అన్వేషించండి

Ammayi garu Serial Today June 17th: కథ తిప్పేసిన వాచ్‌.. ఆనంద్ రాఘవ కొడుకని సూర్య ముందు గేమ్ స్టార్ట్‌ చేసిన తల్లీకొడుకులు!

Ammayi garu Today Episode ఆనంద్ వాచ్‌లో రాజుకి కాల్ చేశాడని తెలుసుకున్న దీపక్ సూర్య ముందు ఆనంద్‌ రాఘవ కొడుకని చెప్పేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రాఘవ ఆనంద్‌ని కలుస్తాడు. రాజు, రూపలు ఆనంద్ చేతికి ఉన్న వాచ్ ఆధారంగా లొకేషన్‌కి చేరుకుంటారు. రాజు వాళ్లు చూసి అండర్ గ్రౌండ్‌లో ఉన్నారని వెళ్తారు. అక్కడ చూసే సరికి మొత్తం పొగ ఉంటుంది. రాఘవ, ఆనంద్, విజయాంబిక, దీపక్ వాళ్లు ఉండరు. ఎవరూ లేరేంటి సిగ్నల్స్ ఇక్కడే చూపించాయి కదా అంటే రాజు రూపతో మనం వచ్చినట్లు వాళ్లకి తెలిసిపోయినట్లు ఉంది ఆనంద్‌ని, రాఘవని తీసుకొని వెళ్లిపోయారని అనుకుంటారు. 

దీపక్ ఓ చోటుకి ఆనంద్, రాఘవ వాళ్లని తీసుకెళ్లి ఆనంద్‌ని దీపక్ చితక్కొడతాడు. మమల్నే మోసం చేస్తావా తల్లీకొడుకులు ఇద్దరూ ఆనంద్‌ని కొడతారు. రూప వాళ్లు ఇంకా లొకేషన్ చూపిస్తుందని ఫాలో అవుతారు. దీపక్ ఆనంద్‌తో నువ్వు మా నాన్నతో మాట్లాడినప్పుడు వీడియో తీసుకోవడం వల్ల మాకు నిజం తెలిసింది. నీలాంటి మబ్బు ముఖం ష్మార్ట్ వాచ్ కట్టినప్పుడే అనుమానం వచ్చిందిరా.. అని వాచ్‌లో ఆనంద్ రాజుకి కాల్ చేసినట్లు చూసి తప్పించుకుంటారు. 

దీపక్ ఆనంద్‌ని చంపేస్తానని అంటే విజయాంబిక వద్దని మీ మామయ్యకి మన మీద అనుమానం వస్తుందని మామయ్య దగ్గర ఇరికిద్దాం అని ఆనంద్‌ని ఇంటికి తీసుకెళ్తారు. రాఘవని రౌడీలకు అప్పగించి వెళ్లిపోతారు. రాజు, రూపలు లొకేషన్‌కి చేరుకొని అక్కడ వాచ్‌ చూసి తమ ప్లాన్ విజయాంబిక వాళ్లకి తెలిసిపోయిందని ఆనంద్‌ పెద్దయ్యగారి మనిషి కాబట్టి ఇంటికే తీసుకెళ్లుంటారని ఇద్దరూ ఇంటికి వెళ్తారు. ఇంటి దగ్గర మందరాం, విజయాంబిక కంగారు పడుతుంటారు. 

ఆనంద్‌ని దీపక్ వాళ్లు లాక్కొని వచ్చి సూర్యప్రతాప్‌ని పిలుస్తారు. ఆనంద్‌ని సూర్యప్రతాప్‌ కాళ్ల దగ్గర పడేస్తారు. సూర్యప్రతాప్‌ ఆనంద్‌ని పైకి లేపి ఏంటి దెబ్బలు ఏమైంది అని అడుగుతారు. ఆనంద్ మన వాడు కాదు మన పగ వాడు అని దీపక్ చెప్తాడు. రాజు, రూపలు ఇంటికి వస్తారు. సూర్యప్రతాప్‌ విషయం క్లారిటీగా చెప్పండి అంటారు. విజయాంబిక విరూపాక్షిని చూసి చెప్పు విరూపాక్షి వీడు ఎవడో ఈ ఇంటికి ఎందుకు వచ్చాడో నీకు తెలుసు కదా చెప్పు అంటుంది. సూర్యప్రతాప్‌ కూడా విరూపాక్షిని అడుగుతాడు. 

విరూపాక్షి చాలా టెన్షన్ పడుతుంది. రుక్మిణిగా రూప వచ్చి ఆనంద్ నన్ను ప్రేమించిన వాడు నన్ను పెళ్లి చేసుకోబోయిన వాడు అని ఆనంద్ దెబ్బలు చూసి ఏమైంది అని అంటుంది. విజయాంబిక సూర్యప్రతాప్‌తో వీడు రుక్మిణిని ప్రేమించలేదు తమ్ముడు ప్రేమించినట్లు నటించాడు. నిన్ను దెబ్బ తీయడానికి ఆ ప్లాన్ చేశాడు. వీడు ఒక్కడే ఈ నాటకం ఆడటం లేదు విరూపాక్షి, రుక్మిణి, రాజుల పాత్ర ఉంది అని చెప్తుంది. సూర్యప్రతాప్‌ ఏం అర్థం కాలేదు అంటాడు. దాంతో దీపక్ ఆనంద్ రాఘవ కొడుకు అని చెప్తాడు. 

ఆనంద్ రాఘవ కొడుకు అని తెలిసి సూర్యప్రతాప్‌ బిత్తరపోతాడు. అందరూ సూర్యప్రతాప్‌కి నిజం తెలిసిపోయిందని షాక్ అవుతారు. వాళ్ల నాన్నకి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికే ఇలా నాటకం ఆడుతున్నాడని అంటుంది. ఆనంద్ తన తండ్రి రాఘవ కాదు అని అసలు అతను ఎవరో తనకు తెలీదు అంటాడు. రుక్మిణి కూడా తనకు రాఘవ ఎవరో తెలీదు అంటుంది. సూర్యప్రతాప్‌ విజయాంబిక, దీపక్‌లను గెంటేస్తానని వెళ్తే విజయాంబిక  ఆనంద్, రాఘవతో మాట్లాడిన వీడియో చూపిస్తుంది. ఆనంద్ ప్రతీకారం తీర్చుకుంటానన్న మాటలు వినిపిస్తారు. 

సూర్యప్రతాప్‌ షాక్ అయిపోతాడు. సూర్యప్రతాప్‌ ఆనంద్‌ని కొడతాడు. ఏ ముఖం పెట్టుకొని నా గుమ్మంలో అడుగుపెట్టావురా.. రుక్మిణిని ప్రేమ పేరుతో ఎందుకు నాటకం ఆడావురా అని అడుగుతారు. ఆనంద్‌ని సూర్యప్రతాప్ చంపేస్తాడని అడ్డుకోవాలని విరూపాక్షి వెళ్లబోతే ఆనంద్ అడ్డుకొని నేను రాఘవ కొడుకునే అని అంటాడు. మీ మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు కానీ మా నాన్న మమల్ని వదిలేసి వెళ్లిపోయినట్లు మాత్రమే తెలుసు సార్.. కానీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరు సార్ వీళ్లు కాదా.. ప్రతీకారం గురించి వీళ్లు చెప్తేనే తెలిసింది. రుక్మిణిని పెళ్లి చేసుకొని ఆస్తి ఇవ్వమని అన్నారని అంటాడు. 

విజయాంబిక వెంటనే దొరికిపోయాను అని మరో వీడియో చూపిస్తుంది. అందులో ఆనంద్‌ సూర్యప్రతాప్‌ మీద పగ తీర్చుకుంటా మీ కాళ్లు పట్టించుకుంటా అని అన్న మాటలు వింటాయి. ఇక రాజు విజయాంబికతో అసలు మీకు రాఘవ గురించి ఎలా తెలుసు. అక్కడ రాఘవ ఉన్నాడని మీకు ఎవరు చెప్పారు అని రాజు అడుగుతాడు. దాంతో దీపక్ రుక్మిణి ప్రేమ గురించి తెలుసుకొని వీడిని కనుక్కొని తీసుకొచ్చామని కానీ వీడు విరూపాక్షితో మాట్లాడుంటే అనుమానం వచ్చింది ఉదయం వాడు బయటకు వెళ్తే ఫాలో అయ్యాం అసలు విషయం తెలిసింది. దీని వెనక ఉంది విరూపాక్షి అని మా అనుమానం అని చెప్తుంది. సూర్యప్రతాప్‌ కోపంగా ఇదంతా నీకు తెలిసే జరుగుతుందా విరూపాక్షి అని అడుగుతాడు. అమ్మగారు నిజం చెప్తే మళ్లీ అన్యాయం అయిపోతారు అదేదో నేను అబద్ధం చెప్తా అని ఆనంద్ అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: రాఘవని కలిసి ఎమోషనలైన ఆనంద్.. లొకేషన్‌కి చేరుకున్న రాజు, రూపలు.. ఏం జరుగుతుంది?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Bangladesh Protest:బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Bangladesh Protest:బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
Chiranjeevi : మెగాస్టార్ న్యూ స్టైలిష్ వింటేజ్ లుక్ - చిరు అభిమానులకు ఫుల్ కిక్
మెగాస్టార్ న్యూ స్టైలిష్ వింటేజ్ లుక్ - చిరు అభిమానులకు ఫుల్ కిక్
Bangladesh Protest : బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి దారుణ హత్య! సజీవ దహనం చేసిన అల్లరి మూకలు!
బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి దారుణ హత్య! సజీవ దహనం చేసిన అల్లరి మూకలు!
Balakrishna : 'వారణాసి'లో బాలయ్య - కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో 'అఖండ 2' టీం... ఫోటోలు వైరల్
'వారణాసి'లో బాలయ్య - కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో 'అఖండ 2' టీం... ఫోటోలు వైరల్
Avatar Fire And Ash Box Office Day 1: ఇండియాలో రికార్డుల దిశగా 'అవతార్ 3' కలెక్షన్లు... మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందంటే?
ఇండియాలో రికార్డుల దిశగా 'అవతార్ 3' కలెక్షన్లు... మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందంటే?
Embed widget