అన్వేషించండి

Ammayi garu Serial Today May 12th: అమ్మాయి గారు సీరియల్: సూర్య ఇంట్లో విరూపాక్షి.. రాజుని రుక్మిణి రూపలా రైస్‌పీస్ అని పిలవడం ఏంటి? రూప బతికే ఉందా!

Ammayi garu Today Episode రుక్మిణిని సూర్య ఇంట్లో ఉండమని చెప్పడం రుక్మిణి కోసం విరూపాక్షిని కూడా ఉండమని చెప్పడం రాజుని రూపలా రుక్మిణి పిలవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode విరూపాక్షి కవల పిల్లల్లో ఒకర్ని విరూపాక్షి చంపేస్తుంది. అది విరూపాక్షి తండ్రి చూసి పాపిష్టిదానా బయట నా అల్లుడితో మంచిగా మాట్లాడి మహాలక్ష్మీ వస్తుందని చెప్పి ఇంత దారుణానికి పాల్పడతావా నా అల్లుడికి ఇప్పుడే విషయం చెప్తానని వెళ్లబోతే ఆయన్ను సిలిండర్‌తో కొట్టి తలగడ అడ్డు పెట్టి ఊపిరాడకుండా చేసి విజయాంబిక చంపేస్తుంది. విజయాంబిక దారుణాలు చూసిన నర్స్ వణికిపోతుంది. 

విజయాంబిక నర్స్‌తో ఎవరైనా అడిగితే పుట్టిన కవలల్లో ఒకరు చనిపోయారన్న వార్త విని గుండె పగిలి చనిపోయారని చెప్పు అని ఎవరికైనా చెప్తే నీకు ఆయన పట్టిన గతే పడుతుందని అంటుంది. నర్స్ బయటకు వెళ్లి కవల పిల్లల్లో ఒకరు చనిపోయారని చెప్తుంది. సూర్యప్రతాప్‌ షాక్ అయిపోతారు. మీ మామయ్యగారు కూడా చనిపోయారని చెప్తుంది. విజయాంబిక చెప్పినట్లే చెప్తుంది. సూర్యప్రతాప్‌ వాళ్లు పరుగున వెళ్లి చూస్తారు. అప్పుడు జరిగిన ఈ స్టీరీ విజయాంబిక దీపక్‌తో చెప్తుంది. ఆరోజు నువ్వు ఆ పాపని చంపితే ఈ రుక్మిణి ఎక్కడ నుంచి వచ్చిందని దీపక్ అనుకుంటాడు. 

విజయాంబిక: తమ్ముడు అందర్ని నమ్మించాలని ఈ రుక్మిణి ప్రయత్నిస్తుంది.
దీపక్: మామయ్య రూప చనిపోయిన రోజు ఈ రుక్మిణి వచ్చింది అంటే అర్థమవుతుంది మామయ్య. మన రూప కోసం చాలా సార్లు న్యూస్ పేపర్లలో వేయించాం. రూప, రాజుల ప్రేమ పెళ్లి గురించి కూడా చాలా సార్లు పేపర్లు, టీవీల్లో వచ్చింది అప్పుడు లేని రుక్మిణి ఇప్పుడు రావడం ఏంటి.
విరూపాక్షి: వాళ్ల మాటలు నమ్మెద్దు సూర్య.
సూర్యప్రతాప్‌: వాళ్ల మాటలే కాదు నేను ఎవరి మాటలు నమ్మే పరిస్థితిలో లేను. నన్ను ప్రశాంతంగా వదిలేయండి.
విజయాంబిక: రుక్మిణి విన్నావు కదా ఇక బయల్దేరు.
రుక్మిణి: ఆ ముక్క చెప్పడానికి నువ్వు ఎవరు అత్త ఆ మాట మా నాయనతో చెప్పమను. 
విజయాంబిక: తమ్ముడు చెప్పు తమ్ముడు దాన్ని వెళ్లిపోమని చెప్పు.
సూర్యప్రతాప్‌: నా ఇంటికి వచ్చింది నా కూతురు కాకపోయినా నా రూపలాగే కనిపిస్తుంది. ఈ రుక్మిణి మీరు చెప్పినట్లు వేరే అమ్మాయా.. రుక్మిణి చెప్పినట్లే నా రెండో కూతురా.. లేక రాజు చెప్పినట్లు తనే రూపనా అని తేలే వరకు తను ఈ ఇంట్లోనే ఉంటుంది. 
రుక్మిణి: ఈడనే ఉండమని చెప్పి అలా వెళ్లిపోతావ్ ఏంటి నాయనా. నేను ఈడనే ఉండాలి అంటే నాతో పాటు మా అమ్మ కూడా ఈడనే ఉండాలా. 
విజయాంబిక: చూశావా తమ్ముడు ఈ విరూపాక్షి ఇక్కడ ఉండాలి అనే ప్లాన్‌తోనే ఈ అమ్మాయిని తీసుకొచ్చింది.
రుక్మిణి: ఓసినా జుత్తుల మారి అత్తో మా అమ్మ మీద నూరి పోసింది ఆపు. నాయనా నేనేమో ఈ ఇంటికి కొత్త. పైగా నన్ను ఈడ ఎవరూ ఈ ఇంటి బిడ్డగా నమ్మడం లేదు. నన్ను నా అమ్మ ఒక్కర్తే ఇక్కడ నమ్ముతుంది. అందుకే మా అమ్మ కూడా నాతో ఉండాలి అని అనిపిస్తుంది. అది మీకు ఇష్టం లేకపోతే వద్దులే నాయనా. నేను మా అమ్మతో పాటు వెళ్లిపో. పదమ్మా.
సూర్యప్రతాప్‌: ఆగండి.. నువ్వు అడిగినట్లు నీతో పాటు మీ అమ్మ కూడా ఇంట్లో ఉండొచ్చు. 

