అన్వేషించండి

తమిళ స్టార్ హీరోలకు నిర్మాతల సంఘం రెడ్ కార్డు - తర్వాత ఏం అవుతుంది?

ప్రముఖ తమిళ హీరోలు ధనుష్, శింబు, విశాల్, అథర్వలకు అక్కడి నిర్మాతల సంఘం రెడ్ కార్డు జారీ చేసింది.

తమిళ నాట పలువురు స్టార్ హీరోలకు ఎదురు దెబ్బ తగిలింది.  ధనుష్, శింబు, విశాల్, అథర్వలకు నిర్మాతల సంఘం రెడ్ కార్డు జారీ చేసింది. గతంలో వీరి ప్రవర్తన కారణంగా కొందరు నిర్మాతలకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. దీంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు నిర్మాతల సంఘం తెలిపింది.

తమిళ స్టార్ హీరో ధనుష్, ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తేనండాల్ ఫిలిమ్స్‌ బ్యానర్‌లో ఒక చిత్రానికి దర్శకత్వం వహించాల్సి ఉంది. 2018లోనే ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా ఘనంగా జరిగింది. తెలుగు హీరో నాగార్జున ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు అప్పట్లో అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు. దీంతో నిర్మాతలకు ఎంతో నష్టం వాటిల్లింది.

ప్రస్తుతం విశాల్‌ ‘మార్క్ ఆంటోని’ సినిమాకు దర్శకత్వం వహించిన ఆదిక్ రవిచంద్రన్... 2017లో శింబుతో ‘అన్బానవన్ అసరదావన్ అడంగదావన్’ అనే చిత్రం తెరకెక్కించారు. ఆ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే శింబు మధ్యలో వెళ్లిపోయారు. శింబు 76 రోజులు షూటింగ్ చేయాల్సి ఉండగా... కేవలం 38 రోజులు మాత్రమే షూట్ చేశాడని, ఈ కారణంగా తమకు ఎంతో నష్టం వచ్చిందని ఆ సినిమా నిర్మాత మైకేల్ రాయప్పన్ ఆరోపించారు.

అసోసియేషన్ నిధులు దుర్వినియోగం చేశాడని నటుడు విశాల్‌పై ఆరోపణలు వచ్చాయి. దీని కారణంగా అతనికి కూడా రెడ్ కార్డును ఇష్యూ చేశారు. విశాల్ నటించిన ‘మార్క్ ఆంటోని’ రిలీజ్ ఆపివేయాలని లైకా ఎంటర్‌టైన్‌మెంట్స్ కూడా ఇటీవలే కోర్టులో కేసు వేసింది. కానీ కోర్టు సినిమా విడుదలకు అనుమతిని ఇచ్చింది.

2018లో ఎట్సెట్రా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అథర్వ హీరోగా ‘సెమ్మ బోత ఆగతే’ అనే సినిమాను మతియళగన్ నిర్మించారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేసింది. దీంతో అదే నిర్మాతకు మరో సినిమా చేస్తానని అథర్వ మాటిచ్చారు. కానీ ఇంతవరకు సినిమా చేయలేదు. దీని కారణంగా అథర్వకు కూడా నిర్మాతల సంఘం రెడ్ కార్డు జారీ చేసింది. 

దీనిపై ఆయా నటులు ఇంకా స్పందించలేదు. ఈ లిస్టులో ఉన్న అందరు హీరోల చేతిలోనూ ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ ప్రాజెక్టులే ఉన్నాయి. అలాగే త్వరలో మరింత మంది నటులకు రెడ్ కార్డులు జారీ అవుతాయని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Toxic Trailer Review : టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్, యాక్షన్, వయలెన్స్ అంతకు మించి...
టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్, యాక్షన్, వయలెన్స్ అంతకు మించి...
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Agadha Story : అగధ ఓ సరికొత్త ప్రపంచం - సీక్వెల్ ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు... హీరో శ్రవణ్ రెడ్డి రియాక్షన్
అగధ ఓ సరికొత్త ప్రపంచం - సీక్వెల్ ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు... హీరో శ్రవణ్ రెడ్డి రియాక్షన్
Sanjeev Movie OTT : నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్
నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget