అన్వేషించండి

Movie Theaters : తెరిస్తే ఒక బాధ.. తెరవకపోతే ఇంకో బాధ!

సెకండ్ వేవ్ తరువాత జనాల్లో మార్పొచ్చింది. థియేటర్లు తెరుచుకునేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా.. పెద్దగా ఫలితం కనిపించడం లేదు. 

సినీ ఇండస్ట్రీపై కరోనా ఎంతగా ప్రభావం చూపిందో తెలిసిందే. థియేటర్లన్నీ మూసేయాల్సిన పరిస్థితి కలిగింది. అయితే ఫస్ట్ వేవ్ అన్ లాక్ ప్రక్రియలో భాగంగా థియేటర్లు తెరిచిన వెంటనే జనాలు ఎగబడి థియేటర్లకు వెళ్లారు. పాత సినిమాలను మళ్లీ థియేటర్లో విడుదల చేసి జనాలను థియేటర్లకు రప్పించగలిగారు. యాభై శాతం ఆక్యుపెన్సీతో కూడా మంచి లాభాలను చవిచూశారు. అయితే సెకండ్ వేవ్ తరువాత జనాల్లో మార్పొచ్చింది. థియేటర్లు తెరుచుకునేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా.. పెద్దగా ఫలితం కనిపించడం లేదు. 


దీనికి ఉదాహరణగా కన్నడ ఇండస్ట్రీని తీసుకోవచ్చు. కర్ణాటకలో యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకోవచ్చని ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. కర్ణాటకలో మొత్తం 600కి పైగా సింగిల్ స్క్రీన్లు ఉండగా.. 260 మల్టీప్లెక్స్ లు ఉన్నాయి. అయితే వీటిలో తొలిరోజు కేవలం పది శాతం మాత్రమే తెరుచుకున్నాయి. ఆ థియేటర్లు కూడా ప్రేక్షకులు లేకపోయేసరికి సాయంత్రానికి మూసేశారు. ఈ దెబ్బకు మిగిలిన థియేటర్ల యాజమాన్యాలు కూడా తమ థియేటర్లు తెరవడానికి వెనుకడుగు వేస్తున్నారు. 


పాత సినిమాలు వేయడానికైనా.. జనాలను థియేటర్లకు అలవాటు చేయడానికైనా.. మొదట్లో సినిమా హాళ్ల ఓనర్లు రిస్క్ తీసుకోక తప్పదు. యాభై శాతం ఆక్యుపెన్సీతో కష్టమైనా.. గతంలో అలాంటి ధైర్యం చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అలాంటి రిస్క్ తీసుకుందామన్నా.. జనాదరణ అసలు లేకపోవడం గమనార్హం. 


ఇక తెలంగాణ విషయానికొస్తే.. ఈ నెల 23 నుండి థియేటర్లు తెరుచుకుంటున్నాయి. యాజమాన్యాల రిక్వెస్ట్ మేరకు సింగిల్ స్క్రీన్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఇప్పట్లో జనాలు థియేటర్లు వచ్చేలా కనిపించడం లేదు. అందుకే ఈ మధ్యకాలంలో కాస్త పేరున్న సినిమాలను కూడా ఓటీటీలకు అమ్మేస్తున్నారు నిర్మాతలు. రీసెంట్ గా 'నారప్ప' లాంటి పెద్ద సినిమా కూడా ఓటీటీలోకే వచ్చింది. 


ఇప్పుడేమో థర్డ్ వేవ్ అంటున్నారు. ఈ భయంతో చాలా మంది నిర్మాతలు తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటించినా.. ఇప్పుడు వాయిదా వేసుకోవాలని చూస్తున్నారట. మంచి ఆఫర్లు వస్తే గనుక ఓటీటీలకు సినిమాలను అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. ఏపీలో మాత్రం థియేటర్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మొన్నామధ్య ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్ల విషయంలో కొత్త జీవోను తీసుకొచ్చింది. దీంతో ఏపీలో ఇప్పుడున్న రేట్లను బట్టి థియేటర్లు తెరుచుకునే అవకాశమే లేదనిపిస్తుంది. కానీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు మాత్రం థియేటర్లోనే విడుదల అవుతాయని వాటి మేకర్స్ చెబుతున్నారు. అదే గనుక జరిగితే జనాలు థియేటర్లకు క్యూ కట్టే ఛాన్స్ ఉంది. అప్పుడైతే థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకునే అవకాశాలు ఉన్నాయి. మరేం జరుగుతుందో చూడాలి!

టాప్ హెడ్ లైన్స్

AP News : నంది అవార్డ్స్‌కు సీఎం గ్రీన్ సిగ్నల్! - వారికి లక్ష పురస్కారం... ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
నంది అవార్డ్స్‌కు సీఎం గ్రీన్ సిగ్నల్! - వారికి లక్ష పురస్కారం... ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Lust Stories 3 OTT : ట్రెండింగ్‌లో బోల్డ్ అంథాలజీ సిరీస్ లస్ట్ స్టోరీస్ 3 - సిద్దార్థ్, అదితి రావ్ ఎపిసోడ్ డోంట్ మిస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
ట్రెండింగ్‌లో బోల్డ్ అంథాలజీ సిరీస్ లస్ట్ స్టోరీస్ 3 - సిద్దార్థ్, అదితి రావ్ ఎపిసోడ్ డోంట్ మిస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Ee Paata Korinavaaru Review - 'ఈ పాట కోరినవారు' రివ్యూ: చంద్ర సిద్ధార్ధ స్టైల్‌కు భిన్నంగా తీసిన ప్రయోగాత్మక సినిమా - ఎలా ఉందంటే?
'ఈ పాట కోరినవారు' రివ్యూ: చంద్ర సిద్ధార్ధ స్టైల్‌కు భిన్నంగా తీసిన ప్రయోగాత్మక సినిమా - ఎలా ఉందంటే?
The India Story OTT : ఓటీటీలోకి సడన్‌గా కాజల్ అగర్వాల్ కొత్త మూవీ - కోర్ట్ రూమ్ డ్రామా 'ద ఇండియా స్టోరీ' ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి సడన్‌గా కాజల్ అగర్వాల్ కొత్త మూవీ - కోర్ట్ రూమ్ డ్రామా 'ద ఇండియా స్టోరీ' ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy: ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
Human Trafficking Case: బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
AP Congress : ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
Irumudi OTT : థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?
థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?
Hyderabad Crime News: వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
యువతకు నచ్చేలా అపాచీ, రోనిన్‌లో కొత్త టెక్నాలజీ ఫీచర్లు.. ధరలు ఎంతంటే?
యూత్‌ఫుల్‌ Apache, Ronin బైకుల్లో కొత్త వేరియంట్లు, కొత్త టెక్నాలజీ
Laptop Keyboard Cleaning : ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
Embed widget