Ammayi garu Serial Today June 18th: ఆనంద్ సంచలన నిర్ణయంతో సూర్య ఇంట్లో పెను మార్పు.. ఆనంద్ కోసం రుక్మిణి ఏం చేసిందంటే?
Ammayi garu Today Episode ఆనంద్‌ని సూర్యప్రతాప్ చంపడానికి గన్ గురి పెట్టడం రుక్మిణి ఆపడానికి ఆనంద్ తనని మోసం చేశాడని ఇంటి నుంచి గెంటేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode ఆనంద్ రాఘవ కొడుకని ఆనంద్‌తో ఇదంతా చేయించింది విరూపాక్షే అని విజయాంబిక ఇరికించేస్తుంది. ఇదంతా నీకు తెలిసి జరిగిందా విరూపాక్షి అని సూర్యప్రతాప్ అడుగుతాడు. విరూపాక్షి దొరికిపోతుందని ఎలా అయినా తప్పించాలని అందుకు అబద్ధం చెప్పాలని ఆనంద్ అనుకుంటాడు.
ఆనంద్ సూర్యతో తాను రుక్మిణిని ప్రేమించడం అబద్ధం అని రుక్మిణి కూడా మీ కూతురు రూపలా ఉంది కాబట్టి మీ కూతురు అయిండొచ్చని ప్రేమించినట్లు నటించాను అని చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు. నా ప్రేమ ప్రయాణంలో నా అనుమానం నిజం అయింది రుక్మిణి మీ కూతురు అని తెలిసిందని మిమల్ని మీ భార్యని కలపాలి అని నన్ను వద్దు అనుకుంది. వాస్తవానికి మోసం నా రక్తంలో కాదు మీ రక్తంలో ఉందని అని ఆనంద్ అంటాడు. సూర్యప్రతాప్ కోపంగా చూస్తాడు. మీరు మా నాన్నని అనుమానించి అవమానిస్తే మీ కూతురు నా ప్రేమని కాదని నన్ను అవమానించి గెంటేసింది. మా ఇంటికి దూరం అయిన నాన్న పడిన బాధ మీరు పడాలి అని పిల్లల్ని పెంచడానికి కష్టపడిని మా అమ్మ పడిన బాధ రుక్మిణి పడాలి అని ప్లాన్ చేశా అని చెప్తాడు.
విజయాంబిక దీపక్‌తో వీడు ఏంట్రా విరూపాక్షిని కాపాడటం కోసం ఇన్ని అబద్ధాలు ఆడుతున్నాడు అని అంటుంది. విరూపాక్షిని కాపాడటానికి పాపం ఆనంద్ అంతా తానే పథకం ప్రకారం సూర్యప్రతాప్ మీద పగ తీర్చుకోవడానికి చేసినట్లు చెప్తాడు. దాంతో సూర్యప్రతాప్ ఆనంద్‌ని కొడతాడు. నా జోలికి వస్తే ఊరుకుంటా కానీ నా కూతురి జోలికి వస్తే ప్రాణాలు తీస్తాను అని అంటాడు. చంద్రని గన్ తీసుకురమ్మని అంటాడు. ఆనంద్‌ని చంపడానికి గన్ గురి పెడతాడు. దీపక్, విజయాంబికలు చంపేయమని అంటారు.
సూర్యప్రతాప్ ఆనంద్‌ని గన్ గురి పెడతాడు. రాజు, రూప, విరూపాక్షిలు షాక్ అయి చాలా టెన్షన్ పడతారు. ఆనంద్‌ని కాపాడటానికి రుక్మిణి వెళ్లి తండ్రిని ఆపుతుంది. కావాలనే తను యాక్ట్ చేస్తుంది. నన్ను ప్రేమించింది అబద్దమా ఆనంద్.. నేను నిన్ను నమ్మాను కదరా నన్ను మోసం చేయాలి అని ఎలా అనిపించింది అని ఏడుస్తుంది. నేను ప్రేమించాను అనే కారణంతో మా నాన్న నువ్వు ఎవరో తెలుసుకోకుండా పెళ్లికి ఒప్పుకున్నాడు మా నాన్నని ఎలా మోసం చేయాలి అనిపించింది అంటుంది. సూర్యప్రతాప్ చంపేస్తా వాడితో మాటలు ఏంటి అంటే రుక్మిణి ఆపి నీ ముఖం చూడాలి అంటే అసహ్యంగా ఉందిరా.. జీవితంలో నీ ముఖం చూపించకు ఆనంద్‌ని ఈడ్చుకుంటూ వెళ్తూ ఆనంద్‌తో చిన్నగా మమల్ని క్షమించు ఆనంద్ నువ్వు ఇంత సాయం చేసినా నీకు ఏం చేయలేకపోయాం అని సారీ చెప్పి ఆనంద్‌ని పంపేస్తుంది. ఎవరూ చూడకుండా ఆనంద్‌కి దండం పెడుతుంది.
