అన్వేషించండి

Ammayi garu Serial Today May 13th: అమ్మాయి గారు సీరియల్: విరూపాక్షికి నిజం చెప్పేసిన నర్సు.. రూప ఎలా బతికిందో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

Ammayi garu Today Episode రుక్మిణి సూర్యప్రతాప్ రెండో కూతురు కాదని సూర్య ఏకైక కూతురు రూప అని రాజుకి తెలియడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రుక్మిణి రాజుని రైస్ పీస్ అని పిలుస్తుంది. దాంతో రాజు రుక్మిణిని కోప్పడతాడు. రుక్మిణి లాగి పెట్టి ఒక్కటిస్తుంది. రుక్మిణి చెంప దెబ్బ తగలడంతో అమ్మాయిగారు అని రాజు రుక్మిణిని రూప అని గుర్తు పడతారు. రూప శవం గుర్తు చేసుకొని నిజం మీరు మా అమ్మాయి గారేనా అని అడుగుతాడు. అవును అని రూప చెప్పడంతో రూపని హగ్ చేసుకొని ఏడుస్తాడు.

రాజు: అమ్మాయి గారు అసలు ఏమైంది. నీళ్లలో మునిగిన మీరు ఎలా మాయం అయిపోయారు.
రూప: నేను మూడో సారి మునిగినప్పుడు ఎవరో నా ముక్కు మూసేశారు.  నాకు గొంతు నులిమేశారు. ఆ తర్వాత నేను చచ్చిపోయాను అని వదిలేసి వెళ్లిపోయారు.  
రాజు: మీరు ప్రాణాలతో వచ్చారు అది చాలు అమ్మాయి గారు. కానీ అసలు ఈ గెటప్ ఏంటి అమ్మాయి గారు.
విరూపాక్షి: అసలు ఏం జరిగిందో నేను చెప్తాను. రూప చనిపోయింది అనే బాధలో ఆ రోజు నేను ఉంటే నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. అని జరిగింది చెప్తుంది.

రూప ఓ చోట తేలుతుంది. ఇంతలో ఇద్దరు చాకలి వాళ్లు రూపని చూస్తారు. రూప బతికే ఉందని గుర్తించి హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. విరూపాక్షికి కాల్ రావడంతో వెళ్తుంది. నా బిడ్డ చనిపోయింది లక్ష్మీ నువ్వు ఎవర్ని ఎవరు అనుకుంటున్నావో అని విరూపాక్షి నర్సుతో మాట్లాడుతుంది. లేదని నర్సు తీసుకెళ్తుంది. రూపని చూసిన విరూపాక్షి షాక్ అయిపోతుంది. రూపని చూసి విరూపాక్షి ఏడుస్తుంది. గతంలో విజయాంబిక  చంపిన కవల పిల్లల్లో ఒకరితో పాటు విరూపాక్షి తండ్రిని చంపినప్పుడు పక్కనే ఉన్న నర్సు విరూపాక్షిని హాస్పిటల్‌లో చూసి గుర్తు పడుతుంది. 

విరూపాక్షి రూపని కాపాడిన వాళ్లని ధన్యవాదాలు చెప్పి కాళ్ల మీద పడబోతుంది. రూపకి మెలకువ వస్తుంది. రూపని పట్టుకొని విరూపాక్షి చాలా ఏడుస్తుంది. ఏమైందని రూప అడిగితే మేం అంతా నువ్వు చనిపోయాం అనుకున్నాం అమ్మా ఈ రోజు నీకు సంతాప సభ కూడా ఏర్పాటు చేశారని విరూపాక్షి చెప్తుంది. అసలేం జరుగుతుందమ్మా  అని రూప అడుగుతుంది. నువ్వు ఆ రోజు నీటిలో మునిగి లేవలేదని ఆ రోజు రాత్రి ఓ శవం కనిపించిందని అది అచ్చం నువ్వు వేసుకున్న బట్టలు వేసుకోవడంతో నువ్వే అనుకున్నాం.. నీటిలో మునిగి ముఖం ఉబ్బిపోవడంతో ఆ శవం నీదే అనుకున్నా అని అంటుంది. విరూపాక్షి రూపని తీసుకొని ఇంటికి వెళ్తాను అంటుంది.

