అన్వేషించండి

Ammayi garu Serial Today December 10th: నిజం బయటపడుతుందని విజయాంబిక, దీపక్‌ అనాథ ఆశ్రమాన్ని కాల్చివేశారా...?

Ammayi garu Serial Today Episode December 10th: కోమలి తనపై తానే హత్యాయత్న చేయించుకుందని తెలిసిన రూప...అనాథ ఆశ్రమం వాళ్లను మళ్లీ ఇంటికి పిలుస్తుంది.కానీ రాత్రికి రాత్రే ఆశ్రమం అగ్నికి ఆహుతవుతుంది.

Ammayi garu Serial Today Episode: అమ్మాయిగారిని ఎవరు చంపాలనుకుంటున్నారోనని రాజు ఆలోచిస్తుంటాడు. విజయాంబిక,దీపక్‌పై అనుమానం కలుగుతుంది. మనం రూపను గానీ, సూర్యను గానీ చంపమని పంపితే...ఆ వెధవ అశోక్‌గాడు కోమలిని కాల్చాడేంటిరా అని విజయాంబిక తన కొడుకును అడుగుతుంది. నాకు అదే అర్థం కావడం లేదని దీపక్‌ అంటాడు. కోమలికి ప్రమాదం తప్పిందని  డాక్టర్‌ చెప్పడంతో  సూర్య కాస్త తేలికపడతాడు. ఒక్కొక్కరూ లోపలికి వెళ్లి ఆమెను పలకరిస్తారు. ఆమెను రెస్ట్‌ తీసుకోమని చెప్పి సూర్య వెళ్లిపోతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రూప.....బాడీలో బుల్లెట్‌ దిగి బతికిపోయావు. అనాథ ఆశ్రమం వాళ్లు చెప్పిన నిజం విన్నాక....మా నాన్నే నీ గుండెల్లో బుల్లెట్ దింపేవాళ్లని అంటుంది. ఆ  దేవుడే నిన్ను కాపాడాడని రూప అంటుంది. నన్ను ఆ దేవుడు కాపాడలేదని...నేనే కాపాడుకున్నానని కోమలి సమాధానమిస్తుంది. నన్ను ఎవరైనా షూట్‌ చేయాలంటే తలమీదో, గుండెలమీదో కాల్చాలి కదా... కానీ నాకు ఎలాంటి అపాయం కలగకుండా కాల్చాడంటే మీకు ఇంకా అర్థం కాలేదా ఇదంతా నా ప్లాన్ అని  చెబుతుంది. ఇంతలో విజయాంబిక కల్పించుకుని నీ ప్లాన్ అదిరిపోయింది రూప అంటుంది. మీరు ఎన్నిరకాలుగా ప్రయత్నించినా  మాతో ఇలాగే ఉంటుందని విరూపాక్షి, రూప,రాజుతో అంటుంది. మీ యాక్షన్‌కు మా రియాక్షన్ మీరు ఊహించని రీతిలో ఉంటుందని హెచ్చరిస్తుంది. దీంతో వారు బయటకు వెళ్లిపోతారు.
                      మనం ఎన్ని ప్లాన్స్ వేసినా..ఏదో ఒక రూపంలో  కోమలి తప్పించుకుంటుందని  రూప రాజుతో అంటుంది. తనను కాపాడుకోవడం కోసం ఒకరిని చంపడానికే సిద్ధపడింది అనుకున్నాం కానీ...తాను చావడానికి కూడా వెనకాడటం లేదని అంటుంది. మన టైం బాగాలేనప్పుడు  మనం కొంతకాలం సైలెంట్‌గా ఉండటమే మంచిదని విరూపాక్షి సలహా ఇస్తుంది. మీ నాన్న ఎలాగూ కోమలినే రూప అని నమ్ముతున్నారు. మనం నేరుగా వెళ్లి విషయం చెబితే...కోమలిపై దాడి చేయించింది కూడా మనమేనని  అనుమానిస్తారని అంటుంది. కొంతకాలం కోమలి జోలికి వెళ్లకుండా  ఉంటే మంచిదేమోనని అంటుంది. దీనికి రాజు ససేమిరా  అంటాడు. మనం కోమలిని వదిలేస్తే...ఆమె మరింత బలపడుతుందని చెబుతాడు. దెబ్బమీద దెబ్బ తగుతుంటేనే...తనకు ఊపిరి ఆడక బయటకు వస్తుందని అంటాడు. మరి ఎలా బయటపెట్టగలమని అంటే...రేపు ఒకసారి అనాథ శరణాలయంలో ఉన్న వాళ్లందిరనీ ఇంటికి పిలిపిద్దామని రాజు అంటాడు. ఈ విషయం బయటకు తెలియనీయకూడదని అంటాడ. వాళ్లు వస్తున్నారని తెలియబట్టే...కోమలి ఇలాంటి ప్లాన్ వేసిందని అంటాడు. అదే వాళ్లు వస్తున్నారని తెలియకపోతే...వాళ్లు ఎలాంటి ముందస్తు ప్లాన్స్ వేసుకోరని చెబుతాడు. ఎవరికీ తెలియకుండా  వాళ్లను ఇంటికి పిలిపించాలని చెబుతాడు. దీంతో విరూపాక్షి ఆశ్రమానికి ఫోన్ చేస్తుంది.
    