ఆనంద్ ఉసురుమని వెళ్లిపోతాడు. ఆనంద్‌కి జరిగిన అవమానానికి రుక్మిణి కన్నీరు పెట్టుకుంటుంది. తర్వాత తండ్రి దగ్గరకు వచ్చి నా పెళ్లి ఆగిపోయింది అని బాధ పడకు నాన్న నీకేం కాలేదు నాకు అదే చాలు అంటుంది. కీర్తి అలియాస్ జీవన్ పంపిన దీప్తి తన పెళ్లి కూడా వాయిదా వేయమని కోరుతుంది. విజయాంబిక దీప్తిని ఏంటే ఇలా చెప్పావ్ అని కసరుకుంటుంది. పర్లేదు అని కీర్తి సైగ్ చేస్తుంది. సుమ సూర్యప్రతాప్‌తో రుక్మిణికి మంచి సంబంధం దొరికిన తర్వాతే 2 పెళ్లిళ్లు చేద్దాం అంటుంది. సూర్యప్రతాప్ రుక్మిణి పెళ్లి ఆగదు అని అనుకున్న టైంకి రెండు పెళ్లిళ్లు జరుగుతాయని అందరికీ షాక్ ఇస్తాడు.
రాజు వాళ్లు ఆనంద్ గురించి మాట్లాడి చాలా బాధ పడతారు. విజయాంబిక, దీపక్‌లు చాలా ఎక్కువ చేశారని దీపక్ చాలా ఎక్కువ కొట్టాడని బాధ పడతారు. వాళ్లకి అడ్డు వచ్చిన వాళ్ల అందరి విషయంలో ఆ తల్లీకొడుకులు ఇలాగే చేస్తున్నారని అనుకుంటారు. విరూపాక్షి రాజు వాళ్లతో నా కోసం మీరు చేసింది చాలు ఇక అంతా ఆపేయండి అని అంటుంది. ఆనంద్ మోసం చేశాడు అంటేనే పెద్దయ్య గారు తట్టుకోలేకపోయారు ఇప్పుడు మనం మోసం చేస్తున్నామని తెలిస్తే ఇంకెలా ఉంటుందో అని రాజు అంటాడు. అసలు పెద్దయ్యగారి మనసులో ఏం ఉందో తెలుసుకోవాలి అంటాడు.
సూర్యప్రతాప్ ఆలోచిస్తూ ఉంటే చంద్ర, బంటీ, సుమ సూర్యప్రతాప్ దగ్గరకు వెళ్తారు. బంటీ తాతతో రుక్మిణి అమ్మ మనతోనే ఉంటే బాగుంటుంది రుక్మిణి అమ్మని నాన్నకి ఇచ్చి పెళ్లి చేయండి అని అడుగుతాడు. బంటీకి ఏం ఆలోచించకు అని సూర్యప్రతాప్ చెప్పి పడుకోపెడతాడు. తర్వాత సూర్యప్రతాప్ బంటీ చెప్పిన మాట ఆలోచిస్తూ నా మనసులో ఉన్న ఆలోచనే నీ నోట వచ్చింది కానీ మీ తాత మాట మీద నిలపడే మనిషి ఆ మాట ప్రకారం కీర్తికి మీ నాన్నకి పెళ్లి చేస్తా అంటాడు. కీర్తి, విజయాంబిక, దీపక్‌లు మాట్లాడుకుంటారు. రుక్మిణికి సగం నీకు సగం ఆస్తి వస్తుంది అని దీపక్ అంటే నీకు నాకు దీపక్ మనకు అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: రాఘవని కలిసి ఎమోషనలైన ఆనంద్.. లొకేషన్‌కి చేరుకున్న రాజు, రూపలు.. ఏం జరుగుతుంది?





















