అన్వేషించండి

The Boys Season 4: ‘ది బాయ్స్’ సీజన్ 4 రిలీజ్ డేట్ ఇదే - అఫీషియల్‌గా రివీల్ చేసిన అమెజాన్!

The Boys S4: ‘ది బాయ్స్ సీజన్ 4’ జూన్ 13వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

The Boys Season 4 Release Date: అమెజాన్ ప్రైమ్‌లో ఎన్నో ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో మనదేశంలో కూడా పాపులర్ అయినవి కొన్నే. ఆ కొన్నిటిలోనే ముందు వరుసలో ఉండేది ‘ది బాయ్స్’. ఇప్పటికి మూడు సీజన్లుగా సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్న ఈ సిరీస్ నాలుగో సీజన్ రిలీజ్ డేట్‌ను అమెజాన్ అధికారికంగా ప్రకటించింది. ‘ది బాయ్స్’ నాలుగో సీజన్ జూన్ 13వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సిరీస్ విడుదల అవుతుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by prime video IN (@primevideoin)

దీనికి సంబంధించిన టీజర్ 2023 డిసెంబర్‌లోనే విడుదల అయింది. ‘ది బాయ్స్’ సిరీస్‌లో హోమ్‌ల్యాండర్ పాత్రలో ఆంటోనీ స్టార్ ప్రేక్షకులను అలరించనున్నాడు. కార్ల్ అర్బన్, ఎరిన్ మోరియార్టి, కరెన్ ఫుకుహారా కూడా కూడా ‘ది బాయ్స్ సీజన్ 4’లో కనిపించనున్నారు. ముందు సీజన్స్‌లాగానే ‘ది బాయ్స్ సీజన్ 4’లో కూడా ఆంటోనీ స్టార్ డామినేషన్ కనిపించనుందని టీజర్‌ను చూస్తే తెలుస్తోంది. హాలీవుడ్ సిరీస్ లవర్స్‌కు నచ్చే యాక్షన్, కామెడీ లాంటి ఎలిమేంట్స్‌ ‘ది బాయ్స్ సీజన్ 4’లో ఉంటాయని టీజర్‌ ద్వారా తెలిసేలా చేసింది టీమ్. 

ది బాయ్స్ బుక్ ఆధారంగా...
గార్త్ ఎన్నీస్ రాసిన ‘ది బాయ్స్’ అనే పుస్తకాన్ని ఆధారంగా తీసుకొని ఒక సినిమాను తెరకెక్కించాలని అనుకున్నాడు దర్శకుడు ఆడమ్ మెక్‌కే. కానీ ఆ తర్వాత పలు కారణాలు వల్ల ఈ స్క్రిప్ట్‌ను పక్కన పెట్టేయాల్సి వచ్చింది. దీంతో కొన్నాళ్ల వరకు ఆ స్క్రిప్ట్ గురించి ఎవరూ పట్టించుకోలేదు. 2017లో ఈ కథను వెబ్ సిరీస్‌గా డెవలప్ చేస్తున్నారని తెలుసుకున్న అమెజాన్ స్టూడియోస్ దీనికి సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకుంది.

అలా ఎన్నో కష్టాలు ఎదుర్కున్న ఈ స్క్రిప్ట్ ఫైనల్‌గా ‘ది బాయ్స్’ అనే ఒక సిరీస్‌గా 2019 జులై 26వ తేదీన అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అయ్యింది. మొదటి సీజన్ సూపర్ సక్సెస్‌ఫుల్ అవ్వడంతో ఎక్కువ ఆలస్యం చేయకుండా రెండో సీజన్‌ను ప్రారంభించారు మేకర్స్. 2020 సెప్టెంబర్ 4వ తేదీన ‘ది బాయ్స్’ రెండో సీజన్ విడుదలయ్యింది. ఇక 2022లో మూడో సిరీస్ కూడా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది.

‘ది బాయ్స్ సీజన్ 4’ను 2024 జూన్ 13వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు దించనున్నారు. ఇప్పటికే ‘ది బాయ్స్ సీజన్ 4’ రిలీజ్ డేట్ అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా ఎట్టకేలకు దీనిపై క్లారిటీ ఇచ్చారు. ‘ది బాయ్స్’ మునుపటి సీజన్స్‌లో కొన్ని ఎపిసోడ్స్ డైరెక్ట్ చేసిన ఫిల్ స్గ్రారిక్కియా ‘ది బాయ్స్ సీజన్ 4’లోని మొదటి ఎపిసోడ్ డైరెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.

అయితే ఈసారి ‘ది బాయ్స్ సీజన్ 4’లో కూడా ఎనిమిది ఎపిసోడ్లు ఉన్నట్టు సమాచారం. ‘ది బాయ్స్’ మొదటి మూడు సీజన్లలోనూ ఎనిమిదేసి ఎపిసోడ్లు ఉన్నాయి. ఈ ఎనిమిది ఎపిసోడ్లకు సంబంధించిన టైటిల్స్ కూడా రివీల్ అయిపోయాయి. 

టాప్ హెడ్ లైన్స్

Anil Ravipudi: అనిల్ రావిపూడి మంచి మనసు... 'డ్రామా జూనియర్స్ 9' చిన్నారికి సాయం... అమ్మకు యాక్సిడెంట్ అయితే?
అనిల్ రావిపూడి మంచి మనసు... 'డ్రామా జూనియర్స్ 9' చిన్నారికి సాయం... అమ్మకు యాక్సిడెంట్ అయితే?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: శకుంతల వర్సెస్ విహారి! లక్ష్మీ జాడ విహారికి తెలుస్తుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: శకుంతల వర్సెస్ విహారి! లక్ష్మీ జాడ విహారికి తెలుస్తుందా!
Namitha New Look : అప్పుడు అలా... ఇప్పుడు ఇలా - స్లిమ్ అండ్ స్టైలిష్ లుక్‌లో టాలీవుడ్ హీరోయిన్
అప్పుడు అలా... ఇప్పుడు ఇలా - స్లిమ్ అండ్ స్టైలిష్ లుక్‌లో టాలీవుడ్ హీరోయిన్
Mahaprabhu Jagannath Release Date : మహాప్రభు జగన్నాథ్‌ రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
మహాప్రభు జగన్నాథ్‌ రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget