Ammayi garu Serial Today June 9th: అమ్మాయి గారు: అర్ధరాత్రి అమ్మాయితో అడ్డంగా దొరికిపోయిన సీఎం అల్లుడు.. సూర్య, రూప రియాక్షన్ ఏంటి?
Ammayi garu Today Episode రాజు ఓ అమ్మాయితో రాత్రి పూట తుప్పల్లో మీడియాకు దొరికిపోవడం సూర్యప్రతాప్ ఇంట్లో వార్త రచ్చ అవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రాజుకి రెండో పెళ్లి చేయాలని సూర్యప్రతాప్ అనుకొని అందరికీ విషయం చెప్తారు. పంతులు కీర్తి అనే ఓ అమ్మాయి గురించి చెప్తారు. రాజు పంతులుతో విషయం చెప్పాలి అనుకొని బయల్దేరుతాడు. రాత్రి రాజు పంతుల్ని కలవడానికి వెళ్తుంటే ఓ అమ్మాయిని కొందరు రౌడీలు వెంట పడి తనని ఇబ్బంది పెడుతుంటారు.
రాజు అది చూసి పంతుల్ని తర్వాత కలవొచ్చని అనుకొని ఆ అమ్మాయిని కాపాడుతాడు. రౌడీలు ఆ అమ్మాయి డ్రస్ చింపేయడంతో రాజు తన షర్ట్‌ని ఆ అమ్మాయికి ఇస్తాడు. ఆ అమ్మాయి రాజుకి థ్యాంక్స్ చెప్తుంది. గుడికి వెళ్లి వస్తుంటే కామెంట్స్ చేసి వెంట పడ్డారని చెప్తుంది. పోకిరీ వెధవలు కామెంట్స్ చేస్తే చెప్పుతో కొట్టాలని ఇలా ఎవరూ లేని ప్రదేశానికి రాకూడదని అంటాడు. అమ్మాయితో రాజు మాట్లాడుతుంటే ఇంతలో పోలీసులు వస్తారు. రాజుని చూసి మీరా సార్ మీరు ఏంటి ఇలా తుప్పల్లో దుకాణం పెట్టేశారు అని అంటారు. పోలీసులు రాజుని ఇంటికి వెళ్లిపోమని ఆ అమ్మాయిని స్టేషన్‌కి తీసుకెళ్తానని అంటారు. రాజు పోలీసులకు విషయం చెప్తే పోలీసులు సారీ చెప్తారు. మీరు ఉన్న ప్లేస్ బట్టి మీరు ఉన్న పరిస్థితి బట్టి ఇలా తప్పుగా అనుకున్నాం అని పోలీసులు చెప్తారు.
పోలీసులు రాజుని ఇంటికి వెళ్లమని ఆ అమ్మాయిని ఇంటి దగ్గర దింపేస్తాం అని తనని తీసుకెళ్తారు. ఇక రాజు షర్ట్ లేకుండా పంతుల్ని ఎలా కలవాలి ఈ అవతారంతో వెళ్లలేం కదా రేపు కలుస్తాలే అని అనుకొని ఇంటికి వెళ్లిపోతాడు. ఉదయం సూర్యప్రతాప్ బంటీని టిఫెన్ తినడానికి తీసుకొస్తూ అన్ని జాగ్రత్తలు చెప్తాడు. రుక్మిణి చలకీగా బంటీకి విష్ చేస్తుంది. బంటీ గుడ్ మార్నింగ్ అమ్మ అనబోయి అ అని ఆగిపోతాడు. రుక్మిణి షాక్ అయిపోతుంది. సూర్యప్రతాప్ బంటీని సుమకి అప్పగిస్తుంది. రుక్మిణి బంటీకి పాలు తాగిస్తా అంటే సుమ వద్దు అంటుంది. నువ్వు బంటికీ చాలా దగ్గరైపోతున్నావ్ నువ్వు పెళ్లి చేసుకొని వెళ్లిపోతే మేం వాడిని మార్చలేం అమ్మా నువ్వు బంటీకి దూరంగా ఉండు అని అంటుంది.
రుక్మిణి సుమతో చిన్నమ్మ నేను బంటీకి దూరంగా ఉండను ఉండలేను ఆ పాలు ఇవ్వు తాగిస్తా అంటే సూర్యప్రతాప్ రుక్మిణితో నువ్వు బంటీకి దూరంగా ఉండు అమ్మ అంటాడు. నేనేం తప్పు చేశాను నాయనా అని రుక్మిణి అడుగుతుంది. ఇక బంటీ అయితే తాతయ్య నన్ను కూడా దీపులా హాస్టల్‌లో పెట్టేయ్ అంటాడు. సూర్యప్రతాప్ పేపర్ చూసి షాక్ అయి రాజు అని గట్టిగా అరుస్తాడు. ఆనంద్‌తో మాట్లాడుతూ ఉన్న రాజు పెద్దయ్య గారు పిలుస్తున్నారు పద అంటాడు. వెళ్లి ఏంటి పెద్దయ్యా అంటే సూర్యప్రతాప్ పేపర్ చూపించి ఏంట్రా ఇది అని అంటాడు. రాజు పేపర్ చూసి షాక్ అయిపోతాడు. అందులో అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ దొరికిపోయిన సీఎం సూర్యప్రతాప్‌దేవ్ గారి అల్లుడు రాజు అని న్యూస్ ఫొటో తో పాటు వస్తుంది. తర్వాత రుక్మిణి చూసి షాక్ అయిపోతుంది.
