అన్వేషించండి

Ammayi garu Serial Today March 26th: అమ్మాయి గారు సీరియల్: రాజుని ఇంటికి తీసుకొచ్చిన సూర్య.. సీఎం పీఏ మాధవితో గేమ్ మొదలుపెట్టిన జీవన్!!

Ammayi garu Today Episode సూర్యప్రతాప్‌కి వశీకరణ మందు పెట్టమని జీవన్ మాధవి అలియాస్ రాధికకు చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode సూర్యప్రతాప్‌తో పాటు రాజు ఇంటికి వస్తాడు. అన్నయ్య రాజుని అంగీకరించాడు అని చంద్ర ఇంట్లో వాళ్లతో చెప్తాడు. సుమ, మందారం అందరూ చాలా సంతోషిస్తారు. అదే మనసుతో పింకీ, గోపీలను క్షమిస్తే మాకు ఊరటగా ఉంటుందని సుమ అంటే ఆ రోజు త్వరలోనే వస్తుందని రూప అంటుంది. ఇక చంద్ర ఆ మాటలు ఇప్పుడు వద్దని రాజుని తీసుకొని వెళ్లమని రూపతో చెప్తాడు. 

రాజు, రూపలు కలిసిపోవడంతో సంతోషంగా ఉందని మందారం అంటే విజయాంబిక, దీపక్‌లు రగిలిపోతారు. సీఎం పీఏ మాధవిని చంద్ర రాత్రి అయింది ఇంటికి వెళ్లిపోమని చెప్తాడు. రేపటి షెడ్యూల్ చెప్పి వెళ్తానని మాధవి  చెప్పి విజయాంబిక వాళ్లకు సైగ చేస్తూ వెళ్తుంది. సూర్యప్రతాప్ విరూపాక్షి మాటలు తలచుకుంటాడు.

సూర్యప్రతాప్: పింకీ ప్రేమ విషయం అంగీకరించిన మాట వాస్తవమే కానీ ఆ ఇంటి మనిషిని పెళ్లి చేసుకొని ఒక బిడ్డ బాధ పడుతుంటే మరో బిడ్డను అదే ఇంటికి ఎలా పంపాలి. పింకీ సంతోషంగా ఉండాలి అనే కదా మరో సంబంధం చూశాం. 
రూప: రాజు ఏదైతే ఏంటి నాన్న నిన్ను అంగీకరించడం నాకు చాలా సంతోషంగా ఉంది. 
సూర్యప్రతాప్: నా మాటకు విలువ లేకుండా చేసి పింకీని తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసిన ఆ రాజుని జీవితంలో క్షమించకూడదు అనుకున్నా కానీ నా చేతే ఆ రాజుని ఇంటికి పిలిపించేలా చేశారు.
రాజు: పెద్దయ్య గారు నన్ను మనస్ఫూర్తిగా అంగీకరించలేదు అమ్మాయిగారు కనీసం మనస్ఫూర్తిగా నన్ను ఇంటికి రమ్మని పిలవకుండా చిన్నయ్యగారితో పిలిపించారు.
మాధవి: సీఎం గారు ఫ్రెస్టేషన్‌లో ఉన్నారు ఇప్పుడు నేను మాట్లాడటం కరెక్ట్ కాదు.
రాజు: నేను ఇక్కడ ఉంటే అక్కడ బంటీ ధైర్యంగా ఉండలేడు అమ్మాయిగారు. ఇంతకాలం అమ్మ దగ్గర లేకపోయినా నాన్న దగ్గర ఉండే వాడు. కానీ ఇప్పుడు నేను లేకపోతే ఉండలేడు.
రూప: బంటీ గురించి నాన్నకి చెప్దాం రాజు.
రాజు: బంటీని తీసుకొస్తే పెద్దయ్యగారు అంగీకరిస్తారు కానీ రాఘవ ప్రాణాలకు ప్రమాదం ఉంది. ఇప్పటి వరకు రాఘవని ఏం చేయకుండా ఉన్నారు అంటే దానికి బంటీనే కారణం. 
సూర్యప్రతాప్: రూప నేను మీకు నా మనసులో మాట చెప్పాలి అని వచ్చాను. నేను నా సొంత ప్రయోజనాల కోసం ఎప్పుడూ రాజకీయాలు చేయలేదు. కానీ ఆ విరూపాక్షి అలా కాదు. తను మాత్రం  తను అనుకున్నది చేయాలి అనుకొనే మా పార్టీలో చేరింది. నేను ఓ ప్రజాప్రతినిధిగా ఆ జంట ప్రేమ అంగీకరిస్తే తను నిన్ను అంగీకరించేలా చేసింది. నేను నిన్ను తప్పని పరిస్థితిలో యాక్సెప్ట్ చేశా కానీ మనస్ఫూర్తిగా కాదు.
రాజు: నాకు తెలుసు పెద్దయ్యా.
విజయాంబిక: విరూపాక్షి ఇప్పుడు ఇంతకు మించి ఏం చేయగలదు తమ్ముడు. అలాంటి సభలో ఇలా చేసింది అంటే తన సంస్కారం ఏంటో తెలుస్తుంది.
రూప: అత్తయ్య మీరు సంస్కారం గురించి మాట్లాడొద్దు. మా నాన్న మిమల్ని ఇంటిలో ఉంచింది మీ సలహాల కోసమో మీ ఇంటి పెత్తనం కోసమో కాదు. మీ వల్ల మందారానికి ఏ హాని కలగకూడదు అని ఇంట్లో ఉండనిచ్చారు. మీ హద్దులు తెలుసుకొని ఎంతలో ఉండాలో అంతలో ఉంటే అందరికీ మంచిది.
విజయాంబిక: చూశావా తమ్ముడు మేం చేసిన చిన్న తప్పు వల్ల నేను అందరికీ ఎంత లోకువ అయిపోయానో.
సూర్యప్రతాప్: ఆపు నువ్వు చేసింది చిన్న తప్పు కాదు. క్షమించరాని తప్పు కూడా కాదు.
మాధవి: సార్ నేను మీ ఫ్యామిలీ గురించి చాలా తెలుసుకున్నాను. మీ కూతురు మీ సేవకుడు రాజు వీళ్ల గురించి చాలా తెలుసుకున్నాను. గొప్పగా ఉంది సార్. మీ మాట దాటని కూతురు మీ మాట కోసం అడ్డంగా నిలబడిపోయే మీ పీఏ రాజు. ఈ ప్రపంచంలో ప్రాణంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకొని తల్లిదండ్రుల మాట కోసం దూరంగా ఉండే ఒక్క జంట కనిపిస్తుందా సార్. కానీ అలాంటి జంట మీ ఇంట్లో కనిపిస్తుంది సార్. రాజు గురించి విన్న తర్వాత నేను ఎలా నడుచుకోవాలో తెలిసింది సార్.
సూర్యప్రతాప్: ఆపు మాధవి నువ్వు సీఎంకి మాత్రమే పీఏవీ. ఈ సూర్యప్రతాప్‌కి కాదు. చూడండి ఎవరు ఎంతలో ఉండాలో తెలుసుకొని నడుచుకోండి. నాన్న అన్న మాటలకు బాధ పడొద్దని రూప రాజుతో చెప్తుంది. రాజు రాఘవ గురించి ఆలోచిస్తున్నా అని జీవనే రాఘవని దాచేసుంటాడని అనుకుంటారు. ఉగాది అందరం కలిసి చేసుకోవాల్సింది కానీ మనం ఇక్కడ అత్తయ్య వాళ్లు అక్కడ అని బాధ పడుతుంది. 

