Ammayi garu Serial Today January 22nd: అమ్మాయి గారు సీరియల్: బంటీ రూప, రాజుల కొడుకని పింకీకి తెలిసిపోతుందా.. కూతుర్ని వెలివేసిన సూర్య!
Ammayi garu Today Episode రూప తండ్రితో మాట్లాడటానికి వెళ్లడం సూర్య రూపని తనని నాన్న అని పిలవొద్దని ఎదురు పడొద్దని అలా చేస్తే చనిపోతానని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode బంటీని సీఎం కూతురు రూప పోలీసులతో వచ్చి తీసుకెళ్లిపోయిందని రౌడీలు జీవన్‌కి చెప్తారు. జీవన్ వాళ్లని తిట్టి పంపేస్తాడు. బంటీ గురించి రూపకి ఎలా తెలిసిందని అనుకుంటాడు. ఇక విజయాంబిక, దీపక్‌లు బంటీ గురించి అడగటానికి జీవన్‌కి కాల్ చేస్తారు. జీవన్ బంటీ తప్పించుకున్నాడని రూపకి విషయం తెలిసి తప్పించిందని చెప్పగానే తల్లీకొడుకులు షాక్ అయిపోతారు.
విజయాంబిక దీపక్‌తో తామే బంటీని కిడ్నాప్ చేయించామని రూపకి తెలిస్తే ప్రమాదమని రూప దగ్గర జాగ్రత్తగా ఉండాలని అనుకుంటారు. ఇక రాజు ఇంటి దగ్గర అందరూ రాజు వాళ్ల కోసం ఎదురు చూస్తుంటారు. గోపీ, పింకీ రాగానే హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తారు. పేర్లు చెప్పుకొని రావాలని రాజు అక్క వరాలు కొత్త జంటని ఆటపట్టిస్తుంది. ఇద్దరూ పేర్లు చెప్పుకొని లోపలికి వస్తారు. విరూపాక్షి కొత్త జంటని దేవుడి దగ్గరకు తీసుకెళ్లి దండం పెట్టిస్తుంది. పెద్దయ్య గారు ఏమన్నారు అని రాజుని అడుగుతారు.
రాజు: ఏమంటారు నాన్న ఎప్పటిలానే నన్ను మోసగాడు అని దుర్మార్గుడు అన్నారు కానీ ఈ సారి నాకు గన్ గురి పెట్టారు.
గోపీ: కానీ శివుడిని చూడాలి అంటే నంది అడ్డుగా ఉన్నట్లు వదిన అన్నయ్యకు అడ్డుగా నిల్చొంది.
పింకీ: ఆ తర్వాత పెద్ద నాన్న కోపం అంతా అక్క మీదకు మళ్లింది.
అప్పలనాయుడు: పాపం మళ్లీ అమ్మాయిగారే బలి అయ్యారన్నమాట.
విరూపాక్షి: నాకు తెలుసు సూర్య ఒప్పుకోడు అని ఒకవేళ ఒప్పుకున్నా ఆ విజయాంబిక, దీపక్‌లు ఒప్పుకోనివ్వరు. ఆ భగవంతుడు వీళ్లని ఒక్కటి చేసి వాళ్లని దూరం చేశాడు. అనవసరంగా వీళ్లని అక్కడికి తీసుకెళ్లావ్ రాజు.
రాజు: అమ్మగారు వీళ్లని అక్కడికి తీసుకెళ్లింది ఆశీర్వాదం కోసమే కాదు వీళ్లకి పెళ్లి అయింది అని తెలియడానికి చిన్నమ్మగారికి చిన్నయ్య గారికి వీళ్లని చూపించాలి అని తీసుకెళ్లాను.
విరూపాక్షి: మంచి పని చేశావ్ రాజు. కన్నవాళ్లు పైకి ఆశీర్వదించకపోయినా లోపల ఆశీర్వదిస్తారు.
ఏదో ఒక రోజు వాళ్లు మీకు అర్థం చేసుకుంటారని రాజు అంటాడు. ఇక గోపీ రాజు వాళ్లతో మా వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు ఇంకా ఇబ్బంది పెట్టాలని లేదు బయటకు వెళ్లిపోతాం అని అంటాడు. దానికి రాజు వద్దని చెప్తాడు. మీ ఇద్దరికీ బయట ఉండే శక్తి ఉన్నా మాకు మిమల్ని వదిలి ఉండే శక్తి లేదని ఇక్కడే ఉండమని అంటాడు. అందరూ వాళ్లలోనే గోపీ, పింకీలను ఉండమని చెప్తారు. ఇక బంటీ వస్తాడు. బంటీ నాన్న అని పిలవబోతే రాజు పింకీ వినకుండా ఆపుతాడు. ఇక బంటీ రేపు తన పుట్టిన రోజు అని చెప్తాడు. దాంతో రాజు రేపు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేద్దామని చెప్తాడు. రాజు ఇంట్లో వాళ్లతో బంటీ తన కొడుకు అని పింకీకి తెలీకుండా జాగ్రత్త పడమని చెప్తాడు.
రూప ఏడుస్తూ రేపు నా కొడుకు పుట్టి ఆరేళ్లు అవుతుందని వాడు బతికి ఉండి ఉంటే వాడి పుట్టిన రోజు గ్రాండ్‌గా జరిపేవాళ్లమని రాజు తాను కలిసే ఉండేవాళ్లని బాధపడుతుంది. ఇంతలో పింకీ కాల్ చేసి రూపకి సారీ చెప్తుంది. అందరూ హ్యాపీగా ఉన్నారని పింకీ చెప్తుంది. అందరూ బాగా చూసుకుంటున్నారని చెప్తుంది. మా కోసం నువ్వు బాధ పడుతున్నావ్ అక్క సారీ అని చెప్తుంది. దాంతో రూప నాకు నాన్నకి ఇది అలవాటే అని నాన్న నేను కొన్నిరోజులకి సెట్ అయిపోతామని అంటుంది. పింకీకి సంతోషంగా ఉండమని చెప్తుంది. పింకీ తల్లిదండ్రుల గురించి అడుగుతుంది.
రూప పింకీకి ధైర్యం చెప్పి కాల్ కట్ చేస్తుంది. తర్వాత రూప తండ్రి దగ్గరకు వెళ్తుంది. జరిగింది తలచుకొని కోపంగా ఉన్న సూర్య రూప నాన్న అని పిలవగానే కోపంగా చూస్తాడు. రూప క్షమాపణ అడిగి కాళ్ల మీద పడితే సూర్య కోపంగా ముట్టుకోకు అని నన్ను నాన్న అని పిలవకు అని ముఖం చూడాల అంటే అహస్యంగా ఉందని తిడతాడు. నీ లాంటి కూతురు వల్ల తల దించుకోవడం కంటే తల తెంచుకోవడం బెటర్ అంటాడు. ఇంకోసారి తనని నాన్న అని పిలిచినా తన గదిలోకి వచ్చినా ఎదురు పడినా చనిపోతానని అంటాడు. దాంతో రూప ఏడుస్తూ మీరు చెప్పినట్లే చేస్తానని ఏడుస్తూ వెళ్లిపోతుంది. ఇక విజయాంబిక, దీపక్‌లు చంద్ర, సుమలను ఓదార్చడానికి ప్రయత్నిస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: కొత్త లవర్‌తో సత్య సరసాలు.. తలపట్టుకున్న క్రిష్.. అయ్యో పాపం అజ్ఞాతశక్తి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