ఇంతలో నర్సు వచ్చి నన్ను క్షమించు అమ్మా నీ బిడ్డ చావుకి నేను కారణం అయ్యానని నేను అడ్డు పడుంటే నీ బిడ్డ బతికేదని అంటుంది. ఏమైందో అర్థం కాక విరూపాక్షి, రూప ప్రశ్నిస్తారు. దాంతో నర్సు సరిగ్గా పాతికేళ్ల క్రితం పురిటి నొప్పులతో ఈ హాస్పిటల్‌కి వచ్చారు అని గతంలో జరిగింది మొత్తం చెప్తుంది. రూప షాక్ అయిపోతుంది. నీ బిడ్డను నీకు కాకుండా చేసింది ఆ దేవుడు కాదమ్మా నీ వదిన విజయాంబిక అని చెప్తుంది. రూప, విరూపాక్షి ఇద్దరూ షాక్ అయిపోతారు. మీ నాన్నని కూడా విజయాంబికనే చంపేసిందని నర్సు చెప్తుంది. విరూపాక్షి చాలా ఏడుస్తుంది. రూప షాక్ అయిపోతుంది. నీతో పాటు నీకు చెల్లి కూడా పుట్టిందని రూపతో విరూపాక్షి చెప్పి ఏడుస్తుంది. ఆ విజయాంబికను ఊరికే వదిలేయకూడదు అంటుంది.

రూప తల్లితో అత్తయ్యకు బుద్ధి చెప్పాలి అంటే ముందు నువ్వు నాన్న ఒక్కటవ్వాలి తర్వాత చెప్దాం అని అంటుంది. అప్పుడే రూప రెండో కూతురిలా వేషం మార్చుకొని వస్తుంది. ఈ స్టోరీ మొత్తం విరూపాక్షి రాజుకి చెప్తుంది. నా రెండో కన్న బిడ్డని నా తండ్రిని ఆస్తి మీద ఆశతో విజయాంబిక చంపేసిందని విరూపాక్షి ఏడుస్తుంది. అందుకే తన మీద నింద వేసి గెంటేసిందని ఏడుస్తుంది. రుక్మిణి ఐడియా సూపర్ అని రాజు అంటాడు. మా అమ్మాయిగారికి ఎలా సపోర్ట్ చేశానో చిన్న అమ్మాయిగారిని కూడా అలాగే సపోర్ట్ చేస్తానని నవ్వుతాడు. రూప బతికే ఉందన్న నిజం బంటీకి చెప్పకూడదు అనుకుంటారు. దీపక్, విజయాంబికలకు అనుమానం రాకుండా చూడాలని రాజు అంటే అందుకే ఈ వేషం యాస అని రూప అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: చిన్ని సీరియల్: కావేరికి సీరియస్.. బాలరాజు, కావేరిల కూతురే చిన్ని అని ఉష కావేరి ఒక్కరే అని తెలుసుకున్న దేవా, వల్లి!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
Nidhhi Agerwal : ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
Happy New Year 2026 : గురు ప్రదోష వ్రతంతో నూతన సంవత్సరం 2026 ప్రారంభం! అర్థరాత్రి సెలబ్రేషన్స్ కాదు ఆ రోజు ఇలా చేయండి!
గురు ప్రదోష వ్రతంతో నూతన సంవత్సరం 2026 ప్రారంభం! అర్థరాత్రి సెలబ్రేషన్స్ కాదు ఆ రోజు ఇలా చేయండి!

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
Nidhhi Agerwal : ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
Happy New Year 2026 : గురు ప్రదోష వ్రతంతో నూతన సంవత్సరం 2026 ప్రారంభం! అర్థరాత్రి సెలబ్రేషన్స్ కాదు ఆ రోజు ఇలా చేయండి!
గురు ప్రదోష వ్రతంతో నూతన సంవత్సరం 2026 ప్రారంభం! అర్థరాత్రి సెలబ్రేషన్స్ కాదు ఆ రోజు ఇలా చేయండి!
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Mental Health : మానసిక ఆరోగ్యంపై 2025లో ఇండియాలో వచ్చిన మార్పులు, సవాళ్లు ఇవే
మానసిక ఆరోగ్యంపై 2025లో ఇండియాలో వచ్చిన మార్పులు, సవాళ్లు ఇవే
Andhra Pradesh Year Ender 2025: ఆంధ్రప్రదేశ్ గ్రోత్ స్టోరీలో 2025ది ప్రత్యేక స్థానం - ఇవిగో టాప్ టెన్ మైలురాళ్లు
ఆంధ్రప్రదేశ్ గ్రోత్ స్టోరీలో 2025ది ప్రత్యేక స్థానం - ఇవిగో టాప్ టెన్ మైలురాళ్లు
IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Embed widget