                              అనాథ ఆశ్రమం నుంచి వాళ్లంతా వచ్చే సమయానికి సూర్య ఇంటిలోనే ఉండేలా విరూపాక్షి పథకం వేస్తుంది. సూర్య బయటకు వెళ్లకుండా అడ్డుకోవాలని చూస్తుంది. కొంతమంది ముఖ్యమైన వాళ్లు నీతో మాట్లాడటానికి ఇంటికి వస్తున్నారని నువ్వు ఇంట్లో ఉండగలవా అని అడుగుతుంది. ఆయన సరేనంటాడు. అయితే ఈ విషయం విజయాంబిక, దీపక్‌ చాటుగా వింటారు. ఇంతలో రూప కోమలి దగ్గరకు వెళ్లి అనాథ ఆశ్రమం నుంచి నీ గురించి చెప్పడానికి చాలామంది వస్తున్నారని...ఈరోజు నువ్వు తప్పించుకునే ఛాన్సే లేదని చెబుతుంది. ఈ మాటలకు కోమలి కంగారుపడుతుంది. రూప చెప్పిన మాటలు విజయాంబిక, దీపక్‌ కూడా వింటారు. దీంతో కోమలి వాళ్ల దగ్గరకు పరుగెత్తికెళ్లి...ఏం చేయమంటారని అడుగుతుంది. దీంతో వాళ్లు ఓ నవ్వు నవ్వుతారు. నేను దొరికిపోతే మీరు కూడా దొరికిపోతారని చెప్పగా...కాసేపట్లో అన్ని విషయాలు నీకు తెలుస్తాయిలే అని విజయాంబిక అంటుంది.
                                  ఇంతలో రాజుకు ఫోన్ రావడంతో కంగారుగా కిందకు పరుగెత్తుకుంటూ వచ్చి టీవీఆన్‌ చేస్తాడు. అందులో బ్రేకింగ్ న్యూస్‌లో  రాత్రికిరాత్రే అమ్మ అనాథ శరణాలయం కాలి బూడిదైపోయిందని రావడం చూసి అందరూ షాక్‌ తింటారు. గాఢ నిద్రలో ఉన్న 30మంది అనాథలు సజీవ దహనమయ్యారని న్యూస్‌లో చెప్పడం విని విరూపాక్షి  కన్నీళ్లు పెట్టుకుంటుంది.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 8th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
Godavari Serial Today August 8th: 'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
Nindu Manasulu Serial Today August 8th: నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 8th:చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
నువ్వులేక నేను లేను: చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Dharmendra Pradhan: విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Embed widget