విజయాంబిక సూర్యప్రతాప్‌తో రాజులో ఈ యాంగిల్ కూడా ఉందని మాకు ఇప్పుడే అర్థమైంది అని అంటుంది. రూప చనిపోయింది అన్న బాధ కూడా లేకుండా ఇలా అడ్డమైన పనులు చేస్తూ దొరికిపోయాడు అని దీపక్ అంటాడు. ఇలాంటి పనికి మాలిన పనులకు ముందు వెనక మీ మామయ్య పేరు వేసేస్తున్నారని అంటుంది. చంద్ర అక్కతో రాజు మనకు చిన్నప్పటి నుంచి తెలుసు ఇలాంటి పని రాజు చేయడు అని కూడా తెలుసు కదా అంటాడు. ప్రజలంతా చూశారని ప్రతిపక్షాలు మీడియా ఊరుకోదు కదా అని విజయాంబిక అంటుంది. దానికి సూర్యప్రతాప్ ఎవరూ రాజు గురించి ఏం మాట్లాడకు అని అంటాడు. రుక్మిణి కూడా బావగారు నిప్పు ఇలా చేయడు అని అంటుంది.
విజయాంబిక రుక్మిణితో నీకు రాజు గురించి ఏం తెలీదు.. మీ అక్కని పెళ్లి చేసుకుని మరో అమ్మాయితో పెళ్లికి రెడీ అయిపోయాడు అని అంటుంది. ఇక దీపక్ రాజుతో మామయ్య పెళ్లి సంబంధం తీసుకొచ్చారు కదా ఇంతలో ఈ తప్పు ఏంటి అని అంటే.. సూర్యప్రతాప్ దీపక్‌ని తిడతాడు. అలాంటి వంకర బుద్ధి నీది. భార్య అడ్డు తొలగించుకొని ఇంకో అమ్మాయితో పెళ్లికి సిద్ధపడిన మీకు రాజు క్యారెక్టర్ గురించి మాట్లాడే అర్హత లేదు రాజు కాలి గోటికి మీరు సరిపోరు అని అంటాడు.
రుక్మిణి అత్తతో నేను ఇంటికి వచ్చిన రోజే ఈ వెధన నాతో తప్పుగా ప్రవర్తించాడు అది మీ బుద్ధి అని తిడుతుంది. ఈ మధ్య ఇలాంటి ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్నారు. ఇందులో ఉన్నది నువ్వు కాదని చెప్పు అని అంటే రాజు అది తానే అని చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు. రాజు జరిగింది చెప్తాడు. దీపక్ దానికి అమ్మాయిని కాపాడటానికి బట్టలు విప్పుకోవాలా అని అంటాడు. సూర్యప్రతాప్ దీపక్ నోరు మూయిస్తాడు. రాజు ఆ అమ్మాయి బట్టలు చిరిగిపోతే ఇచ్చానని చెప్తాడు. సాయం చేసిన నీ గురించే ఇంత చెండాలంగా మాట్లాడుకున్నారు అంటే ఆ అమ్మాయి గురించి ఇంకెంత తప్పుగా మాట్లాడుకుంటారో అని రుక్మిణి అంటుంది. ఇంతలో పంతులు వస్తారు. రాజుని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టమే అని అమ్మాయి చెప్పిందని కానీ తనని దురదృష్టం వెంటాడిందని ఆ అమ్మాయి ఎవరితోనో చేయరాని పనులు చేసి దొరికిపోయిందని వార్తలు వచ్చాయి. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందని చావు బతుకుల మధ్య ఉందని చెప్తారు. సూర్యప్రతాప్ వెంటనే టీవీ ఆన్ చేయిస్తారు. అందులో రాజు, ఆ అమ్మాయి గురించి వస్తుంది. ఆ కీర్తినే రాజుకి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్న అమ్మాయి. ముందు ఆ అమ్మాయిని కాపాడాలని అనుకొని సూర్యప్రతాప్ వాళ్లు హాస్పిటల్‌కి వెళ్తారు.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీ, విహారిల రహస్యం ఆదికేశవ్‌కి తెలిసిపోతుందా.. క్షణక్షణం ఉత్కంఠ!





















