Ammayi garu Serial Today March 29th: అమ్మాయి గారు సీరియల్: విరూపాక్షి ఫోన్‌తో సూర్యప్రతాప్ ఇంట్లో గొడవ.. తండ్రిని బుజ్జగించిన రూప!
Ammayi garu Today Episode సూర్యప్రతాప్ గదికి మాధవి ఫుడ్ తీసుకెళ్లి తినిపించాలని ప్రయత్నించడం రూప చూసి కోప్పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode వశీకరణ మందు కలిపిన ఉగాది పచ్చడి తిన్న గొర్రె రాధిక తన భార్య అని దీపక్‌తో చెప్పి వస్తున్నాయ్ ఫీలింగ్స్ వస్తున్నాయ్ ఫీలింగ్స్ అని పాటలు పాడుతుంది. దీపక్ గొర్రె మీద చిరాకు పడతాడు. నా రాధికా రాధికా అని గొర్రె పాటలు పాడితే రాధిక చుట్టూ ఈ గొర్రె తిరిగితే నేను వీడికి కాపలా ఉండాలా అనుకుంటాడు. రాధిక రాధిక అని దీపక్ నొత్తి బాదుకుంటాడు.
దీపునే పూల కుండీ తోసేశాడని మందారం దీపుని తిడుతుంది. అందరూ సూర్య కోసం ఎదురు చూస్తుంటారు. రాధిక సూర్య వచ్చే ఎలా అయినా సంతకం పెట్టించుకొని వెళ్లిపోవాలని ఒరిజినల్ పీఏ మాధవి వస్తే తన బంఢారం బయట పడిపోతుంది ఆ లోపు తప్పించుకోవాలి అనుకుంటుంది. ఇంతలో సూర్యప్రతాప్, చంద్రలు వస్తారు. రూప తండ్రితో ఎలా ఉంది నాన్న మీరు ఇంత టైం అయినా రాకపోయే సరికి చాలా కంగారుగా ఉందని డాక్టర్ ఏం చెప్పారని అడుగుతుంది. ఏం పర్లేదు అని సూర్యప్రతాప్ చెప్తాడు. సూర్యప్రతాప్ మాధవిని చూసి నువ్వు ఇంకా ఇంటికి వెళ్లలేదా అంటే మీకు ఏమైందో తెలీకుండా ఎలా వెళ్లేది సార్ అని అంటుంది. ఇక మాధవి వెళ్తాను అంటే దీపక్ మాధవిని డిన్నర్‌కి పిలుస్తాడు. మనసులో రా రాధిక నీ అందం చూస్తూ నేను డిన్నర్ చేస్తా అనుకుంటాడు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తారు.
రూప తండ్రికి తినిపిస్తాను అని అంటే సూర్యప్రతాప్ ఒక్క చూపు చూస్తే రూప ఆగిపోతుంది. మీ అమ్మ చేయి విరగొట్టింది నువ్వు మనసు విరగ్గొడతావా అని విరూపాక్షి అడుగుతుంది. విరూపాక్షి గురించి విజయాంబిక తప్పుగా మాట్లాడితే దానికి రాజు అమ్మవారి కళ్లు దున్నపోతు మీద ఉంటే తప్పు లేదు కానీ దున్నపోతు కళ్లు అమ్మవారి మీద ఉండకూడదు అంటాడు. విజయాంబిక షాక్ అయిపోతుంది. దీపక్ మా అమ్మనే అంటావా అని అంటాడు. సూర్యప్రతాప్ అందరినీ ఆపమని అంటాడు. చంద్ర కూడా ఇది గొడవ పడే టైం కాదని ఊరుకోమని అంటాడు. ఇంతలో రూపకి విరూపాక్షి కాల్ చేస్తుంది. అందరూ అది చూస్తారు. ఏం జరిగిందో చూడటానికే ఫోన్ చేసిందని ఇదంతా రాజు, రూప, విరూపాక్షిల ప్లాన్ అని విజయాంబిక అంటుంది. మేమేం ప్లాన్ చేయలేదు అని రూప అంటుంది. రూపకి మళ్లీ విరూపాక్షి కాల్ చేస్తుంది. సూర్యప్రతాప్ విరూపాక్షి వల్లే ఇదంతా అని తిడతాడు. మీరు ఎన్ని చేసినా అమ్మగారికి మీ మీద కోపం లేదని రాజు అంటాడు. మళ్లీ మళ్లీ విరూపాక్షి కాల్ చేయడంతో సూర్యప్రతాప్ కోపంతో ఆ ఫోన్ లిఫ్ట్ చేయ్ మీ నాన్నకి నీ వల్ల చేయి విరిగిపోయింది ప్రాణం పోలేదు అని చెప్పు అని భోజనం చేయకుండా వెళ్లిపోతాడు. దాంతో అందరూ వెళ్లిపోతారు. దీపక్, మాధవి, విజయాంబికలు మాత్రమే తింటారు. దీపక్ మాధవి కాలు గోకుతాడు. మాధవి తిట్టుకుంటుంది. మందారం దీపక్ మాధవిని చూసి సిగ్గు పడటం చూసి కావాలనే దీపక్ భోజనంలో మిరపకాయలు వేసేస్తుంది. దీపక్ తినేస్తాడు. తర్వాత మంట అని గోల గోల చేస్తాడు.
రాజు సుమతో మనం వెళ్లి పెద్దయ్యగారికి తినమని చెప్దామని అంటాడు. నన్ను చూస్తేనే నాన్న తిడతారని రూప అంటే మన ప్రయత్నం మనం చేద్దామని రాజు అందరినీ తీసుకెళ్తాడు. రాజు వాళ్లు వెళ్లే సరికి మాధవి భోజనం తీసుకెళ్లి సార్ మీ ఆరోగ్యం ఈ రాష్ట్రానికి చాలా అవసరం అని తినండి అని చెప్తుంది. ఆ విరూపాక్షి రావడం మీకు ఇష్టం లేదని నాకు ముందే తెలుసుంటే ఆవిడ మెడ పట్టుకొని గెంటేదాన్ని అన గానే రూప రగిలిపోతుంది. మాధవి సూర్యప్రతాప్‌కి తినిపించబోతే రూప మాధవి గారు అని అరిచి ఆపేస్తుంది. నాన్న నా మీద కోపం ఉంటే కొట్టండి కానీ తినొద్దు అని అంటే నీకు ఆ విరూపాక్షి అంటే ఇష్టం కదా తన దగ్గరకే వెళ్లు అంటాడు. దానికి రూప ఏ బిడ్డకు అయినా అమ్మానాన్నలు ఒకటే కదా నాన్న మీరు నా ప్రాణం నాన్న మీరు అలా ఉంటే నా ప్రాణం తట్టుకోలేదు నాన్న అని తినమని చెప్తుంది. అందరూ భోజనం చేయమని చెప్తారు. రూప ముద్దులు కలుపుతూ నాన్న ఇక నుంచి మీరు చెప్పినట్లే ఉంటాను వింటాను భోజనం చేయండి అని గోరు ముద్దలు పెడుతుంది. సూర్యప్రతాప్ తింటారు. అందరూ చాలా సంతోషిస్తారు. ఇక దీపక్ తనకు మాధవి తినిపిస్తున్నట్లు ఊహించుకొని తినేస్తనూ తినేస్తనూ అని కలవరిస్తాడు. సూర్యప్రతాప్‌కి తినిపించిన తర్వాత రూప మందులు వేసి వెళ్తుంది. ఇక రూప అమ్మకి కాల్ చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: సూర్య ఇంటికి ఫైల్‌తో విరూపాక్షి.. జీవన్, మాధవిల ప్లాన్ ఫలిస్తుందా!





















