Ammayi garu Serial Today May 7th: అమ్మాయి గారు సీరియల్: గుండెల్ని పిండేసే సీన్.. రూపని పొట్టన పెట్టుకున్న రాక్షసులు.. దారుణంగా బాడీ!
Ammayi garu Today Episode రూపని కోనేటిలో చంపేసిన దీపక్, విజయాంబికలు రూప శవం చూసి బంటీ, సూర్యతో పాటు అందరూ వెక్కి ఏడ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రూప పూజ తర్వాత కోనేటిలోకి దిగుతుంది. మూడు మునకలు చేస్తుండగా చివరి మునకలో దీపక్ మనుషులు రూపని నీటిలోనే కిడ్నాప్ చేసేస్తారు. బయట అందరూ రూప కనిపించడం లేదని చాలా కంగారు పడతారు. రాజు నీటిలో దిగి రూప కోసం వెతుకుతాడు. దీపక్, విజయాంబికలు నవ్వుకుంటారు.
రాజు కొలను మొత్తం రూప కోసం వెతుకుతాడు. రౌడీలు రూప నోరు నొక్కేసి నీటిలోనే ఉంచేస్తారు. బంటీ, విరూపాక్షి అందరూ ఏడుస్తుంటారు. రూప ఎక్కడా కనిపించడం లేదని రాజు చెప్తాడు. చాలా హ్యాపీగా ఉందని దీపక్, విజయాంబికలు అనుకుంటారు. తర్వాత విజయాంబిక దీపక్‌ని కూడా నీటిలోకి దిగి వెతకమని అంటుంది. మరి కొంత మంది మనుషులు వచ్చి వెతుకుతారు. రూప రూప అని అందరూ పిలుస్తారు. ఎంత వెతికినా రూప కనిపించదు. సూర్యప్రతాప్ కూడా ఏడుస్తాడు. గజ ఈతగాడిని పిలవమని చంద్రతో చెప్తాడు. మనుషులు చాలా మంది కొనేరు మొత్తం వెతుకుతారు కానీ రూప కనిపించదు. విజయాంబిక దొంగ ఏడుపు ఏడుస్తుంటుంది. గజ ఈతగాళ్లు కూడా వస్తారు.
పోలీసులకు సమాచారం ఇస్తారు. రెస్కూ టీమ్‌ని పిలుస్తారు. అందరూ దేవుళ్లకు మొక్కుకుంటారు. మా అమ్మ మా అమ్మ అని బంటీ ఏడుస్తాడు. అందరూ దేవుళ్లకు దండం పెట్టుకుంటారు. గండం పోతుందని పూజ చేశాం కదా స్వామీ నువ్వే నా కూతురిని గండంలో ముంచేశావా.. అని సూర్యప్రతాప్ ఏడుస్తాడు. ఇక విరూపాక్షి తన బిడ్డ తీసుకున్న మంచి నిర్ణయం కోసం అయినా ఏం కాకుండా బయట పడేయమని వేడుకుంటుంది. విజయాంబిక పంతులుతో మా రూపకి గండం పోతుంది అన్నారు రూప చనిపోవడానికి కారణం మీరే అంటుంది. చనిపోవడం ఏంటి అని పంతులు అంటే ఇంత సేపు అయినా రాలేదు కదా మరేంటి అని అంటుంది. సూర్యప్రతాప్ అక్క మీద అరుస్తాడు. నాకు అమ్మవారి మీద నమ్మకం ఉంది అని అంటాడు.
విజయాంబిక మనసులు మీ అమ్మని నేనే చంపేశాను బంటీ ఈ పాటికి మీ అమ్మని చేపలు చంపేసుంటాయని అనుకుంటుంది. రాత్రి అయిపోతుంది కానీ రూప ఎక్కడా కనిపించదు. ఇంతలో కొంత మంది అమ్మాయిగారు దొరికారని చెప్తారు. రూప ముఖం మొత్తం చూడటానికి ఇబ్బంది కరంగా ఉంటుంది. రూప చనిపోయి ఉంటుంది. ఉదయం నుంచి నీటిలో ఉండిపోవడం వల్ల బాడీ గుర్తు పట్టలేనంతగా ఉబ్బిపోయి ఉంటుంది. అందరూ చాలా ఏడుస్తారు. రాజు షాక్‌లో ఉండిపోతాడు. సూర్యప్రతాప్, విరూపాక్షి గుండె పగిలేలా ఏడుస్తారు. అమ్మా లే అమ్మా అంటూ బంటీ ఏడ్చి అందర్నీ ఏడిపించేస్తాడు.
పోలీసులు సూర్యతో బాడీని పోస్ట్‌మార్టంకి పంపిస్తామని అంటారు. విజయాంబిక, దీపక్‌లు తమ బండారం బయట పడిపోతుందని షాక్ అయిపోతారు. ఇప్పటికే రూప నీటిలో ఉండిపోయి గుర్తు పట్టలేకుండా అయిపోయింది. ఇప్పుడు రూపని ముక్కలు ముక్కలు చేసేస్తారా అని అంటుంది. సూర్య బంటీతో ఈ రోజు నుంచి మనం అంతా ఎంతో సంతోషంగా ఉంటామని మీ అమ్మ ఆశపడింది బంటీ కానీ నిన్ను నన్ను పరిచయం చేసి మనకు దూరం అయిపోతుంది అనుకోలేదని ఏడుస్తారు. ఇంత కాలం రూపని ప్రేమగా చూసుకోలేదు.. ఇకపైనైనా ప్రేమగా చూసుకోవాలి అనుకున్నా కానీ ఓడిపోయాను అని ఏడుస్తారు. నా పంచప్రాణాలు పోయిన తర్వాత నేను బతికి ఏం చేస్తాను నేను నా బిడ్డ దగ్గరకే పోతాను అని నీటిలో దూకేయాలి అనుకుంటే అందరూ బతిమాలి అడ్డుకుంటారు. విరూపాక్షి తలబాదుకొని ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథున జడలో పూలపెట్టిన దేవా.. భాను గుండె ముక్కలైపోయిందా!





















