Ammayi garu Serial Today December 31st: అమ్మాయి గారు సీరియల్: గుడిలో రాజు ఫ్యామిలీని రూప ఎదురు పడుతుందా.. నిజాలు బయట పడతాయా!
Ammayi garu Today Episode రూప వాళ్లు వచ్చిన గుడికే రాజు ఫ్యామిలీ రావడం రూప బంటీని తన ఫ్యామిలీకి పరిచయం చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Ammayi garu Serial Today Episode బంటి పింక్ కలర్, అమ్మ గురించి ఇంట్లో వాళ్లకి అడుగుతాడు. ఎవరి ఫొటోనో ఇంట్లో ఉంది మా అమ్మ ఫొటో లేదని అడుగుతాడు. ఇంతలో రాజు రావడంతో బంటీ భయంతో ఎవరూ ఈ విషయాలు నాన్నతో చెప్పొద్దని అంటాడు. రాజు వచ్చి బంటి గురించి అడిగితే పడుకున్నాడని చెప్తారు. ఇక రాజు ఆ ఇంటి వాళ్ల గురించి మర్చిపోండి అని వాళ్లని చూసినా ఆ ప్రస్థావన మన ఇంట్లో వద్దని అంటాడు.
బంటీ సాయి బాబాతో మా అమ్మని చూపించు బాబా అని వేడుకుంటాడు. ఇక దీపుతో రూప హోం వర్క్ చేయిస్తుంది. రూప బంటి గురించి చెప్తుంది. గాజు పెంకు గుచ్చుకోబోతే అడ్డుకున్నాడని, కారు నెట్టాడని, దీపు పడిపోబోతే పట్టుకున్నాడని చెప్తుంది. దానికి సూర్యప్రతాప్ ఏ కన్న బిడ్డో కానీ మంచోడిలా ఉన్నాడని అంటారు. ఇక దీపుతో మీ ఫ్రెండ్‌ని ఎప్పుడు తీసుకొస్తావ్ అని సూర్య అడిగితే దానికి రూప దీపు బర్త్‌డేకి పిలుస్తానని అంటుంది. ఇక రూప తండ్రితో రేపు గుడికి వెళ్దామని చెప్తుంది. ఉదయం అందరూ గుడికి వెళ్తారు. సూర్య రూప జీవితం బాగు చేసే అవకాశం తనకు ఇవ్వలేదని కనీసం నువ్వు అయినా నా బిడ్డ జీవితం చక్కదిద్దు అని కోరుకుంటాడు. ఇక బంటీ వాళ్లు మొత్తం గుడికి వస్తారు. ఇక విజయాంబిక దేవుడితో రూపని పెళ్లి చేసుకోవడం దీపక్ చిరకాల కోరిక అని ఆ కోరిక తీరాలని అనుకుంటుంది.
రేణుక రాజుకి భార్యగా బంటికీ అమ్మగా ఉండే అవకాశం ఇవ్వమని దేవుడికి దండం పెట్టుకొని బోనం ఎత్తుకుంటుంది. ఇక ముత్యాలు గుడి మెట్లకు పసుపు రాస్తే రాజు కుంకుమ పెడతాడు. రూప ఏ విషయంలోనూ తన తప్పు లేదని రాజుకి తెలిసేలా చేయమని కోరుకుంటుంది. తన బిడ్డ విషయంలోనూ రాజు అపార్థం చేసుకోకుండా చూడమని కోరుకుంటుంది. దీపుని దేవుడికి దండం పెట్టుకోమని రూప చెప్తే దేవుడి మీద నమ్మకం లేదని చెప్తాడు. అలా అనకూడదు అని సూర్య అంటే దానికి దీపు నాకు అమ్మని దూరం చేశాడని.. అమ్మకి నాన్నని దూరం చేశాడని చెప్తాడు. ఇక రాజు వాళ్లు కూడా వస్తుంటారు. దీపు అందరితో నానమ్మకి తాతయ్యని దూరం చేశాడు. మీకు అమ్మమ్మని దూరం చేశాడు అని అంటాడు. దాంతో సూర్య ప్రతాప్ గతం గుర్తు చేసుకుంటాడు.
దేవుడిని ఇలా చేయమని మీరు అడగలేదని కానీ దేవుడి ఏం చేయాలి అంటే అదే చేస్తున్నప్పుడు మనం అడగటం ఎందుకు అని అంటాడు. దాంతో రూప దీపు దేవుడికి దండం పెట్టుకో అంటుంది. ఇంతలో బంటీ వచ్చి రూప పక్కనే నిల్చొని దండం పెట్టుకుంటాడు. రూప బంటీని పలకరిస్తుంది. ఒక్కడివే వచ్చావా అంటే ఫ్యామిలీ మొత్తం వచ్చామని చెప్తాడు. మా నాన్న కూడా వచ్చారు మా నాన్నని పరిచయం చేస్తాను అంటాడు. ఇక బంటీ తాతయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. బంటీ సూర్యని ఫ్రెండ్ అంటాడు. వరసలు పెట్టడానికి మీరు ఏం అవుతారో తెలీదు కాబట్టి ఇలా పిలుస్తున్నాను అంటాడు. ఇక విజయాంబిక మాటలు బాగున్నాయి కానీ ఎలుగు బంటీ అన్నట్లు బంటీ అని ఆ పేరు ఏంటి అని అడుగుతారు. దీంతో బంటి ఉండు నీ పని చెప్తా అని అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: సత్య ఎనౌన్స్‌మెంట్‌కి ఫ్యామిలీ ఫ్యూజులు అవుట్.. క్రిష్ చేతకాని వాడంటూ విరుచుకుపడ్డ భైరవి!