సూర్యప్రతాప్‌ మాటతో రుక్మిణి తండ్రిని హగ్ చేసుకుని మురిసిపోతుంది. రుక్మిణి హగ్ చేసుకోవడంతో సూర్యప్రతాప్‌ రూపని గుర్తు చేసుకుంటాడు. తెలీకుండా తన చేతిని రుక్మిణి తల నిమరడానికి తీసుకెళ్లి మళ్లీ ఏడుస్తూ వెనక్కి తీసుకుంటారు. ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రుక్మిణి విజయాంబిక దగ్గరకు వెళ్లి అత్తో నన్ను మా అమ్మని  వెళ్లగొట్టడానికి చాలా ప్రయత్నించావ్ కదా ఇప్పుడు నాకు మా అమ్మకి ఉండటానికి గది నువ్వే ఏర్పాటు చేయ్ అంటుంది. తర్వాత చంద్ర, సుమ దగ్గరకు వెళ్లి చిన్నాయన, చిన్నమ్మ మీరేం కంగారు పడకండి నేను ఈ ఇంటి బిడ్డనే అని అంటుంది. ఇద్దరూ సంతోషంగా ఫీలవుతారు. తర్వాత రుక్మిణి రూప ఫొటోకి దండ వేసి దండం పెట్టుకుంటుంది. 

రాజు బంటీని తీసుకొని రూప గదికి వెళ్తాడు. రూపతో తన జ్ఞాపకాలు గుర్తు చేసుకొని ఏడుస్తాడు. బంటి మొత్తం చూసి నాన్న ఇది అమ్మ రూమా అని అడుగుతాడు. అమ్మకి కూడా నాలా పింక్ కలర్ అంటే ఇష్టమా అని అడుగుతాడు. అవును బంటీ కానీ నీలా అమ్మకి కాదు అమ్మ లా నీకు పింక్ ఇష్టం అంటాడు. అక్కడే బాబా బొమ్మ చూసిన బంటీ ఎందుకు ఇలా చేశావ్ బాబా నాకు నువ్వు తెలిసినప్పటి నుంచి నేను కోరుకున్న ఒకే ఒక్క కోరిక మా అమ్మని అడిగాను. ఇచ్చినట్లే ఇచ్చి అమ్మని దూరం చేశావ్ అని ఏడుస్తాడు. బంటీ మాటలకు రాజు చాలా ఏడుస్తాడు. ఇంతలో రుక్మిణి అక్కడికి వస్తుంది. బంటీ మీ నాన్నతో మాట్లాడాలి నువ్వు మీ తాత దగ్గరకు వెళ్లు అని అంటుంది. 

రుక్మిణి రాజుని ఏయ్ రైస్ పీస్ అని పిలుస్తుంది. రాజు షాక్ అయిపోతాడు. నన్ను అలా మా అమ్మాయిగారే పిలవాలి ఇంకెవరూ పిలవొద్దు అని అంటాడు. రైస్ పీస్ మా అమ్మాయిగారికి మాత్రమే అంటాడు. మళ్లీ మళ్లీ రుక్మిణి పిలవడంతో తిడతాడు. దాంతో రుక్మిణి ఒక్కటిస్తుంది. రాజు షాక్ అయిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిన్ని సీరియల్: కావేరికి సీరియస్.. బాలరాజు, కావేరిల కూతురే చిన్ని అని ఉష కావేరి ఒక్కరే అని తెలుసుకున్న దేవా, వల్లి!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలకు ఎక్కువైపోయిన అమ్మవారు! మూడో డోస్ కలిపేసిన అంబిక.. డేంజర్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలకు ఎక్కువైపోయిన అమ్మవారు! మూడో డోస్ కలిపేసిన అంబిక.. డేంజర్!
Nindu Manasulu Serial Today November 17th: నిండు మనసులు: సిద్ధూని మార్చడానికి గణ, ప్రేరణల మాస్టర్ ప్లాన్! గణ ఇంట్లో దీపావళి వేడుక వెనక సీక్రెట్!
నిండు మనసులు: సిద్ధూని మార్చడానికి గణ, ప్రేరణల మాస్టర్ ప్లాన్! గణ ఇంట్లో దీపావళి వేడుక వెనక సీక్రెట్!
Godavari Serial Today November 17th: 'గోదావరి' సీరియల్: జాను సేవలో సంజయ్.. శివుడు పారు ఫిదా! దీపావళి సంబరాల్లో ఫ్యామిలీ.. ఒంటరైన నందు!
'గోదావరి' సీరియల్: జాను సేవలో సంజయ్.. శివుడు పారు ఫిదా! దీపావళి సంబరాల్లో ఫ్యామిలీ.. ఒంటరైన నందు!
Nuvvu leka Neanu Lenu Serial Today NOV 17:భరత్ నిజస్వరూపం తెలుసుకుని రాధ షాక్‌...అనసూయకు పెళ్లి ఇష్టంలేదని విక్కీకి చెప్పేసిన రాధ
నువ్వులేక నేను లేను: భరత్ నిజస్వరూపం తెలుసుకుని రాధ షాక్‌...అనసూయకు పెళ్లి ఇష్టంలేదని విక్కీకి చెప్పేసిన రాధ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Demands Apology: తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Ranu Bombai Ki Ranu Lyrics : రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
మార్కెట్‌లోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు.. Bajaj Pulsar 180కి మళ్లీ బ్రేక్‌!
యూత్‌ఫుల్‌ బైక్‌ బజాజ్ పల్సర్ 180 ఇక కనిపించదా? ఐదేళ్లలో రెండోసారీ అదే పరిస్థితి
MS Dhoni Retires: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
Cheap Liquor Scam: ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
Embed widget