జీవన్ మాధవిని కలుస్తాడు. మాధవి అసలు పేరు రాధిక జీవన్ పంపిన ఫేక్ పీఏ అసలైన పీఏ మాధవి స్థానంలో రాధిక వెళ్తుంది. విరూపాక్షితో జాగ్రత్తలు చెప్పిన జీవన్ రాధికకు వశీకరణ మూలికలు ఇచ్చి సూర్యప్రతాప్కి తినేలా చేయమని అప్పుడు ప్రజలు ప్రజలు అనే సూర్యప్రతాప్ మాధవి మాధవి అని నీ వెంట తిరుగుతాడని చెప్తాడు. ఉగాది పచ్చడిలో మూలికలు కలిపేయమని చెప్తాడు. ఎలా అయినా ఈ ప్రయత్నం ఫలించాలి అని చెప్తాడు. అంతేకాకుండా రేపు విరూపాక్షి సూర్యప్రతాప్ ఇంటికి వస్తుందని అప్పుడు ఏం చేయాలో చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: త్రిపుర అఖండ జ్యోతి దీక్ష నెరవేరిందా...? ఆమెకు ఎదురైన అడ్డంకులు ఏంటి..?

టాప్ హెడ్ లైన్స్

Pradeep Rawat Passes Away: ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
Jagadhatri Serial Today August 4th: మర్డర్‌ కేసులో మినిస్టర్‌ కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చిన జేడీ...పోలీసులపై అనుచరుల దాడి
జగద్ధాత్రి సీరియల్: మర్డర్‌ కేసులో మినిస్టర్‌ కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చిన జేడీ...పోలీసులపై అనుచరుల దాడి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 4th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!
Godavari Serial Today August 4th: 'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద సింహాద్రికి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన జాను! అర్ధరాత్రి నందు, మురళీ రొమాన్స్!
'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద సింహాద్రికి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన జాను! అర్ధరాత్రి నందు, మురళీ రొమాన్స్!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Embed widget