Rajamouli: రాజమౌళిపై మండిపడుతున్న నెటిజన్లు.. సాయం అడగడమే తప్పా..?
'బాహుబలి' పోస్ట్ ప్రొడక్షన్ లో కీలకపాత్ర పోషించిన దేవిక క్యాన్సర్ తో పోరాడుతుందని.. ఆమె వైద్యానికి సాయం చేయమని ట్విట్టర్ ద్వారా అభిమానులను కోరారు రాజమౌళి.
సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సెలబ్రిటీలపై ట్రోలింగ్ ఎక్కువైంది. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా.. చిన్న లూప్ హోల్ కనిపిస్తే చాలు ఓ రేంజ్ లో ఆడేసుకుంటూ ఉంటారు నెటిజన్లు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ట్రోలింగ్ బారిన పడ్డారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళిని సైతం ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. దానికి కారణమేంటంటే.. ఈరోజు ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు రాజమౌళి.
'బాహుబలి' పోస్ట్ ప్రొడక్షన్ లో కీలకపాత్ర పోషించిన దేవిక క్యాన్సర్ తో పోరాడుతుందని.. ఆమె వైద్యానికి సాయం చేయమని ట్విట్టర్ ద్వారా అభిమానులను కోరారు. ఆయన చేసిన ప్రయత్నం మంచిదే అయినప్పటికీ.. నెటిజన్లు మాత్రం ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.
'దేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకడివి.. భారీ రెమ్యునరేషన్ తీసుకుంటావ్.. ఆ సాయం నువ్వే చేయొచ్చుగా అని' ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.. 'సినిమాకి వంద కోట్లు తీసుకునే నువ్వు మూడు కోట్ల కోసం ఫండ్స్ రైజ్ చేస్తున్నావా..?' అంటూ మరో నెటిజన్ కామెంట్స్ చేశారు. ఇలాంటి కామెంట్స్ వరుసగా పడుతూనే ఉన్నాయి. చాలా మంది రాజమౌళిపై సెటైర్లు వేస్తూనే ఉన్నారు.
'బాహుబలి' లాంటి సినిమాకి పని చేసిన వ్యక్తి కోసం నువ్ చేసే సాయం ఇదా..? అంటూ రాజమౌళిని తిట్టిపోస్తున్నారు. నువ్వే సాయం చేయగలిగే స్టేజ్ లో ఉన్నప్పుడు ఇలా అడగడానికి సిగ్గులేదా..? అంటూ మరికొందరు ఫైర్ అవుతున్నారు. బహుశా.. రాజమౌళి తను చేసిన సాయం గురించి చెప్పి మీరు కూడా సాయం చేయండని అడిగితే ఇంత నెగెటివిటీ వచ్చేది కాదేమో.. ఇతరుల సాయం అడగడానికి ముందే తనవంతు సాయం చేసి.. అప్పుడు ట్వీట్ చేసి ఉంటే ట్రోలింగ్ నుంచి తప్పించుకునేవారు.
Worked with Devika during Baahubali. She was the coordinator for many post production works. Her passion and dedication is unmatched. Unfortunately, she is battling a blood cancer.
— rajamouli ss (@ssrajamouli) January 29, 2022
I humbly request to donate funds to the Ketto Campaign shared below. https://t.co/83umbPnI4M
Adhe baubhali ki meeru yeh 20 - 30crs theesukoni untaru kada .
— S A I ᴿᵃᵈʰᵉˢʰʸᵃᵐ 💞 (@darling111222) January 29, 2022
Oka 20- 30 lakhs meere help chesthe ayipodhi kada
3Cr Niku Pedda matter aara ,
— వరంగల్ కింగ్ 🔔 (@ShivamaniSSMB) January 29, 2022
Chi chi funds raise chestunnaru chudu ..
BB direct hindi movielo anpinchadaniki one of the reasons eema. pic.twitter.com/CvOKKo8iBm
— American dragon (@JakeIongg) January 29, 2022
Nuvu pedda Dongavi anukuntaaa
— KCR Gaari Paata 🔔 🔥🦁🔥 (@KCRTrs999) January 29, 2022
డబ్బులు ఉన్నవాళ్లు ఇలా అంటే
డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏంటిది
ఎన్నో కోట్లు సంపాదించినవు నువ్వు మళ్ళీ డొనేట్ చెయ్యమని చెప్తాను సిగ్గు లేదా నీకు