పడతారు. ఏం చేయాలా అని అనుకుంటారు. రూప రాజుతో ఈ రోజుతో విజయాంబిక అరాచకాలకు ముగింపు పలుకుతున్నామని అంటుంది. రాజు రూపని అక్కడే ఉండమని తాను వెళ్లి సూర్యప్రతాప్‌ని తీసుకొస్తా అని బయటకు వెళ్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 16th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కొబ్బరి బొండాల్లో విషం! పిల్లలకు పట్టేసిన మహా..! అంబిక సక్సెస్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కొబ్బరి బొండాల్లో విషం! పిల్లలకు పట్టేసిన మహా..! అంబిక సక్సెస్!
Godavari Serial Today November 16th: 'గోదావరి' సీరియల్: ఆకర్ష్ ఇచ్చిన చీరలో నందు.. దిష్టి తీసిన మురళీ! జానుకి సారీ చెప్పడానికి సంజయ్‌కి సాయం చేసిన చిట్టి మరదలు!
'గోదావరి' సీరియల్: ఆకర్ష్ ఇచ్చిన చీరలో నందు.. దిష్టి తీసిన మురళీ! జానుకి సారీ చెప్పడానికి సంజయ్‌కి సాయం చేసిన చిట్టి మరదలు!
Nindu Manasulu Serial Today November 16th: నిండు మనసులు: ప్రేరణని సిద్ధూ అర్థం చేసుకోడా? జర్నలిస్ట్‌కి బుద్ధి చెప్పిన సిద్ధూ!
నిండు మనసులు: ప్రేరణని సిద్ధూ అర్థం చేసుకోడా? జర్నలిస్ట్‌కి బుద్ధి చెప్పిన సిద్ధూ!
Brahmamudi Serial Today November 16th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  ఐశ్వర్య ప్లాన్‌ సక్సెస్‌ - అయోమయంలో పడిపోయిన ఇందు
‘బ్రహ్మముడి’ సీరియల్:  ఐశ్వర్య ప్లాన్‌ సక్సెస్‌ - అయోమయంలో పడిపోయిన ఇందు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lakshya Raichandani Reply: ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
Akvan Cyclone: ముంచుకొస్తున్న తుపాను ముప్పు.. నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం.. సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష!
ముంచుకొస్తున్న తుపాను ముప్పు.. నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం.. సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష!
BJP on Rahul Gandhi: భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
Crime News: పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
DNK Collections : మౌళి DNK ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - చిన్న సినిమాకు మూడు రోజుల్లో వసూళ్లు ఎంతంటే?
మౌళి DNK ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - చిన్న సినిమాకు మూడు రోజుల్లో వసూళ్లు ఎంతంటే?
Bhimavaram Municipal Elections: భీమవరం మున్సిపల్ పోరు.. నన్ను కాదు, బీజేపీని అవమానించారు! కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
భీమవరం మున్సిపల్ పోరు.. నన్ను కాదు, బీజేపీని అవమానించారు! కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
Electric Aircraft: ఇంధనం అవసరం లేని ఎలక్ట్రిక్‌ విమానం రెడీ.. 60 కి.మీ. ప్రయాణించిన COMAC CE-25A ప్రత్యేకతలివే!
ఇప్పుడు ఎలక్ట్రిక్‌ విమానం వంతు.. 16 నిమిషాల్లో సక్సెస్‌ఫుల్‌గా 60 కి.మీ. ప్రయాణం
India Myanmar Naval Exercise: విశాఖపట్నంలో ఆకట్టుకున్న 8వ ఎడిషన్ భారత్- మయన్మార్ నావికాదళ విన్యాసాలు
విశాఖపట్నంలో ఆకట్టుకున్న 8వ ఎడిషన్ భారత్- మయన్మార్ నావికాదళ విన్యాసాలు
Embed widget